న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. పుణే వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత జట్టు..ఈ ఘెర పరాభవాన్ని మూటకట్టుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌పై భారత్ టెస్టు సిరీస్‌ను ఓడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
బ్యాటర్ల వైఫల్యం కారణంగానే పుణే టెస్టులో రోహిత్ సేన పరాజయం పాలైంది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 245 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వీ జైశ్వాల్ మినహా కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయారు.
లక్ష్య చేధనలో యశస్వీ దూకుడుగా ఆడి అభిమానుల్లో గెలుపుపై ఆశలను పెంచాడు. కానీ మిగితా బ్యాటర్లు చేతులేత్తేయడంతో టీమిండియా ఓటమి చవిచూసింది. జైశ్వాల్ 65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఈ క్రమంలో యశస్వీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
జైశ్వాల్ అరుదైన ఘనత..
టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 30 కంటే ఎక్కువ సిక్స్‌లు బాదిన తొలి భారత ప్లేయర్‌గా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు. 2024 ఏడాదిలో జైశ్వాల్ ఇప్పటివరకు 32 సిక్స్‌లు కొట్టాడు.
ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో జైశ్వాల్ రెండో స్ధానంలో నిలిచాడు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్‌లో ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ (33 సిక్స్‌లు) పేరిట ఉంది. ఈ కివీ దిగ్గజం 2014లో 33 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు యశస్వీ మరో రెండు సిక్స్‌లు బాదితే మెక్‌కల్లమ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. కివీస్‌తో జరిగే మూడో టెస్టులో ఈ రికార్డు బద్దులు అయ్యే ఛాన్స్ ఉంది.
చదవండి: IND vs NZ: ‘కివీ’ చేతుల్లో ఖేల్ ఖతం!
Comments
Please login to add a commentAdd a comment