Imad Wasim
-
పాక్ క్రికెట్‌కు భారీ షాక్.. 24 గంటల్లోనే ఇద్దరి స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్
పాకిస్తాన్ క్రికెట్‌కు 24 గంటలు తిరగకముందే మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ శనివారం (డిసెంబర్ 14) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అమీర్ వెల్లండిచాడు."అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించిన తర్వాత ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. రాబోయో తరానికి అవకాశమిచ్చేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నాను. పాకిస్తాన్ క్రికెట్‌కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం.తన ప్రయాణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు"అని రిటైర్మెంట్ నోట్లో అమీర్ పేర్కొన్నాడు.కాగా అమీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ఇది రెండో సారి. బోర్డుతో విబేధాలు కారణంగా 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన అమీర్.. మళ్లీ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. పాక్ తరపున అమీర్ తన కెరీర్లో 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఓవరాల్‌గా 158 మ్యాచ్‌లు ఆడిన అమీర్.. 271 వికెట్ల పాటు 1,179 పరుగులు చేశాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరపున అమీర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2017లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అమీర్ కీలక పాత్ర పోషించాడు. కాగా మరో పాక్ ఆటగాడు ఇమాద్ వసీం రిటైర్మెంట్ ప్రకటించిన 24 గంటల తర్వాత అమీర్ తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. వీరిద్దరూ ఫ్రాంచైజీ క్రికెట్లో బిజీబిజీగా ఉన్నారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా -
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాకింగ్ నిర్ణయం
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ఇమాద్ సోషల్‌మీడియా వేదికగా తన రిటైర్మెంట్ సందేశాన్ని పంపాడు.దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అందులో పేర్కొన్నాడు. పాకిస్తాన్‌కు ఆడుతున్న ప్రతి క్షణం మరచిపోలేనిదని అన్నాడు. అభిమానుల ప్రేమ మరియు వారి తిరుగులేని మద్దతుకు ధన్యవాదాలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా దేశవాలీ మరియు ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడటం కొనసాగిస్తానని వెల్లడించాడు.35 ఏళ్ల ఇమాద్ 2015లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇమాద్‌కు టీ20 స్పెషలిస్ట్‌గా పేరుంది. ఇమాద్ పాక్ తరఫున 55 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. వన్డేల్లో 986 పరుగులు, 44 వికెట్లు.. టీ20ల్లో 554 పరుగులు, 73 వికెట్లు తీశాడు. ఇమాద్ ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీలకు అడుతున్నాడు. ఇమాద్ 2019లో పాక్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇమాద్ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 2024 టీ20 వరల్డ్‌కప్ కోసం అతను తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. -
కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు. బాబర్ ఆజం బృందం ఆట తీరును విమర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఐసీసీ ఈవెంట్లలో దాయాది పాక్‌పై భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన మరోసారి పాక్‌ను విజయానికి దూరం చేసింది.చివరి వరకు నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాకిస్తాన్.. భారత్‌ను 119 పరుగులకే కట్టడి చేసింది.నసీం షా, హ్యారిస్ రవూఫ్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ఆమిర్ రెండు, షాహిన్ ఆఫ్రిది ఒక్కో పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(31) శుభారంభం అందించినా.. మిగిలిన వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుత రీతిలో బౌలింగ్ చేస్తూ.. పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు పరుగులు రాబట్టడం పక్కనపెడితే వికెట్‌ను ఎలా కాపాడుకోవాలో తెలియక బ్యాటర్లు తలలు పట్టుకున్నారు.ఉద్దేశపూర్వకంగానే?ఈ క్రమంలో నత్తనడకన సాగిన పాక్‌కు ఇన్నింగ్స్ 113 పరుగుల వద్ద ముగిసిపోయింది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో పాక్‌కు ఓటమి తప్పలేదు. ఇక పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రిజ్వాన్ 44 బంతుల్లో 31 పరుగులు చేయగా.. ఇమాద్ వసీం అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు.ఇమాద్ వసీం 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులే చేశాడు. మిగతా వాళ్లు కూడా బుమ్రా ‘డాట్’ మ్యాజిక్కు చిత్తై చెత్త స్ట్రైక్‌రేటు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ ఇమాద్ వసీంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇమాద్ ఇన్నింగ్స్ గమనిస్తే.. అతడు ఉద్దేశపూర్వకంగానే బంతులు వృథా చేసినట్లు అనిపించిందని ఆరోపించాడు. అతడి వల్లే లక్ష్య ఛేదన మరింత సంక్లిష్టంగా మారిందని సలీం మాలిక్ విమర్శించాడు. చదవండి: వాళ్ల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం.. రెండు గెలిస్తేనే: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ తొలి మ్యాచ్‌కు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం(జూన్ 6)న డల్లాస్ వేదికగా యూనైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు ఊహించని షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం గాయం కారణంగా అమెరికాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. వసీం ప్రస్తుతం ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. "ఈ క్రమంలోనే వసీం తమ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ధృవీకరించాడు. ఇమాద్ వసీం ప్రస్తుతం ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అతడు మా తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నానని" ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో ఆజం పేర్కొన్నాడు. కాగా వసీం తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని పాకిస్తాన్ తరపున రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ తుది జట్టు(అంచనా)మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సయీమ్ అయూబ్, బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఆజం ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ , షాహీన్ అఫ్రిది, మహ్మద్ అమీర్, నసీమ్ షా. -
పాకిస్తాన్ జట్టు ప్రకటన! 4 ఏళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ
స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్న పేసర్ మహ్మద్ అమీర్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంకు ఈ జట్టులో చోటు దక్కింది. వీరిద్దరితో పాటు యువ ఆటగాడు ఉస్మాన్ ఖాన్, అన్క్యాప్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా ఈ సిరీస్‌తో బాబర్ ఆజం మళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యువ ఓపెనర్ సైమ్ అయూబ్‌ను సైతం సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక మహ్మద్ అమీర్ పాకిస్తాన్ తరపున చివరగా 2020లో ఆడాడు. ఆ తర్వాత బోర్డుతో విభేదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు అమీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు బోర్డు కొత్త చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ సూచనల మెరకు అమీర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరోవైపు ఇమాద్ వసీం కూడా గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. కానీ పీసీబీ అధికారులతో చర్చలు జరిపి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికి వహాబ్ రియాజ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఏప్రిల్ 18 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కివీస్‌తో టీ20లకు పాక్ జట్టు బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ అమీర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్, ఉస్మాన్ ఖాన్, జమాన్ ఖాన్ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: హసీబుల్లా, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్ మరియు సల్మాన్ అలీ అఘా -
రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న స్టార్ క్రికెటర్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఆ జట్టు స్టార్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. పాక్ క్రికెట్ బోర్డు అవకాశం ఇస్తే మరోసారి దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. రిటైర్మెంట్ వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని ఆమిర్ ఆదివారం వెల్లడించాడు. పాక్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరిపిన అనంతరం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆమిర్ పేర్కొన్నాడు. మరోసారి పాక్ జట్టుకు ఎంపిక చేసే విషయంలో పీసీబీ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపాడు. పాక్ జట్టుకు ఆడటం తన కల అని.. పాక్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఏ వయసులో వచ్చినా వదులుకోనని అన్నాడు. 31 ఏళ్ల ఆమిర్ 2020లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి లీగ్ క్రికెట్‌కు మాత్రమే పరిమితమైన ఆమిర్.. తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు. 17 ఏళ్ల వయసులోనే పాక్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఆమిర్.. ఆ జట్టు తరఫున 36 టెస్ట్‌లు, 61 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 259 వికెట్లు పడగొట్టాడు. ఆమిర్ వన్డేల్లో రెండు అర్దసెంచరీలు కూడా చేశాడు. ఇటీవల ఆమిర్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2024 పీఎస్ఎల్లో అతను 9 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఆమిర్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి ముందు మరో పాక్ క్రికెటర్ కూడా రిటైర్మెంట్ను వెనక్కు తీసుకున్నాడు. ఆ జట్టు స్టార్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం టీ20 వరల్డ్‌కప్‌లో అవకాశం కోసం రిటైర్మెంట్ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు. -
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న పాక్ స్టార్ క్రికెటర్
పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. ఈ విషయాన్ని వసీం శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులతో చర్చలు సఫలం కావడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు వసీం తెలిపాడు. కాగా ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వసీం అద్బతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ టైటిల్ విజయంలో వసీం కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని తన రిటైర్మెంట్ను వెనక్కు తీసుకోవాలని చాలా మంది సూచించారు. ఈ నేపథ్యంలోనే వసీం తన మనసు మార్చుకున్నాడు. "ఈ రోజు పీసీబీ అధికారులతో సమావేశమయ్యాను. నా రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. టీ20 ప్రపంచకప్ 2024కు నేను అందుబాటులో ఉంటాను. టీ20 ఫార్మాట్లో నా సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నాను. అదే విధంగా నాపై నమ్మకం ఉంచి నాతో చర్చలు జరిపిన పీసీబీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని" వసీం ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా గతేడాది ఆఖరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వసీం గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో వసీం భాగమయ్యాడు. ఇప్పుడు ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగనుండడంతో వసీంతో పీసీబీ చర్చలు జరిపింది -
ఛీ.. ఇదేం పని.. మ్యాచ్ మధ్యలోనే పాక్ క్రికెటర్ ఇలా! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటడ్ నిలిచింది. ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌ను ఓడించిన ఇస్లామాబాద్ యునైటెడ్.. మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఇస్లామాబాద్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టిన వసీం.. అనంతరం బ్యాటింగ్‌లోనూ కీలకమైన 19 పరుగులు చేశాడు. దీంతో అతడికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే తన ప్రదర్శనతో అందరిని అకట్టుకున్న ఇమాద్ వసీం.. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ జరుగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వసీం సిగరెట్ వెలగించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు 'పీఎసీఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు.. పాకిస్తాన్ స్మోకింగ్ లీగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్!? PAKISTAN "SMOKING" LEAGUE 🚬🔥🔥#HBLPSL9 #HBLPSLFinal pic.twitter.com/pwpaj4bLh8 — Farid Khan (@_FaridKhan) March 18, 2024