‘ఆదుకున్న’ బ్రాడ్, ప్రయర్! | England cricketers Stuart Broad and Matt Prior rescue man from Pyrmont Bridge in Darling Harbour | Sakshi
Sakshi News home page

‘ఆదుకున్న’ బ్రాడ్, ప్రయర్!

Published Thu, Jan 9 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

England cricketers Stuart Broad and Matt Prior rescue man from Pyrmont Bridge in Darling Harbour

లండన్: యాషెస్ సిరీస్ ముగిశాక ఇంగ్లండ్ క్రికెటర్లు ఇంకా జట్టును ఆదుకోవడం ఏముంది అనుకోకండి... ఇది క్రికెట్ మైదానంలో కాదు. నిజజీవితంలో వారు ఒక వ్యక్తిని చనిపోకుండా కాపాడి ఒక్కసారిగా హీరోలయ్యారు. వివరాల్లోకెళితే... సిడ్నీలో చివరి టెస్టు ముగిసిన తర్వాత ఈ ఇద్దరు ఇంగ్లండ్ క్రికెటర్లు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. డార్లింగ్ హార్బర్ బ్రిడ్జి వద్ద కాసేపు ఆగి వారిద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా దూరంగా ఒక వ్యక్తిపై దృష్టి పడింది. అతను నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లిన వారిద్దరు అతడిని అడ్డుకున్నారు. బ్రిడ్జి అంచుపైనుంచి నదిలో దూకడానికి సిద్ధమైన వ్యక్తిని వెనక్కి లాగారు. తాను చనిపోవాలనుకుంటున్నట్లు ఇంగ్లండ్‌కు చెందిన ఆ వ్యక్తి వెల్లడించాడు. దాంతో అతడిని కూర్చోబెట్టి ప్రయర్ కౌన్సిలింగ్ చేయగా... బ్రాడ్ పోలీసులకు ఫోన్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement