స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత
బర్మింగ్హామ్: ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్ గా నిలిచాడు. వెస్టిండీస్ తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బ్రాడ్ ఈ ఘనతను సాధించాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ లో బ్రాడ్ మూడు వికెట్లు సాధించి 384వ టెస్టు వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ సర్ ఇయాన్ బోథమ్(383) రికార్డును బ్రాడ్ అధిగమించాడు. అయితే జేమ్స్ అండర్సన్ 492 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
మూడు రోజుల్లో ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 209 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఫాలో ఆన్ ఆడిన విండీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 137 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ కు ఇన్నింగ్స్ విజయం లభించింది. విండీస్ ఆటగాళ్లలో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్ వైట్(40)మినహా ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ మూడు వికెట్లు సాధించగా, అండర్సన్, రోలాండ్ జోన్స్, మొయిన్ అలీలు తలో రెండు వికెట్లు తీశారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 514/8 డిక్లేర్డ్
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 168 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 137 ఆలౌట్