పాకిస్తాన్‌ జట్టు ప్రకటన! 4 ఏళ్ల‌ త‌ర్వాత స్టార్ క్రికెట‌ర్ రీ ఎంట్రీ | Sakshi
Sakshi News home page

PAK vs NZ: కివీస్‌తో టీ20 సిరీస్‌.. పాక్‌ జట్టు ప్రకటన! 4 ఏళ్ల‌ త‌ర్వాత స్టార్ క్రికెట‌ర్ రీ ఎంట్రీ

Published Tue, Apr 9 2024 4:58 PM

Amir to make comeback after 4 years as PAK announce squad for series vs NZ - Sakshi

స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెనుక్కి తీసుకున్న పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్‌,  ఆల్‌రౌండ‌ర్‌ ఇమాద్ వ‌సీంకు ఈ జ‌ట్టులో చోటు ద‌క్కింది. వీరిద్ద‌రితో పాటు యువ ఆట‌గాడు ఉస్మాన్ ఖాన్,  అన్‌క్యాప్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. 

అదే విధంగా ఈ సిరీస్‌తో బాబ‌ర్ ఆజం మ‌ళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు.  మ‌రోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన యువ ఓపెన‌ర్ సైమ్‌ అయూబ్‌ను సైతం సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. ఇక మ‌హ్మ‌ద్ అమీర్ పాకిస్తాన్ త‌ర‌పున చివ‌ర‌గా 2020లో ఆడాడు. 

ఆ త‌ర్వాత బోర్డుతో విభేదాల కార‌ణంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు అమీర్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అయితే  ఇప్పుడు బోర్డు కొత్త చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ సూచ‌న‌ల మెర‌కు అమీర్ త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాడు.

మ‌రోవైపు ఇమాద్ వ‌సీం కూడా గ‌తేడాది అంత‌ర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు ప‌లికాడు. కానీ పీసీబీ అధికారులతో చర్చలు జ‌రిపి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రికి వ‌హాబ్ రియాజ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఏప్రిల్ 18 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

కివీస్‌తో టీ20ల‌కు పాక్ జ‌ట్టు
బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్ (వికెట్ కీప‌ర్‌), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీప‌ర్‌), మహ్మద్ అమీర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్, ఉస్మాన్ ఖాన్, జమాన్ ఖాన్

నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: హసీబుల్లా, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్ మరియు సల్మాన్ అలీ అఘా
 

Advertisement
Advertisement