పాకిస్తాన్ క్రికెట్‌కు 24 గంటలు తిరగకముందే మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ శనివారం (డిసెంబర్ 14) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అమీర్ వెల్లండిచాడు.
"అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించిన తర్వాత ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. రాబోయో తరానికి అవకాశమిచ్చేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నాను. పాకిస్తాన్ క్రికెట్‌కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం.
తన ప్రయాణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు"అని రిటైర్మెంట్ నోట్‌లో అమీర్ పేర్కొన్నాడు.కాగా అమీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ఇది రెండో సారి. బోర్డుతో విబేధాలు కారణంగా 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన అమీర్.. మళ్లీ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
పాక్ తరపున అమీర్ తన కెరీర్‌లో 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఓవరాల్‌గా 158 మ్యాచ్‌లు ఆడిన అమీర్.. 271 వికెట్ల పాటు 1,179 పరుగులు చేశాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరపున అమీర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2017లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అమీర్ కీలక పాత్ర పోషించాడు.
కాగా మరో పాక్ ఆటగాడు ఇమాద్ వసీం రిటైర్మెంట్ ప్రకటించిన 24 గంటల తర్వాత అమీర్ తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. వీరిద్దరూ ఫ్రాంచైజీ క్రికెట్‌లో బిజీబిజీగా ఉన్నారు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment