home ground
-
IPL 2024 RCB VS KKR: సెంటిమెంట్ కొనసాగేనా..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 29) మరో క్లాసీ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడే అవకాశం ఉంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించి జోష్‌లో ఉంటే.. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో (రెండోది) పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది. ఇవాల్టి మ్యాచ్‌కు ముందు ఓ సెంటిమెంట్ అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు జరిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లో హోం గ్రౌండ్లో ఆడిన జట్లే విజయాలు సాధించాయి. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్కే (ఆర్సీబీపై విజయం), చంఢీఘడ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై), కోల్‌కతాలో జరిగిన మూడో మ్యాచ్‌లో కేకేఆర్ (సన్‌రైజర్స్‌పై), జైపూర్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ (లక్నోపై), అహ్మదాబాద్‌లో ముంబైపై గుజరాత్, బెంగళూరులో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ, చెన్నైలో గుజరాత్‌పై సీఎస్కే, హైదరాబాద్‌లో ముంబైపై సన్‌రైజర్స్, జైపూర్‌లో నిన్న జరిగిన తొమ్మిదో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ హోం గ్రౌండ్లో విజయం సాధించి సెంటిమెంట్ కొనసాగిస్తుందా.. లేక కేకేఆర్‌కు దాసోహమై సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గత రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరగగా కేకేఆర్ 18, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు బ్యాటింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్నప్పటికీ.. కేకేఆర్‌కు బ్యాటింగ్ డెప్త్ కాస్త ఎక్కువేనని చెప్పాలి. ఆ జట్టులో ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేసే వాళ్లు ఉన్నారు. ఆర్సీబీ విషయానికొస్తే పరిస్థితి అలా లేదు. విరాట్, డుప్లెసిస్, మ్యాక్సీ ఔటైతే ఆ జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. బౌలింగ్‌లోనూ ఆర్సీబీతో పోలిస్తే కేకేఆర్ మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్ మిచెల్ స్టార్క్ నాయకత్వంలో కేకేఆర్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తుంది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఇరగదీశాడు. రసెల్ బ్యాట్‌తో పాటు బంతితోనూ చెలరేగాడు. నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్టార్క్, వరుణ్ చక్రవర్తి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ పరిస్థితి రిపీట్ కాదని అనిపిస్తుంది. ఆర్సీబీ విషయానికొస్తే.. ముందుగా ఈ జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్ లేడు. కేవలం బ్యాటింగ్‌పైనే ఆ జట్టు ఆధార పడింది. సిరాజ్, అల్జరీ జోసఫ్, యశ్ దయాల్, గ్రీన్ లాంటి పేసర్లు ఉన్నా వారి నుంచి గొప్ప ప్రదర్శనలు ఆశించలేని పరిస్థితి ఉంది. స్పిన్నర్లు కర్ణ్ శర్మ, మయాంక్ డాగర్, మ్యాక్సీ అడపాదడపా రాణిస్తుంటారు. మొత్తంగా చూస్తే.. ఆర్సీబీ కంటే కేకేఆర్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
IPL 2024: కొనసాగుతున్న సెంటిమెంట్.. వరుసగా 8 మ్యాచ్‌ల్లో..!
ఐపీఎల్ 2024 సీజన్లో సొంత మైదానాల్లో ఫ్రాంచైజీల గెలుపు సెంటిమెంట్ కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లో హోం టీమ్‌లే విజయాలు సాధించాయి. తాజాగా సన్‌రైజర్స్ తమ సొంత మైదానమైన ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై తిరుగులేని విజయం సాధించి సెంటిమెంట్‌ను కొనసాగించింది. ఐపీఎల్లో ఎన్నడూ లేనట్లుగా హోం గ్రౌండ్స్‌లో ఫ్రాంచైజీల హవా కొనసాగుతుంది. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్కే (ఆర్సీబీపై విజయం), చంఢీఘడ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై), కోల్‌కతాలో జరిగిన మూడో మ్యాచ్‌లో కేకేఆర్ (సన్‌రైజర్స్‌పై), జైపూర్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ (లక్నోపై), అహ్మదాబాద్‌లో ముంబైపై గుజరాత్, బెంగళూరులో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ, చెన్నైలో గుజరాత్‌పై సీఎస్కే, హైదరాబాద్‌లో జరిగిన ఎనిమిదో మ్యాచ్‌లో ముంబైపై సన్‌రైజర్స్ విజయాలు సాధించాయి. ఇదే సెంటిమెంట్ మున్ముందు కొనసాగితే విజేతలను ముందుగానే పసిగట్టవచ్చు. బెట్టింగ్ రాయుళ్లకు ఈ సెంటిమెంట్ కాసులు వర్షం కురిపిస్తుంది. జైపూర్‌లో ఇవాళ (మార్చి 28) రాజస్థాన్.. ఢిల్లీతో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితం ఆసక్తి రేపుతుంది. హోం గ్రౌండ్ సెంటిమెంట్ నమ్ముకుని మెజార్టీ శాతం రాజస్థానే గెలుస్తుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఢిల్లీతో పోలిస్తే రాజస్థాన్ టీమ్ పటిష్టంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), మార్క్రమ్ (28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 42 నాటౌట్) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు ధీటుగా బదులిచ్చిన ముంబై ఇండియన్స్.. ఓ దశలో గెలుపు దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే లక్ష్యం అతి భారీది కావడంతో ఎంఐ టీమ్ ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన ముంబై లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), నమన్ ధిర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సన్‌రైజర్స్‌కు దడ పుట్టించారు. -
జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ వెటరన్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వంద టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా జేమ్స్ అండర్స్‌న్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. అండర్సన్ తర్వాతి స్థానంలో టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(స్వదేశంలో 94 టెస్టులు) రెండో స్థానంలో ఉండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(స్వదేశంలో 92 టెస్టులు) మూడో స్థానంలో.. ఇక నాలుగో స్థానంలో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(స్వదేశంలో 91 టెస్టులు) ఉన్నాడు. అండర్సన్ తర్వాత స్వదేశంలో వంద టెస్టులు ఆడే అవకాశం ప్రస్తుతం స్టువర్ట్ బ్రాడ్‌కు మాత్రమే ఉంది. ఇటీవలే 40వ పడిలో అడుగుపెట్టిన అండర్సన్.. వయసు మీద పడుతున్నా బౌలింగ్‌లో మాత్రం పదును అలాగే ఉండడం విశేషం. ఇక 19 ఏళ్ల కెరీర్లో అండర్సన్ ఇంగ్లండ్ తరపున 174 టెస్టులాడి 658 వికెట్లు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అండర్సన్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(800 వికెట్లు) ఉండగా.. రెండో స్థానంలో ఆసీస్ దివంగత దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు) ఉన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్రారంభమైన రెండో టెస్టును మాత్రం పాజిటివ్ నోట్‌తో ఆరంభించింది. లంచ్ విరామం అనంతరం సౌతాఫ్రికా 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జేమ్స్ అండర్సన్ 3 వికెట్లు, స్టోక్స్, బ్రాడ్ తలా రెండు వికెట్లు తీశారు. 19 years after his Test debut at Lord's, James Anderson has another milestone at home 🏴 pic.twitter.com/kMh7aFSh10 — ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2022 చదవండి: Asia Cup 2022: 'దీపక్ చహర్ గాయపడలేదు.. ఆ వార్తలు నమ్మకండి' SA vs ENG: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ -
చెన్నైయిన్ చమక్
చెన్నై: సొంత మైదానంలో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు దుమ్ము రేపింది. ప్రత్యర్థి కోలుకునేందుకు కూడా సమయమివ్వకుండా గోల్స్ వర్షం కురిపించింది. దీనికి తోడు ఇటలీ స్టార్ మెటరాజ్జీ రంగ ప్రవేశంతో దూకుడు మీద కనిపించిన చెన్నైయిన్ మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ముంబై సిటీ ఎఫ్‌సీని 5-1 తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఎలనో (9, 69వ నిమిషాలు), జేజే (26వ ని.), వాలెన్సియా (41, 44వ ని.) గోల్స్ సాధించారు. ముంబై నుంచి నబీ (87వ ని.) ఏకైక గోల్ సాధించాడు. అటు స్టార్ స్టయికర్ నికోలస్ అనెల్కా అరంగేట్రం చేసినప్పటికీ ముంబై రాత మారలేదు. వారి డిఫెన్స్‌తో పాటు మిడ్ ఫీల్డ్‌లో లోపాలు.. గోల్ కీపర్ ఏమరుపాటు చెన్నైయిన్కి కలిసొచ్చింది. ఆరంభంలోనే వాలెన్సియాను ఫ్రెడెరిక్ (ముంబై) మొరటుగా అడ్డుకోవడంతో చెన్నైయిన్కి పెనాల్టీ కిక్ దక్కింది. దీన్ని ఎలనో తొమ్మిదో నిమిషంలో గోల్‌గా మలిచాడు. 26వ నిమిషంలో మిడ్‌ఫీల్డ్ నుంచి ఎలనో అందించిన పాస్‌ను జేజే గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ చేసిన గోల్‌తో జట్టు స్కోరు 2-0కి పెరిగింది. 41వ నిమిషంలో ఎలనో ఫ్రీ కిక్‌ను సరిగా అందుకోలేని గోల్ కీపర్ సుబ్రతా పాల్ వదిలేయగా అక్కడే ఉన్న వాలెన్సియా బంతిని నెట్లోకి తన్ని ముంబైని షాక్‌కు గురి చేశాడు. మరో మూడు నిమిషాల్లోనే బంతిని అందుకునేందుకు మరీ ముందుకు వచ్చిన కీపర్ పాల్‌ను ఏమారుస్తూ వాలెన్సియా బంతిని గోల్ పోస్టులోకి పంపడంతో చెన్నైయిన్ సంబరాలు మిన్నంటాయి. ద్వితీయార్ధంలోనూ వీరి దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 69వ నిమిషంలో ఎలనో సంధించిన ఫ్రీ కిక్ నేరుగా గోల్ పోస్టు కుడివైపు నుంచి లోనికి దూసుకె ళ్లడంతో జట్టు ఆధిక్యం 5-0కి పెరిగింది. ఐఎస్ఎల్లో ఎలనోకిది ఐదో గోల్ కావడం విశేషం. 87వ నిమిషంలో నబీ హెడర్ గోల్‌తో ముంబై ఖాతా తెరిచింది. చెన్నైయిన్ జట్టు సహ యజమాని ధోని ఈ మ్యాచ్‌కు వచ్చాడు.