
‘రికార్డు’తో రూట్ మార్చారు
భారత బౌలర్ల వైఫల్యాన్ని ఆసరాగా చేసుకున్న ఇంగ్లండ్ క్రికెటర్లు జోయ్ రూట్ (295 బంతుల్లో 154 నాటౌట్; 15 ఫోర్లు), అండర్సన్ (130 బంతుల్లో 81; 17 ఫోర్లు) రెచ్చిపోయారు.
రూట్, అండర్సన్ ప్రపంచ రికార్డు
పదో వికెట్‌కు 198 పరుగుల భాగస్వామ్యం
నాటింగ్‌హామ్: భారత బౌలర్ల వైఫల్యాన్ని ఆసరాగా చేసుకున్న ఇంగ్లండ్ క్రికెటర్లు జోయ్ రూట్ (295 బంతుల్లో 154 నాటౌట్; 15 ఫోర్లు), అండర్సన్ (130 బంతుల్లో 81; 17 ఫోర్లు) రెచ్చిపోయారు. పదో వికెట్‌కు ‘రికార్డు’ స్థాయిలో 198 పరుగులు జోడించి మ్యాచ్‌ను భారత్ నుంచి దూరం చేశారు. దీంతో గెలవాల్సిన మ్యాచ్‌లో ధోనిసేన డ్రాతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో శనివారం నాలుగోరోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 144.5 ఓవర్లలో 496 పరుగులకు ఆలౌటైంది. దీంతో కుక్‌సేనకు 39 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో 3 వికెట్లకు 167 పరుగులు చేసింది. కోహ్లి (8 బ్యాటింగ్), రహానే (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయ్ (52), పుజారా (55) ఫర్వాలేదనిపించినా... ధావన్ (29) విఫలమయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 128 పరుగుల ఆధిక్యంలో ఉంది. అలీకి 2 వికెట్లు దక్కాయి.
అంతకుముందు 352/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లును అలవోకగా ఎదుర్కొన్నారు. ఓ ఎండ్‌లో రూట్ నిలకడగా ఆడగా... రెండో ఎండ్‌లో అండర్సన్ కెరీర్‌లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. లంచ్ తర్వాత కొద్దిసేపటికి భువనేశ్వర్ బౌలింగ్‌లో అండర్సన్ అవుటయ్యాడు. భువనేశ్వర్ 5, ఇషాంత్ 3, షమీ 2 వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 457 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (బి) షమీ 5; రాబ్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 59; బాలెన్సీ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 71; బెల్ (సి) ధోని (బి) ఇషాంత్ 25; రూట్ నాటౌట్ 154; అలీ (సి) ధావన్ (బి) షమీ 14; ప్రయర్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 5; స్టోక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 0; బ్రాడ్ ఎల్బీడబ్ల్యు (బి) భువనేశ్వర్ 47; ప్లంకెట్ (బి) భువనేశ్వర్ 7; అండర్సన్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 81; ఎక్స్‌ట్రాలు: 28; మొత్తం: (144.5 ఓవర్లలో ఆలౌట్) 496.
వికెట్ల పతనం: 1-9; 2-134; 3-154; 4-172; 5-197; 6-202; 7-202; 8-280; 9-298; 10-496.
బౌలింగ్: భువనేశ్వర్ 30.5-8-82-5; షమీ 29-3-128-2; ఇషాంత్ 38-3-150-3; జడేజా 35-5-80-0; బిన్నీ 10-0-37-0; విజయ్ 2-0-8-0.
భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) ప్రయర్ (బి) అలీ 52; ధావన్ (సి) అండ్ (బి) అలీ 29; పుజారా (సి) స్టోక్స్ (బి) ప్లంకెట్ 55; కోహ్లి బ్యాటింగ్ 8; రహానే బ్యాటింగ్ 18; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (48 ఓవర్లలో 3 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1-49; 2-140; 3-140.
బౌలింగ్: అండర్సన్ 9-4-21-0; బ్రాడ్ 11-3-35-0; ప్లంకెట్ 12-1-42-1; అలీ 7-0-39-2; స్టోక్స్ 9-2-28-0.
గతంలో ఆసీస్ ద్వయం ఫిల్ హ్యూస్, ఎగర్‌లు పదో వికెట్‌కు నెలకొల్పిన 163 పరుగుల రికార్డు ఈ సందర్భంగా బ్రేక్ అయ్యింది. ఇంగ్లండ్‌పై ఇదే గ్రౌండ్‌లో ఆస్ట్రేలియన్లు ఈ రికార్డు నెలకొల్పారు.
111 ఏళ్ల కిందట ఇంగ్లండ్ ఆటగాళ్లు టిప్ ఫోస్టర్, రోడ్స్ ఏర్పర్చిన 130 పరుగుల భాగస్వామ్యాన్ని రూట్, అండర్సన్ సవరించారు.
రెండు జట్లలో 11వ నంబర్ బ్యాట్స్‌మన్ అర్ధసెంచరీలు చేయడం 137 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.