
జేమ్స్ అండర్సన్(PC: ICC)
ఇంగ్లండ్ వెటరన్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వంద టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా జేమ్స్ అండర్స్‌న్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. అండర్సన్ తర్వాతి స్థానంలో టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(స్వదేశంలో 94 టెస్టులు) రెండో స్థానంలో ఉండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(స్వదేశంలో 92 టెస్టులు) మూడో స్థానంలో.. ఇక నాలుగో స్థానంలో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(స్వదేశంలో 91 టెస్టులు) ఉన్నాడు.
అండర్సన్ తర్వాత స్వదేశంలో వంద టెస్టులు ఆడే అవకాశం ప్రస్తుతం స్టువర్ట్ బ్రాడ్‌కు మాత్రమే ఉంది. ఇటీవలే 40వ పడిలో అడుగుపెట్టిన అండర్సన్.. వయసు మీద పడుతున్నా బౌలింగ్‌లో మాత్రం పదును అలాగే ఉండడం విశేషం. ఇక 19 ఏళ్ల కెరీర్‌లో అండర్సన్ ఇంగ్లండ్ తరపున 174 టెస్టులాడి 658 వికెట్లు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అండర్సన్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(800 వికెట్లు) ఉండగా.. రెండో స్థానంలో ఆసీస్ దివంగత దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు) ఉన్నాడు.
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్రారంభమైన రెండో టెస్టును మాత్రం పాజిటివ్ నోట్‌తో ఆరంభించింది. లంచ్ విరామం అనంతరం సౌతాఫ్రికా 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జేమ్స్ అండర్సన్ 3 వికెట్లు, స్టోక్స్, బ్రాడ్ తలా రెండు వికెట్లు తీశారు.
19 years after his Test debut at Lord's, James Anderson has another milestone at home 🏴 pic.twitter.com/kMh7aFSh10
— ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2022
చదవండి: Asia Cup 2022: 'దీపక్ చహర్ గాయపడలేదు.. ఆ వార్తలు నమ్మకండి'
SA vs ENG: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్