ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సోమవారం(ఆక్టోబర్ 7) ప్రారంభమైంది. ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇరు జట్లు తలపడుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకం. కాగా ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు చేపట్టిన దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్.. ఇంకా జట్టుతో చేరలేదు.
ఈ సిరీస్ కోసం ఏర్పాటు చేసిన ప్రీ ట్రైనింగ్ క్యాంప్‌లో సైతం జిమ్మీ భాగం కాలేదు. అండర్సన్ ప్రస్తుతం స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న గోల్ప్ టోర్నీ ఆల్ఫ్రెడ్ డన్‌హిల్ లింక్స్ ఛాంపియన్‌షిప్‌లో బీజీబీజీగా ఉన్నాడు. అతడు జట్టుతో కలిసేందుకు మరో రెండు రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కొంతమంది ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు అతడి తీరును తప్పుబడుతున్నారు. కీలకమైన సిరీస్‌ను పక్కన పెట్టి గోల్ప్ టోర్నీలో పాల్గోనడమెంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే అండర్సన్‌కు ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం మద్దతుగా నిలిచాడు. జిమ్మీ ఇంకా జట్టుతో చేరనప్పటకి వర్చవుల్‌గా తన సూచనలు అందిస్తున్నాడని మెకల్లమ్ తెలిపాడు.
"రెండు నెలల క్రితం ఆండర్సన్ కోచ్‌గా పనికిరాడని కొంతమంది అన్నారు. ఇప్పుడేమో అతడు ఇంకా జట్టుతో చేరలేదని విమర్శిస్తున్నారు. వాస్తవానికి మేము కూడా అతడిని మిస్ అవుతున్నాము. ఒక ఆటగాడి నుండి కోచ్‌గా మారిన తక్కువ సమయంలో జిమ్మీ ఎంత ప్రభావం చూపించాడో మాకు ఇప్పుడు ఆర్ధమవుతోంది.
ప్రస్తుతం టెక్నాలజీ చాలా అభివృద్ది చెందింది. అతడు తన సలహాలు, సూచనలు ఇవ్వాలంటే జట్టుతో పాటే ఉండాల్సిన అవసరం లేదు. వర్చువల్‌గా అతడు మా బౌలర్లకు సలహాలు, చిట్కాలు అందిస్తున్నాడు. అతడు స్కాట్లాండ్‌లో జరుగుతున్న గోల్ఫ్ టోర్నీలో ఆడుతున్నాడు.
ఈ విషయం మాకు ముందే చెప్పాడు. మేము అందరి కలిసి తీసుకున్న నిర్ణయమిది. జిమ్మీ త్వరలోనే జట్టుతో చేరుతాడు. అతడు 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత తన న్యూ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. కాబట్టి అతడికి తన కుటుంబంతో గడిపే సమయం కూడా ఇవ్వాలి కాదా. జిమ్మీ మా జట్టు పార్ట్‌టైమ్ బౌలింగ్ కన్సల్టెంట్ మాత్రమే. పూర్తి స్ధాయిలో అతడు తన సేవలను అందించడు" అంటూ ఓ ఇంటర్వ్యూలో మెకల్లమ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN: అలా ఎలా కొట్టావు హార్దిక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే( వీడియో)
Comments
Please login to add a commentAdd a comment