టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ తొలి మ్యాచ్‌కు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం(జూన్ 6)న డల్లాస్ వేదికగా యూనైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు ఊహించని షాక్ తగిలింది.
స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం గాయం కారణంగా అమెరికాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. వసీం ప్రస్తుతం ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
"ఈ క్రమంలోనే వసీం తమ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ధృవీకరించాడు. ఇమాద్ వసీం ప్రస్తుతం ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అతడు మా తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు.
టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నానని" ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో ఆజం పేర్కొన్నాడు. కాగా వసీం తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని పాకిస్తాన్ తరపున రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ తుది జట్టు(అంచనా)
మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సయీమ్ అయూబ్, బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఆజం ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ , షాహీన్ అఫ్రిది, మహ్మద్ అమీర్, నసీమ్ షా.
Comments
Please login to add a commentAdd a comment