PC:IPL.com
ఐపీఎల్-2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా మంగళవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. అయితే ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.
మిగితా మూడు మ్యాచ్‌ల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఆర్సీబీ జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్ మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమవుతున్నారు. కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్‌వెల్, గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. బౌలింగ్‌లో కూడా ఆర్సీబీ పూర్తిగా తేలిపోతోంది. మరి లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీకి ఏ మెరకు రాణిస్తుందో వేచి చూడాలి.
ఈ నేపథ్యంలో ఆర్సీబీని ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ వంటి స్టార్‌డమ్ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని బ్రాడ్ తెలిపాడు.
ఆర్సీబీపై చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు కారణం వారు ఒక్కసారి కూగా టైటిల్‌ను గెలవకపోవడం. తొలి సీజన్ నుంచి ఆర్సీబీ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికి ట్రోఫీని ఎందుకు గెలవలేకపోయిందో నాకు అర్ధం కావడం లేదు. డివిలియర్స్, గేల్ వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఆర్సీబీకి ఆడారు. విరాట్ కోహ్లి ఇంకా ఆర్సీబీతోనే ఉన్నాడు..
ప్రతీ సీజన్‌లోనూ విరాట్ తన వంతు న్యాయం చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుత సీజన్‌లో విరాట్ మినహా మిగితా ఏ బ్యాటర్ కూడా తమ స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నారు.
మాక్స్‌వెల్, ఫాప్ డుప్లెసిస్ తిరిగి ఫామ్‌లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. నావరకు అయితే ఆర్సీబీ బౌలింగ్ పరంగా చాలా వీక్‌గా ఉంది. వారు ఇద్దరు ఓవర్సీస్ బౌలర్లతో బరిలోకి దిగాలని నేను భావిస్తున్నాను. తదుపరి మ్యాచ్‌లకు లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ రీస్ టోప్లీ ,లాకీ ఫెర్గూసన్‌లను తీసుకువస్తే బాగుంటుంది. కెమరూన్ గ్రీన్, జోషఫ్‌ను కొన్ని మ్యాచ్‌లకు పక్కనపెట్టాల్సిన అవసరముందని స్టార్ స్పోర్ట్స్ షోలో బ్రాడ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment