అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది.
అయితే ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు జట్టు నుంచి రిలీజ్ అయిన పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు. అదే విధంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లో పాక్ జట్టులో భాగమైన ఆల్ రౌండర్ సల్మాన్ అలీ అఘా,ఫాస్ట్ బౌలర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్‌లను సైతం ఈ పొట్టి ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదు.
అంతేకాకుండా ఈ మెగా టోర్నీకి పాక్ సెలక్షన్ కమిటీ రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం గమనార్హం. ఇక ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
టీ20 వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment