మాంచెస్టర్: టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ప్రశంసలు వర్షం కురిపించాడు. వెసిండీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయిన బ్రాడ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. సుదీర్ఘకాలంగా మరో పేసర్ అండర్సన్‌తో కలిసి పేస్ విభాగాన్ని పంచుకుంటున్న బ్రాడ్‌ను ఇంతకంటే గొప్ప ఫామ్‌లో చూసిన దాఖలాలు లేవన్నాడు. విండీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించిన బ్రాడ్.. రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు సాధించాడు. తద్వారా 499 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఇప్పటికే ఐదు వందల వికెట్ల క్లబ్‌లో ఉన్న అండర్సన్ సరసన చేరడానికి బ్రాడ్ వికెట్ దూరంలో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో అండర్సన్-బ్రాడ్‌లపై స్ట్రాస్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో స్థానం సంపాదించారంటూ కొనియాడాడు. సోమవారం వెస్టిండీస్- ఇంగ్లండ్ సిరీస్ ముగింపులో నాల్గవ రోజు రోజు ఆట వర్షార్పణం అయిన తర్వాత స్ట్రాస్ మాట్లాడాడు. గతంలో మణికట్టు గాయంతో బాధపడ్డ స్ట్రాస్.. తిరిగి గాడిలో పడటానికి చాలా శ్రమించాడన్నాడు. ముఖ్యంగా కుడిచేతి వాటం ఆటగాళ్లకు బౌలింగ్ చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని బ్రాడ్ అధిగమించాడన్నాడు. సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పుడు బ్రాడ్ తొలగించబడ్డాడని, కానీ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన సిరీస్-లెవలింగ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడన్నాడు.ఇక సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో బ్రాడ్ చెలరేగిపోవడం హర్షించదగ్గ పరిణామమన్నాడు.చదవండి: (నాలుగో రోజు వర్షార్పణం )
Comments
Please login to add a commentAdd a comment