
ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులకే కుప్పకూలింది. ఓలి రాబిన్‌సన్ ఐదు, స్టువర్ట్ బ్రాడ్ నాలుగు వికెట్లతో ప్రొటిస్‌ను శాసించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్కో జాన్సెన్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోండో 23 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి సౌతాఫ్రికా బ్యాటర్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ టీ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఓలి పోప్ 38, జో రూట్ 23 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు అలెక్స్ లీస్ 13, జాక్ క్రాలీ 5 పరుగులు చేసి ఔటయ్యారు. ఇక మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment