పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ఇమాద్ సోషల్‌మీడియా వేదికగా తన రిటైర్మెంట్ సందేశాన్ని పంపాడు.
దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అందులో పేర్కొన్నాడు. పాకిస్తాన్‌కు ఆడుతున్న ప్రతి క్షణం మరచిపోలేనిదని అన్నాడు. అభిమానుల ప్రేమ మరియు వారి తిరుగులేని మద్దతుకు ధన్యవాదాలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా దేశవాలీ మరియు ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడటం కొనసాగిస్తానని వెల్లడించాడు.
35 ఏళ్ల ఇమాద్ 2015లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇమాద్‌కు టీ20 స్పెషలిస్ట్‌గా పేరుంది. ఇమాద్ పాక్ తరఫున 55 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. వన్డేల్లో 986 పరుగులు, 44 వికెట్లు.. టీ20ల్లో 554 పరుగులు, 73 వికెట్లు తీశాడు.
ఇమాద్ ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీలకు అడుతున్నాడు. ఇమాద్ 2019లో పాక్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇమాద్ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 2024 టీ20 వరల్డ్‌కప్ కోసం అతను తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment