t20 world cup memories
-
'శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు.. ప్రపంచకప్‌ను పట్టుకున్నాడు'
సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. ఇదే రోజున టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. జోహన్స్ బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను ధోని సేన ముద్దాడింది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండా.. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కాగా 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయాన్ని మరోసారి గుర్తుచేసుకునేందుకు స్టార్ స్పోర్ట్స్" ది రీయూనియన్ ఆఫ్ 07" అనే షోను నిర్వహించింది. ఈ షోలో తొలి పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యులుగా ఉన్న ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌లో తమ మధుర జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు. శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు.. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడూతూ.. 2007 టీ20 ప్రపంచకప్ సమయంలో సోషల్ మీడియా లేదు. కానీ ఫైనల్లో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్‌తో తలపడడం అంత సులభం కాదని అంతా చర్చించుకున్నారు. నిజంగానే ఫైనల్లో మాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఫైనల్లో నా నాలుగు ఓవర్లు కోటా పూర్తి చేసిన తర్వాత నేను చాలా అలసిపోయాను. నా కెరీర్లో ఎప్పుడూ ఇంత అలసిపోలేదు. ఆ సమయంలో నాకు కొంచెం కూడా ఓపిక లేదు. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు, అతడు ప్రపంచకప్‌ను పట్టుకున్నాడు’’అని పేర్కొన్నాడు. రోహిత్ ఇన్నింగ్స్ చాలా కీలకం ఇక రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కోసం ఆర్పీ సింగ్ మాట్లాడూతూ.. రోహిత్ అడిన ఇన్నింగ్స్ చాలా కీలకంగా మారింది. మేము 18 ఓవర్లలో 130 పరుగులు సాధించాము. ఆ సమయంలో రోహిత్ అఖరి రెండు ఓవర్లలో 27 పరుగులు సాధించడంతో.. మా స్కోర్ బోర్డ్ 157 పరుగులకు చేరింది. దీంతో 158 పరుగులు చేధించడం పాక్ కష్టంగా మారిందిని అతడు తెలిపాడు. కాగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. చదవండి: IND VS AUS: రోహిత్ ఆ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు: సునీల్ గవాస్కర్ -
టీమిండియా చరిత్ర సృష్టించి నేటికి 14 ఏళ్లు..
Teamindia Beat Pakistan To Lift Inaugural T20 World Cup On This Day: పొట్టి క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించి నేటికి 14 ఏళ్లు అవుతుంది. 2007 సెప్టెంబర్ 24న టీమిండియా తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌కు కైవసం చేసుకుని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ధోని నేతృత్వంలో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ధోని సేన 5 పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. అంతకుముందు కపిల్ నేతృత్వంలో భారత జట్టు 1983 వన్డే ప్రపంచకప్ నెగ్గింది. జోహెనస్‌బర్గ్ వేదికగా జరిగిన ఆ తుది సమరంలో ధోని ప్రపంచకప్‌కు ముద్దాడటం భారత్ క్రికెట్ అభిమానుల మదిలో నేటికీ మెదులుతూనే ఉంది. దీని తర్వాత మరోసారి టీమిండియా ధోని నేతృత్వంలోనే వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా(2011) అవతరించినా.. తొలి పొట్టి ప్రపంచకప్ గెలవడం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. మ్యాచ్ ఆఖరి ఓవర్లో పాక్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ ఆడిన స్కూప్ షాట్‌కు శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌ను ఏ భారత క్రికెట్ అభిమాని మర్చిపోలేడు. ఏమాత్రం అనుభవం లేని జోగిందర్ సింగ్‌తో ఆఖరి ఓవర్ బౌల్ చేయించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ధోనిపై యావత్ క్రికెట్ ప్రపంచం పొగడ్తల వర్షం కురిపించింది. ఇక, మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్((54 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో రోహిత్ శర్మ(16 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించాడు. పాక్ బౌలర్లలో ఉమర్ గుల్కు 3 వికెట్లు దక్కగా, సోహైల్ తన్వీర్, మహ్మద్ ఆసిఫ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో పాక్.. పడుతూ లేస్తూ లక్ష్యానికి మరో 5 పరుగుల దూరంలో(19.3 ఓవర్లలో 152) ఆలౌటైంది. భారత బౌలర్లు ఇర్ఫాన్ పఠాన్(3/16), ఆర్పీ సింగ్(3/26), జోగిందర్ శర్మ(2/20), శ్రీశాంత్(1/44) పాక్ నడ్డివిరిచారు. మూడు వికెట్లతో పాక్‌కు దెబ్బకొట్టిన ఇర్ఫాన్ పఠాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. పాక్ ప్లేయర్ షాహిద్ అఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. చదవండి: బౌండరీ కొట్టగానే శ్రీశాంత్ స్టైల్‌ను దింపేశాడు.. -
ఆరు సిక్సర్లు గుర్తున్నాయా?.. రీక్రియేట్ చేసేశాడు
Yuvraj Singh Six Balls 6 Sixes Recreation.. టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అంటే మొదటగా గుర్తుకువచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు. 2007 టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ ఈ ఫీట్‌ను సాధించాడు. అంతకముందు ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని బ్రాడ్‌కు చుక్కలు చూపించాడు. బ్రాడ్ వేసిన 19 ఓవర్లో యువీ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. నేటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా యువీ పేరిటే ఉంది. కాగా ఈ సెప్టెంబర్ 19తో యువీ ఇన్నింగ్స్ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చదవండి: యువీ సిక్సర్ల సునామీ.. ఆ విధ్వంసం జరిగి నేటికి 14 ఏళ్లు టి20 ప్రపంచకప్ 2007లో యువీ ఆరు బంతులు ఆరు సిక్సర్లు తాజాగా యువరాజ్ దానిని మరోసారి గుర్తుచేస్తూ తన యూట్యూబ్ చానెల్లో రిక్రియేట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. వీడియో ఓపెన్ చేయగానే.. బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న యువీని చూస్తాం. ఇంట్లో కాబట్టి తలకు బండి హెల్మెట్ పెట్టుకొని కనిపిస్తాడు. బ్యాట్ తీసుకొని గ్రౌండ్లోకి ఎంటరవబోతుంటే ఒక వ్యక్తి అడ్డుపడుతాడు. ఏంటి అని అడిగితే.. మీరు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టింది ఈ బ్యాట్‌తోనే అంటూ యువీ ఆ ఇన్నింగ్స్ గుర్తుగా దాచుకున్న హీరోహోండా బ్యాట్‌ను చూపించాడు. ఇప్పడు అంత టైం లేదని చెప్పాడు. చదవండి: INDW VS AUSW: తొలి వన్డేలో టీమిండియా చిత్తు.. ఆసీస్ రికార్డు విజయం కట్‌చేస్తే తన ఇంటి ఆవరణలోని మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో గొడవ పడుతున్నట్లు చూపించాడు. ఆ తర్వాత స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ వస్తున్నట్లు తనే కామెంటరీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవను గుర్తు చేస్తూ తాను కొట్టిన ఒక్కో సిక్సర్‌ను చూపించాడు. అలా వీడియో మొత్తంలో ఆరు సిక్సర్లు కొట్టిన విధానాన్ని యాక్టింగ్ చేసి చూపించాడు. ఇక చివర్లో ''నా యాక్టింగ్ గురించి మీరేమనుకుంటున్నారు.. బాలీవుడ్ లెవల్లో ఉందా.. ప్లీజ్ కామెంట్ చేయండి..'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: Viral Video: ఔటయ్యాననే కోపంతో బ్యాట్ విసిరాడు.. అది కాస్తా.. -
యువీ సిక్సర్ల సునామీ.. నేటికి ఆ పెను విధ్వంసానికి 14 ఏళ్లు
Yuvraj Singh 6 Sixes In T20 World Cup 2007: సరిగ్గా 14 ఏళ్ల క్రితం పొట్టి ఫార్మాట్లో పెను విధ్వంసం చోటు చేసుకుంది. 2007 సెప్టెంబర్ 19న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది పొట్టి క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19 ఓవర్లో యువీ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈక్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. నేటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా యువీ పేరిటే ఉంది. ఆ ఇన్నింగ్స్‌లో 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్.. 7 భారీ సిక్సర్లు సహా 3 ఫోర్లు బాది 58 పరుగులు చేశాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో టీమిండియా 218 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా ఛేదనలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. యువీకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు.. -
టీమిండియా మరోసారి కాలర్ ఎగరేసిన రోజు!
క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ.. క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించాలనే ఉద్దేశంతో ఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది టీ20 ప్రపంచకప్. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో ప్రారంభమైన ఈ పొట్టి ఫార్మట్ ప్రపంచకప్‌పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ముఖ్యంగా టీమిండియాపై. ఎందుకంటే అప్పటికీ టీమిండియాకు టీ20 వంటబట్టలేదు. ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టే సరికి కేవలం ఒకే ఒక్క టీ20 ఆడిన అనుభవం. పూర్తిగా యువకులతో కూడిన జట్టు.. అందులోనూ సారథిగా ఎంఎస్ ధోనికి తొలి సవాల్. ఈ మెగా టోర్నీకి కొద్ది నెలల ముందు వెస్టిండీస్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ చేదు అనుభవాలు అందరిలోనూ కదలాడుతూనే ఉన్నాయి. దీంతో టీమిండియా మహా అంటే ఒకటో రెండో గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అడ్డంకులన్నింటినీ జయించి.. టీ20 ప్రపంచకప్ గెలిచి.. ప్రతీ ఒక్క టీమిండియా అభిమాని మరోసారి(1983 ప్రపంచకప్ విజయం తర్వాత) కాలర్ ఎగరేసేలా చేసింది అప్పటి ధోని గ్యాంగ్. సరిగ్గా నేటికి పుష్కర కాలం అయింది.. ఐసీసీ తొలి టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచి. ఆ మధుర క్షణాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కొత్త విధానం బౌలౌట్‌తో గెలవడం.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్-శ్రీశాంత్‌ల మధ్య జరిగిన సమరం.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టడం.. ఫైనల్ మ్యాచ్‌లో జోగిందర్ శర్మ బౌలింగ్‌లో మిస్బావుల్ హక్ క్యాచ్‌ను శ్రీశాంత్ అందుకోవడం.. టీమిండియా కప్ గెలవడం.. ఫైనల్ మ్యాచ్ అయిపోయాక ధోని తన టీషర్ట్‌ను బుల్లి అభిమానికి గిఫ్ట్‌గా ఇవ్వడం.. ఈ సంఘటనలన్నీ మరోసారి అందరికీ గుర్తొస్తున్నాయి. టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచి నేటికి పన్నెండేళ్లు పూర్తైన సందర్భంగా బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేస్తూ ఓ వీడియో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రపంచకప్‌కు సంబంధించిన సంఘటనలను, ఫోటోలను నెటిజన్లు పోస్ట్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సాగిందిలా.. స్కాట్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అనంతరం పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠపోరు మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో ఈ టోర్నీలో ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన బౌలౌట్ విధానంతో టీమిండియా గెలిచి పాక్‌కు షాక్ ఇచ్చింది. పాక్‌పై గెలుపుతో జోరుమీదున్న ధోని సేనను న్యూజిలాండ్ కంగుతినిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కివీస్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న భారత్ ఇంగ్లండ్‌తో జరిగిన తరువాతి మ్యాచ్‌లో అదరగొట్టింది. యువీ సిక్సర్ల వర్షంతో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదే జోరులో ఆతిథ్య దక్షిణాఫ్రికాను 37 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీఫైనల్‌కు ప్రవేశించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియపై సమిష్టిగా ఆడటంతో 15 పరుగుల తేడాతో విజయం అందుకొని ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ పోరులో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాక్‌పై ఉత్కంఠ పోరులో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా తొలి టీ20 ప్రపంచకప్‌ను అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. This day, in 2⃣0⃣0⃣7⃣#TeamIndia were crowned World T20 Champions 😎🇮🇳 pic.twitter.com/o7gUrTF8XN — BCCI (@BCCI) September 24, 2019 చదవండి: యువీ.. నీ మెరుపులు పదిలం ఈరోజు ధోనికి వెరీ వెరీ స్పెషల్ -
భారత్... ఐదు అత్యుత్తమ క్షణాలు
ఇప్పటివరకూ భారత్ అనేక టి20 మ్యాచ్‌లు ఆడింది. కానీ టి20 ప్రపంచకప్ అనగానే కళ్లముందు మెదిలే కొన్ని చిరస్మరణీయ విజయాలు, ప్రదర్శనలు ఉన్నాయి. వాటిని ఒకసారి అవలోకనం చేసుకుందాం... భలే భలే బౌల్డ్ అవుట్ వేదిక: డర్బన్, తేదీ: సెప్టెంబర్ 14, 2007 ఫలితం: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ‘టై’ బౌల్డ్ అవుట్లో 3-0తో టీమిండియా విజయం ఏం జరిగింది: ముందుగా భారత్ 9 వికెట్లకు 141 పరుగులు చేయగా, పాక్ కూడా 7 వికెట్లకు సరిగ్గా 141 పరుగులు చేసింది. దాంతో ఫుట్‌బాల్‌లో ఉండే పెనాల్టీ షూటౌట్ తరహాలో తొలిసారి ‘బౌల్డ్ అవుట్’ను నిర్వహించారు. బ్యాట్స్‌మన్ లేకుండా బౌలింగ్‌తో స్టంప్స్‌ను పడగొట్టాలి. భారత్‌నుంచి సెహ్వాగ్, హర్భజన్, ఉతప్ప సఫలం కాగా... పాక్‌నుంచి అరాఫత్, గుల్, ఆఫ్రిది కనీసం స్టంప్స్ దగ్గరగా కూడా బంతి వేయలేకపోయారు. ఒక్క షాట్ ఆటను మార్చేసింది వేదిక: జొహన్నెస్‌బర్గ్ తేదీ: సెప్టెంబర్ 24, 2007 ఫలితం: ఫైనల్లో 5 పరుగులతో పాక్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. ఏం జరిగింది: భారత్ ముందుగా 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ 19 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్లకు 145 పరుగులు చేసింది. జోగీందర్ శర్మ వేసిన చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా, తొలి రెండు బంతులకు 7 పరుగులు వచ్చాయి. మూడో బంతిని షార్ట్ ఫైన్ లెగ్ మీదుగా స్కూప్ షాట్ ఆడబోయి మిస్బా, శ్రీశాంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో టి20ల్లో కొత్త చరిత్ర మొదలైంది. ఒకే ఒక్కడు... వేదిక: సెయింట్ లూసియా, తేదీ: మే 2, 2010 ఫలితం: దక్షిణాఫ్రికాపై 14 పరుగులతో భారత్ విజయం ఏం జరిగింది: భారత్ 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. సురేశ్ రైనా 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. టి20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు భారత్ తరఫున ఇదొక్కటే సెంచరీ కావడం విశేషం. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 172 పరుగులు చేసింది. భజ్జీ మాయాజాలం వేదిక: కొలంబో, తేదీ: 23 సెప్టెంబర్, 2012 ఫలితం: 90 పరుగులతో ఇంగ్లండ్‌పై విజయం ఏం జరిగింది: భారత్ 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఆ తర్వాత హర్భజన్ సింగ్ (4/12) కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఇంగ్లండ్ 80 పరుగులకే కుప్పకూలింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులో పునరాగమనం చేసిన భజ్జీ ఈ మ్యాచ్‌తో తన సత్తా చూపించాడు. ఏకంగా 17 డాట్ బాల్స్ వేశాడు. అశ్విన్ తిప్పేశాడు వేదిక: మిర్పూర్, తేదీ: మార్చి 30, 2014 ఫలితం: ఆస్ట్రేలియాపై 73 పరుగులతో భారత్ ఘనవిజయం ఏం జరిగింది: యువీ అర్ధ సెంచరీతో భారత్ ముందుగా 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. అయితే అశ్విన్ దెబ్బకు కంగారూలు 86 పరుగులకే చేతులెత్తేశారు. పూర్తి కోటా కూడా బౌలింగ్ చేయకుండా 20 బంతులే వేసిన అశ్విన్ 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రతీ ఓవర్లో ఒక్కో వికెట్ తీసిన అశ్విన్ ఆసీస్‌ను ఘోరంగా దెబ్బ తీశాడు. - సాక్షి క్రీడావిభాగం