Jimmy Anderson
-
కోచ్‌గా పనికిరాడన్నారు కదా: మెకల్లమ్ కామెంట్స్ వైరల్
ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సోమవారం(ఆక్టోబర్ 7) ప్రారంభమైంది. ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇరు జట్లు తలపడుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకం. కాగా ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు చేపట్టిన దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్.. ఇంకా జట్టుతో చేరలేదు.ఈ సిరీస్ కోసం ఏర్పాటు చేసిన ప్రీ ట్రైనింగ్ క్యాంప్‌లో సైతం జిమ్మీ భాగం కాలేదు. అండర్సన్ ప్రస్తుతం స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న గోల్ప్ టోర్నీ ఆల్ఫ్రెడ్ డన్హిల్ లింక్స్ ఛాంపియన్‌షిప్‌లో బీజీబీజీగా ఉన్నాడు. అతడు జట్టుతో కలిసేందుకు మరో రెండు రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు అతడి తీరును తప్పుబడుతున్నారు. కీలకమైన సిరీస్‌ను పక్కన పెట్టి గోల్ప్ టోర్నీలో పాల్గోనడమెంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే అండర్సన్‌కు ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం మద్దతుగా నిలిచాడు. జిమ్మీ ఇంకా జట్టుతో చేరనప్పటకి వర్చవుల్గా తన సూచనలు అందిస్తున్నాడని మెకల్లమ్ తెలిపాడు."రెండు నెలల క్రితం ఆండర్సన్ కోచ్‌గా పనికిరాడని కొంతమంది అన్నారు. ఇప్పుడేమో అతడు ఇంకా జట్టుతో చేరలేదని విమర్శిస్తున్నారు. వాస్తవానికి మేము కూడా అతడిని మిస్ అవుతున్నాము. ఒక ఆటగాడి నుండి కోచ్‌గా మారిన తక్కువ సమయంలో జిమ్మీ ఎంత ప్రభావం చూపించాడో మాకు ఇప్పుడు ఆర్ధమవుతోంది.ప్రస్తుతం టెక్నాలజీ చాలా అభివృద్ది చెందింది. అతడు తన సలహాలు, సూచనలు ఇవ్వాలంటే జట్టుతో పాటే ఉండాల్సిన అవసరం లేదు. వర్చువల్‌గా అతడు మా బౌలర్లకు సలహాలు, చిట్కాలు అందిస్తున్నాడు. అతడు స్కాట్లాండ్లో జరుగుతున్న గోల్ఫ్ టోర్నీలో ఆడుతున్నాడు. ఈ విషయం మాకు ముందే చెప్పాడు. మేము అందరి కలిసి తీసుకున్న నిర్ణయమిది. జిమ్మీ త్వరలోనే జట్టుతో చేరుతాడు. అతడు 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత తన న్యూ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. కాబట్టి అతడికి తన కుటుంబంతో గడిపే సమయం కూడా ఇవ్వాలి కాదా. జిమ్మీ మా జట్టు పార్ట్‌టైమ్ బౌలింగ్ కన్సల్టెంట్ మాత్రమే. పూర్తి స్ధాయిలో అతడు తన సేవలను అందించడు" అంటూ ఓ ఇంటర్వ్యూలో మెకల్లమ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: అలా ఎలా కొట్టావు హార్దిక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే( వీడియో) -
టీమిండియాతో ఐదో టెస్ట్: జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. స్టార్ పేసర్ రీ ఎంట్రీ
England Squad For Test VS India: టీమిండియాతో రేపటి (జులై 1) నుంచి ప్రారంభంకానున్న ఐదో టెస్ట్‌కు ఇంగ్లండ్ తుది జట్టు ఖరారైంది. ఒక్క మార్పు మినహా తాజాగా న్యూజిలాండ్‌పై బరిలోకి దిగిన జట్టునే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రంగంలోకి దించుతుంది. జేమీ ఓవర్టన్ స్థానంలో వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. Our XI for the fifth LV= Insurance Test with @BCCI 🏏 More here: https://t.co/uXHG3iOVCA 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/xZlULGsNiB — England Cricket (@englandcricket) June 30, 2022 ఓపెనర్లుగా అలెక్స్ లీస్, జాక్ క్రాలే.. వన్‌డౌన్‌లో ఓలీ పోప్.. జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ వరుసగా 4, 5, 6 స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. మూడో టెస్ట్ సందర్భంగా కరోనా బారిన పడిన బెన్ ఫోక్స్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. పేసర్లుగా మ్యాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, ఆండర్సన్.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జాక్ లీచ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌పై సందిగ్ధత కొనసాగుతుంది. కరోనా బారిన పడిన కెప్టెన్ రోహిత్ శర్మ హెల్త్‌పై ఇంతవరకు అధికారిక అప్డేట్ లేదు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ఎవరనే విషయంపై గందరగోళం నెలకొంది. తుది జట్టు విషయంలో టీమిండియా గోప్యత పాటిస్తుంది. కాగా, కరోనా కారణంగా గతేడాది అర్థాంతరంగా నిలిచిపోయిన చివరి టెస్ట్ మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: ఇంగ్లండ్‌తో ఇప్పుడు కష్టం.. టీమిండియాను హెచ్చరిస్తున్న మొయిన్ అలీ -
ఆల్‌టైమ్ గ్రేట్‌లలో వారు కూడా..
మాంచెస్టర్: టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ప్రశంసలు వర్షం కురిపించాడు. వెసిండీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయిన బ్రాడ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. సుదీర్ఘకాలంగా మరో పేసర్ అండర్సన్‌తో కలిసి పేస్ విభాగాన్ని పంచుకుంటున్న బ్రాడ్‌ను ఇంతకంటే గొప్ప ఫామ్‌లో చూసిన దాఖలాలు లేవన్నాడు. విండీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించిన బ్రాడ్.. రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు సాధించాడు. తద్వారా 499 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఇప్పటికే ఐదు వందల వికెట్ల క్లబ్లో ఉన్న అండర్సన్ సరసన చేరడానికి బ్రాడ్ వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అండర్సన్-బ్రాడ్లపై స్ట్రాస్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో స్థానం సంపాదించారంటూ కొనియాడాడు. సోమవారం వెస్టిండీస్- ఇంగ్లండ్ సిరీస్ ముగింపులో నాల్గవ రోజు రోజు ఆట వర్షార్పణం అయిన తర్వాత స్ట్రాస్ మాట్లాడాడు. గతంలో మణికట్టు గాయంతో బాధపడ్డ స్ట్రాస్.. తిరిగి గాడిలో పడటానికి చాలా శ్రమించాడన్నాడు. ముఖ్యంగా కుడిచేతి వాటం ఆటగాళ్లకు బౌలింగ్ చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని బ్రాడ్ అధిగమించాడన్నాడు. సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పుడు బ్రాడ్ తొలగించబడ్డాడని, కానీ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన సిరీస్-లెవలింగ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడన్నాడు.ఇక సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో బ్రాడ్ చెలరేగిపోవడం హర్షించదగ్గ పరిణామమన్నాడు.చదవండి: (నాలుగో రోజు వర్షార్పణం ) -
‘కోహ్లికి ఇబ్బందులు తప్పవు’
చెన్నై: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇబ్బందులు తప్పవని ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. పరుగుల యంత్రం కోహ్లి విశేష అనుభవం ఉన్న ఆటగాడైనప్పటికీ ఇంగ్లండ్ గడ్డపై అండర్సన్ నుంచి ముప్పు పొంచి వుందన్నాడు. ప్రస్తుతం సొంత గడ్డపై సత్తాచాటుతున్న అండర్సన్.. కోహ్లిపై పైచేయి సాధించడం ఖాయమని జోస్యం చెప్పాడు. ‘విరాట్ కోహ్లి అనుభవం ఉన్న ఆటగాడు. నాణ్యమైన ఆటగాడు కూడా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ అక్కడ పరిస్థితులు మనకు అనుగుణంగా ఉండవు. ఆ జట్టు బౌలర్ అండర్సన్ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. అండర్సన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో కోహ్లి తడబడతాడనే అనుకుంటున్నా. చూద్దాం. ఏం జరుగుతుందో. ఇంగ్లిష్ పర్యటనలో జట్టంతా ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడటం సరికాదు. ఒకవేళ ఏదైనా మ్యాచ్‌లో అతడు ఫెయిలైనా మిగిలిన వారు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి. భారత జట్టులో చతేశ్వర పుజారా కీలక ఆటగాడు. మరి ఈ పర్యటనలో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. భారత బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా చాలా బాగా బౌలింగ్ వేస్తున్నారు. వీరిద్దరూ ఇంగ్లండ్ పర్యటనలో విజయవంతం అవుతారనే అనుకుంటున్నా’ అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. -
వీరిద్దరిపై వేటు ఖాయమేనా!
-
‘రికార్డు’తో రూట్ మార్చారు
రూట్, అండర్సన్ ప్రపంచ రికార్డు పదో వికెట్‌కు 198 పరుగుల భాగస్వామ్యం నాటింగ్‌హామ్: భారత బౌలర్ల వైఫల్యాన్ని ఆసరాగా చేసుకున్న ఇంగ్లండ్ క్రికెటర్లు జోయ్ రూట్ (295 బంతుల్లో 154 నాటౌట్; 15 ఫోర్లు), అండర్సన్ (130 బంతుల్లో 81; 17 ఫోర్లు) రెచ్చిపోయారు. పదో వికెట్‌కు ‘రికార్డు’ స్థాయిలో 198 పరుగులు జోడించి మ్యాచ్‌ను భారత్ నుంచి దూరం చేశారు. దీంతో గెలవాల్సిన మ్యాచ్‌లో ధోనిసేన డ్రాతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో శనివారం నాలుగోరోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 144.5 ఓవర్లలో 496 పరుగులకు ఆలౌటైంది. దీంతో కుక్‌సేనకు 39 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో 3 వికెట్లకు 167 పరుగులు చేసింది. కోహ్లి (8 బ్యాటింగ్), రహానే (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయ్ (52), పుజారా (55) ఫర్వాలేదనిపించినా... ధావన్ (29) విఫలమయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 128 పరుగుల ఆధిక్యంలో ఉంది. అలీకి 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు 352/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లును అలవోకగా ఎదుర్కొన్నారు. ఓ ఎండ్‌లో రూట్ నిలకడగా ఆడగా... రెండో ఎండ్‌లో అండర్సన్ కెరీర్లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. లంచ్ తర్వాత కొద్దిసేపటికి భువనేశ్వర్ బౌలింగ్‌లో అండర్సన్ అవుటయ్యాడు. భువనేశ్వర్ 5, ఇషాంత్ 3, షమీ 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 457 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (బి) షమీ 5; రాబ్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 59; బాలెన్సీ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 71; బెల్ (సి) ధోని (బి) ఇషాంత్ 25; రూట్ నాటౌట్ 154; అలీ (సి) ధావన్ (బి) షమీ 14; ప్రయర్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 5; స్టోక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 0; బ్రాడ్ ఎల్బీడబ్ల్యు (బి) భువనేశ్వర్ 47; ప్లంకెట్ (బి) భువనేశ్వర్ 7; అండర్సన్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 81; ఎక్స్‌ట్రాలు: 28; మొత్తం: (144.5 ఓవర్లలో ఆలౌట్) 496. వికెట్ల పతనం: 1-9; 2-134; 3-154; 4-172; 5-197; 6-202; 7-202; 8-280; 9-298; 10-496. బౌలింగ్: భువనేశ్వర్ 30.5-8-82-5; షమీ 29-3-128-2; ఇషాంత్ 38-3-150-3; జడేజా 35-5-80-0; బిన్నీ 10-0-37-0; విజయ్ 2-0-8-0. భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) ప్రయర్ (బి) అలీ 52; ధావన్ (సి) అండ్ (బి) అలీ 29; పుజారా (సి) స్టోక్స్ (బి) ప్లంకెట్ 55; కోహ్లి బ్యాటింగ్ 8; రహానే బ్యాటింగ్ 18; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (48 ఓవర్లలో 3 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1-49; 2-140; 3-140. బౌలింగ్: అండర్సన్ 9-4-21-0; బ్రాడ్ 11-3-35-0; ప్లంకెట్ 12-1-42-1; అలీ 7-0-39-2; స్టోక్స్ 9-2-28-0. గతంలో ఆసీస్ ద్వయం ఫిల్ హ్యూస్, ఎగర్లు పదో వికెట్‌కు నెలకొల్పిన 163 పరుగుల రికార్డు ఈ సందర్భంగా బ్రేక్ అయ్యింది. ఇంగ్లండ్‌పై ఇదే గ్రౌండ్లో ఆస్ట్రేలియన్లు ఈ రికార్డు నెలకొల్పారు. 111 ఏళ్ల కిందట ఇంగ్లండ్ ఆటగాళ్లు టిప్ ఫోస్టర్, రోడ్స్ ఏర్పర్చిన 130 పరుగుల భాగస్వామ్యాన్ని రూట్, అండర్సన్ సవరించారు. రెండు జట్లలో 11వ నంబర్ బ్యాట్స్‌మన్ అర్ధసెంచరీలు చేయడం 137 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.