పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్.. టీమిండియా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భారత్ లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. 34 పరుగుల వద్దే కెప్టెన్ రోహిత్ శర్మ (8) వికెట్ కోల్పోయినప్పటికీ.. టీమిండియా దూకుడు తగ్గలేదు.
యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టీ20 తరహాలో రెచ్చిపోతుండగా.. శుభ్‌మన్ గిల్ (20 బంతుల్లో 22; 4 ఫోర్లు) అడపాదడపా షాట్లతో అలరిస్తున్నాడు. టీమిండియా లక్ష్యానికి మరో 278 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ వికెట్ మిచెల్ సాంట్నర్‌కు దక్కింది.
అంతకుముందు న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. 198/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 57 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో (సెకెండ్) టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment