
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటడ్ నిలిచింది. ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌ను ఓడించిన ఇస్లామాబాద్ యునైటెడ్.. మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఇస్లామాబాద్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కీలక పాత్ర పోషించాడు.
తొలుత బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టిన వసీం.. అనంతరం బ్యాటింగ్‌లోనూ కీలకమైన 19 పరుగులు చేశాడు. దీంతో అతడికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే తన ప్రదర్శనతో అందరిని అకట్టుకున్న ఇమాద్ వసీం.. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
మ్యాచ్ జరుగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వసీం సిగరెట్ వెలగించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు 'పీఎసీఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు.. పాకిస్తాన్ స్మోకింగ్ లీగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్!?
PAKISTAN "SMOKING" LEAGUE 🚬🔥🔥#HBLPSL9 #HBLPSLFinal pic.twitter.com/pwpaj4bLh8
— Farid Khan (@_FaridKhan) March 18, 2024