Stuart Broad Becomes 2nd England Bowler Taken 100 Wickets At Lords - Sakshi
Sakshi News home page

Stuart Broad: ఇంగ్లండ్‌ బౌలర్‌ అరుదైన ఫీట్‌.. టెస్టు క్రికెట్‌లో నాలుగో బౌలర్‌గా

Published Fri, Aug 19 2022 1:32 PM | Last Updated on Fri, Aug 19 2022 2:29 PM

Stuart Broad Becomes 2nd England Bowler Taken 100 Wickets At Lords - Sakshi

ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ లార్డ్స్‌ వేదికగా అరుదైన ఫీట్‌ సాధించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కైల్‌ వెరిన్నేను ఔట్‌ చేయడం ద్వారా లార్డ్స్‌లో 100వ వికెట్‌ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో లార్డ్స్‌ వేదికలో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో ఇంగ్లండ్‌ బౌలర్‌గా బ్రాడ్‌ నిలచాడు. ఇంతకముందు ఇంగ్లండ్‌ స్టార్‌ జేమ్స్‌ అండర్సన్‌(117 వికెట్లు) ఈ ఘనత అందుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే వేదిక(క్రికెట్‌ గ్రౌండ్‌లో)పై 100 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా స్టువర్ట్‌ బ్రాడ్‌ నిలిచాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్‌ ఏకంగా మూడు వేదికల్లో మూడుసార్లు వంద వికెట్ల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత జేమ్స్‌ అండర్సర్‌, రంగనా హెరాత్‌లు ఉన్నారు. తాజాగా వీరి సరసన స్టువర్ట్‌ బ్రాడ్‌ చేరాడు.

టెస్టుల్లో ఒకే వేదికలో 100 వికెట్లు తీసిన బౌలర్లు: 

►ముత్తయ్య మురళీధరన్‌-( సింహాళి స్పోర్ట్స్‌క్లబ్‌, కొలంబో.. 166 వికెట్లు, అసిగిరియా స్టేడియం, కాండీ.. 117 వికెట్లు, గాలే స్టేడియం..111 వికెట్లు)


►జేమ్స్‌ అండర్సన్‌(లార్డ్స్‌ స్టేడియం.. 117 వికెట్లు)


►రంగనా హెరాత్‌(గాలె స్టేడియం.. 102 వికెట్లు)
►స్టువర్ట్‌ బ్రాడ్‌ (లార్డ్స్‌ స్టేడియం.. 102 వికెట్లు)

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సారెల్‌ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్‌ (47), కేశవ్‌ మహరాజ్‌ (41), మార్కో జాన్సెన్‌ (41 బ్యాటింగ్‌) రాణించారు. బెన్‌ స్టోక్స్‌కు 3 వికెట్లు దక్కాయి.

అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 116/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్‌ (73) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  పేస్‌ బౌలర్‌ రబడాకు 5 వికెట్లు దక్కగా, నోర్జే 3 వికెట్లు తీశాడు.  

చదవండి: అభిమానం పరాకాష్టకు.. చెమట వాసనను ఆస్వాదించిన వేళ

SA Vs ENG: రబడా పాంచ్‌ పటాకా.. భారీ ఆధిక్యం దిశగా సౌతాఫ్రికా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement