పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఈ విషయాన్ని వసీం శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులతో చర్చలు సఫలం కావడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు వసీం తెలిపాడు.
కాగా ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వసీం అద్బతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ టైటిల్ విజయంలో వసీం కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని తన రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకోవాలని చాలా మంది సూచించారు. ఈ నేపథ్యంలోనే వసీం తన మనసు మార్చుకున్నాడు.
"ఈ రోజు పీసీబీ అధికారులతో సమావేశమయ్యాను. నా రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. టీ20 ప్రపంచకప్ 2024కు నేను అందుబాటులో ఉంటాను. టీ20 ఫార్మాట్‌లో నా సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నాను. అదే విధంగా నాపై నమ్మకం ఉంచి నాతో చర్చలు జరిపిన పీసీబీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని" వసీం ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
కాగా గతేడాది ఆఖరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వసీం గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో వసీం భాగమయ్యాడు. ఇప్పుడు ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగనుండడంతో వసీంతో పీసీబీ చర్చలు జరిపింది
Comments
Please login to add a commentAdd a comment