'ఆ బౌలర్ గురించి మాకు బెంగలేదు'
లండన్ : తమ జట్టు పాక్ పేసర్ మహమ్మద్ అమీర్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఇంగ్లండ్ పేసర్, టాప్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ అన్నాడు. ప్రత్యర్ధి జట్టులో అతడు కూడా సభ్యుడు, అంతే కానీ అతడిని గురించి మా ఆటగాళ్లు అంతగా ఆలోచించడం లేదని వ్యాఖ్యానించాడు. 2010లో జరిగిన లార్డ్స్ టెస్టు సమయంలో ఫిక్సింగ్ ఆరోపణలతో పాక్ బౌలర్పై ఐదేళ్ల నిషేధం పడింది. వచ్చే ఏడాది పాక్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఓ సిరీస్ జరగనుంది.
18 ఏళ్లకే 50 వికెట్లు తీసిన ఘనత అమీర్కు దక్కింది. కానీ అదే వయసులో ఫిక్సింగ్ కుభకోణంలో చిక్కుకున్నాడు. ఐదేళ్ల నిషేధంతో పాటు అతడికి ఆరు నెలల జైలు శిక్ష పడగా మూడు నెలల తర్వాత విడుదలైన విషయం విదితమే. ఈ తరుణంలో ఇంగ్లండ్ జట్టుతో సిరీస్లో పేసర్ అమీర్ చోటుదక్కించుకుంటాడా లేదా అనే విషయంపై అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారని బ్రాడ్ తెలిపాడు. మా లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్లే ప్రయత్నంలో యాషెష్ సిరీస్లో విజయాన్ని సాధించామని వివరించాడు.