పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్.. పాక్‌ను వారి సొంతగడ్డపై వైట్‌వాస్ చేసి ఆ జట్టుకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఇక ఈ సిరీస్ ద్వారా హ్యారీ బ్రూక్ రూపంలో ఇంగ్లండ్‌కు మంచి బ్యాటర్ దొరికాడు. ఈ సిరీస్‌లో బ్రూక్స్ మూడు టెస్టులు కలిపి 468 పరుగులు సాధించాడు. 93.60 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన బ్రూక్ ఖాతాలో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యారీ బ్రూక్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
అదేంటంటే.. పాక్ గడ్డపై ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఇంతకముందు 1983-84లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ గోవర్ 449 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇదే సిరీస్‌లో 179 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన మార్కస్ ట్రెస్కోథిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ట్రెస్కోథిక్ పాక్ గడ్డపై 12 ఇన్నింగ్స్‌లు కలిపి 445 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరి రికార్డులను బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్ పాక్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
ఇక పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్‌కు పరాభవమే ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment