Andrew Strauss
-
ఇంతటి విషాదమా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట్లు చూడకుండానే.. మళ్లీ..
Andrew Strauss Recalls Wif Words After Learning Devastating Cancer Diagnosis: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం దాగుంది. అతడి భార్య రూత్ లంగ్ క్యాన్సర్‌తో అర్ధంతరంగా తనువు చాలించింది. ఇద్దరు చిన్నారుల ఆలనాపాలనా, వారి ముద్దుముచ్చట్లు పూర్తిగా చూడకుండానే ఈ లోకాన్ని వీడింది. భార్య పేరిట ఫౌండేషన్ భార్య జ్ఞాపకాలను మర్చిపోలేని స్ట్రాస్.. ఆమె పేరిట రూత్ స్ట్రాస్ పేరిట ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్నాడు. స్మోకింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం కల్పించడం, క్యాన్సర్ బాధితుల్లో అవగాహన పెంచడం సహా వ్యాధి తీవ్రతరమైన వారి కుటుంబాలకు ఎమోషనల్ సపోర్టునివ్వడంలో తోడ్పడటం ఈ ఫౌండేషన్ ధ్యేయం. కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నేపథ్యంలో జూన్ 29న మొదలు కానున్న రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా రూత్‌కు నివాళిగా రెడ్ ఫర్ రూత్ డే జరుపనున్నారు. ప్రేక్షకులు, వాలంటీర్లు తదితరులు ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రిబ్యూట్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ బాధిత కుటుంబాలను ఆదుకునే నిమిత్తం నిధులు సేకరించనున్నారు. ఇంతటి విషాదమా! ‘‘నేను ఎప్పుడైతే ఆ చేదువార్త విన్నానో అప్పుడు నా హృదయం ముక్కలైంది. నా మానసిక వ్యథను మాటల్లో వర్ణించలేను. మా జీవితాల్లో కోలుకోలేని షాక్ అది. అసలు మాకే ఎందుకిలా జరిగింది? ఇదసలు నిజమేనా? అంటూ నా మనసు పరిపరివిధాలుగా ఆలోచించింది. కానీ రూత్ మాత్రం ఆది నుంచి ధైర్యంగానే ఉంది. నాకే ఎందుకిలా? అని తను బాధపడుతూ కూర్చోలేదు. ప్రతిరోజూ ఇలాగే ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉండేది. మహమ్మారి బారిన పడ్డా తను అలా ఎలా ఉండగలిగిందో నాకైతే అర్థం కాలేదు. క్యాన్సర్ సోకిందన్న వార్త వినగానే తను కూల్‌గా స్పందించింది. టీ తాగుతారా? అని అడిగింది. చావుకు సిద్ధపడే నిజంగా.. దురదృష్టం తనను వెంటాడింది. చావుకు మానసికంగా సిద్ధమైనా.. పిల్లల విషయంలో మాత్రం చాలా బాధపడేది. వాళ్ల ఎదుగుదల చూడలేకపోతున్నానే అని వేదన చెందేది. జీవితంలో తను చాలా సాధించాలనుకుంది. కానీ అర్ధంతరంగా జీవితం ముగించాల్సి వస్తుందని తెలిసి.. ముందుగానే అందుకు సిద్ధమైంది. ఈ భూమ్మీద తనకు మిగిలిన రోజులను కుటుంబంతో సంతోషంగా గడపాలని నిశ్చయించుకుంది. తను మమ్మల్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోవడానికి ముందే మాకేం కావాలో అన్నీ అమర్చి పెట్టింది’’ అంటూ ఆండ్రూ స్ట్రాస్ తమ జీవితంలో చోటు చేసుకున్న విషాదం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన దివంగత భార్య రూత్ ఎంతో ధైర్యవంతురాలని, ఆమెను చాలా మిస్ అవుతున్నామని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా 2017లో తనకు క్యాన్సర్ సోకిందన్న విషయం తెలుసుకున్న రూత్.. ఆ మరుసటి ఏడాది తుదిశ్వాస విడిచింది. ఇక 2003లో ఆండ్రూ- రూత్ పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు సామ్(2005), లుకా (2008) జన్మించారు. కాగా రూత్ చనిపోయిన తర్వాత ఆండ్రూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. చదవండి: లేటు వయస్సులో రీ ఎంట్రీ ఇస్తానంటున్న ఆటగాడు.. ఏకంగా కోహ్లి స్ధానానికే! జింబాబ్వే చేతిలో ఓటమి ఎఫెక్ట్.. వైస్ కెప్టెన్‌నే తప్పించిన విండీస్ -
ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఘోర పరాభవం.. హెడ్‌కోచ్‌పై వేటు.. మాజీ కెప్టెన్ ఏమో!
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు పడింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం నేపథ్యంలో అతడు తన పదవి నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ఇక సిల్వర్‌వుడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించడంలో కీలకంగా వ్యవహరించిన మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ తన పదవి నుంచి దిగిపోయిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో జో రూట్ బృందం ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 0-4 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుని అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ రూట్, కోచ్ సిల్వర్‌వుడ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మేనేజ్మెంట్ తీరును కూడా పలువురు దిగ్గజాలు విమర్శించారు. ఈ క్రమంలో ఎండీ, హెడ్‌కోచ్ తమ పదవుల నుంచి వైదొలగడం గమనార్హం. ఈ సందర్భంగా సిల్వర్‌వుడ్ మాట్లాడుతూ... ‘‘ఇంగ్లండ్ జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మేటి ఆటగాళ్లు, సిబ్బందితో కలిసి ప్రయాణించడం నాకు గర్వకారణం. గడిచిన రెండేళ్లు ఎంతో ముఖ్యమైనవి. అయితే రూటీ(టెస్టు కెప్టెన్ జో రూట్), మోర్గ్స్(పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్)తో కలిసి పనిచేయడం... కఠిన సవాళ్లను ఎదుర్కోవడం పట్ల గర్వంగా ఉంది. కోచ్‌గా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఎండీ ఆష్లే స్థానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. టెస్టు సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో కేర్ టేకర్ కోచ్‌ను అతడు నియమించనున్నాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్ Just put out the one mitt - and it stuck! #Ashes pic.twitter.com/10yK7Cadc3 — cricket.com.au (@cricketcomau) January 16, 2022 Chris Silverwood has left his role as England Men’s Head Coach. We wish him all the best for the future. — England Cricket (@englandcricket) February 3, 2022 -
ఆల్‌టైమ్ గ్రేట్‌లలో వారు కూడా..
మాంచెస్టర్: టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ప్రశంసలు వర్షం కురిపించాడు. వెసిండీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయిన బ్రాడ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. సుదీర్ఘకాలంగా మరో పేసర్ అండర్సన్‌తో కలిసి పేస్ విభాగాన్ని పంచుకుంటున్న బ్రాడ్‌ను ఇంతకంటే గొప్ప ఫామ్‌లో చూసిన దాఖలాలు లేవన్నాడు. విండీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించిన బ్రాడ్.. రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు సాధించాడు. తద్వారా 499 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఇప్పటికే ఐదు వందల వికెట్ల క్లబ్లో ఉన్న అండర్సన్ సరసన చేరడానికి బ్రాడ్ వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అండర్సన్-బ్రాడ్లపై స్ట్రాస్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో స్థానం సంపాదించారంటూ కొనియాడాడు. సోమవారం వెస్టిండీస్- ఇంగ్లండ్ సిరీస్ ముగింపులో నాల్గవ రోజు రోజు ఆట వర్షార్పణం అయిన తర్వాత స్ట్రాస్ మాట్లాడాడు. గతంలో మణికట్టు గాయంతో బాధపడ్డ స్ట్రాస్.. తిరిగి గాడిలో పడటానికి చాలా శ్రమించాడన్నాడు. ముఖ్యంగా కుడిచేతి వాటం ఆటగాళ్లకు బౌలింగ్ చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని బ్రాడ్ అధిగమించాడన్నాడు. సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పుడు బ్రాడ్ తొలగించబడ్డాడని, కానీ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన సిరీస్-లెవలింగ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడన్నాడు.ఇక సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో బ్రాడ్ చెలరేగిపోవడం హర్షించదగ్గ పరిణామమన్నాడు.చదవండి: (నాలుగో రోజు వర్షార్పణం ) -
రెడ్ ఫర్ రూత్...
ఓల్డ్‌ట్రాఫోర్డ్ టెస్టును ఇంగ్లండ్ బోర్డు ‘రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ టెస్ట్’గా వ్యవహరిస్తోంది. అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్ (పొగ తాగనివారిలో వస్తుంది)తో రెండేళ్ల క్రితం మరణించిన మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ట్రస్ట్ కోసం నిధుల సేకరణ దీని ఉద్దేశం. ఈ మ్యాచ్‌కు ముందు ఎరుపు రంగు జెర్సీలు, క్యాప్‌లు ధరించి ‘రెడ్ ఫర్ రూత్’ అంటూ తమ సంఘీభావాన్ని ప్రకటించిన ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు ఆ తర్వాత వాటిపై తమ సంతకాలు చేసి వేలం కోసం స్ట్రాస్ కుమారులకు తిరిగి అందజేశారు. మ్యాచ్ రెండో రోజు శనివారం స్టంప్స్, బౌండరీ బోర్డులు సహా మైదానమంతా ఎరుపు రంగును ప్రదర్శిస్తారు. ‘రెడ్ ఫర్ రూత్’ అంటూ విరాళాల సేకరించడం ఇది రెండోసారి. 2019లో యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన లార్డ్స్ టెస్టు ద్వారా సుమారు 5.5 లక్షల పౌండ్లు వచ్చాయి. క్యాన్సర్‌తో మరణించిన వారి పిల్లల సంక్షేమం కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు. ఈసారి కోవిడ్ కారణంగా మైదానంలో ప్రేక్షకులు లేకపోవడం వెలితిగా అనిపించినా... ఆన్లైన్ ద్వారా పెద్ద మొత్తంలో టీ షర్ట్లు, క్యాప్‌లు కొని అభిమానులు అండగా నిలిచారు. ఇంగ్లండ్ తరఫున 100 టెస్టుల్లో 7,037 పరుగులు చేసిన స్ట్రాస్ 50 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. -
ఆండ్రూ స్ట్రాస్ మళ్లీ వచ్చేశాడు..
లండన్: గతేడాది ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) డైరెక్టర్ పదవికి గుడ్ బై చెప్పిన ఆ దేశ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌కు మళ్లీ కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఈసీబీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్ని స్థాయిల్లోనూ ఇంగ్లండ్ క్రికెట్‌ను పర్యవేక్షించే కమిటీ చైర్మన్ బాధ్యతను స్ట్రాస్‌కు ఇచ్చినట్లు ఈసీబీ ప్రకటించింది. గడిచిన ఏడాది తన భార్య రూత్ క్యాన్సర్‌తో మంచాన పట్టడంతో స్ట్రాస్ డైరక్టర్ పదవిని వదులుకున్నాడు. దాంతో డైరక్టర్‌గా ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఆష్లే గేల్స్‌ను నియమించారు. గత డిసెంబర్లో రూత్ మృతి చెందగా అప్పట్నుంచి స్ట్రాస్ క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. కాగా, మళ్లీ స్ట్రాస్‌ను క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియమించడానికి ఈసీబీ మొగ్గుచూపగా, అతను కూడా అంగీకరించాడు. దీనిపై స్ట్రాస్ మాట్లాడుతూ.. ‘ నాకు కష్టకాలంలో ఈసీబీ అండగా నిలిచింది. మళ్లీ నాకు ఒక పాత్రను అప్పచెప్పడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఇంగ్లండ్‌లో క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తా’ అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ప్రధాన కోచ్ ట్రావెర్ బెయిలిస్‌ను స్ట్రాస్ నియమించిన సంగతి తెలిసిందే. బెయిలిస్ పర్యవేక్షణలోని ఇంగ్లిష్ జట్టు వరల్డ్‌కప్‌ను గెలిచి తమ చిరకాల కోరికను సాకారం చేసుకుంది. -
‘రూత్... మాకు తీరని శోకాన్ని మిగిల్చింది’
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ స్ట్రాస్(46) కన్నుమూశారు. గత కొంత కాలంగా లంగ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె శనివారం మరణించినట్లు స్ట్రాస్ కుటుంబం తెలిపింది. ‘మహమ్మారి క్యాన్సర్ బారిన పడిన రూత్ మమ్మల్ని శాశ్వతంగా విడిచివెళ్లింది. మాకు తీరని శోకాన్ని మిగిల్చింది. నాతో పాటుగా సామ్, లుకా తనని ఎంతగానో మిస్సవుతారు. రూత్‌ను కలిసిన ప్రతీ ఒక్కరికీ తన ఎంత స్నేహభావం కలదో ఇట్టే తెలిసిపోయేది. గత 12 నెలలుగా తన చికిత్సకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. తన పేరిట ఫౌండేషన్ నెలకొల్పి క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తాం’ అంటూ ఆండ్రూ స్ట్రాస్ తరఫున ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఆస్ట్రేలియాకు చెందిన రూత్.. 2003లో ఆండ్రూ స్ట్రాస్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి సామ్, లుకా అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2017లో ఆమెకు క్యాన్సర్ సోకింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, గోల్ఫ్ ప్లేయర్ ల్యూక్ డొనాల్డ్ తదితరులు రూత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆండ్రూ స్ట్రాస్ పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు. -
ఇంగ్లండ్ క్రికెటర్లకు డెడ్‌లైన్!
మాంచెస్టర్: త్వరలోబంగ్లాదేశ్ పర్యటనకు సంబంధించి ఇటీవలే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్లియరెన్స్ ఇవ్వడం ఆ దేశ క్రికెటర్లకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. బంగ్లాదేశ్ పర్యటనకు ఎవరైనా విముఖత చూపితే, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చని ఆ జట్టు డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చే ఆటగాళ్లకు మూడు రోజల డెడ్‌లైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశాడు. 'ఈ విషయాన్ని ప్రతీ క్రికెటర్ గుర్తించుకోవాలి. బంగ్లాదేశ్ టూర్ రిస్క్ అని భావించి ఎవరైనా అనుకుంటే మూడు రోజుల్లో మాకు తెలియజేయాలి. ఆ స్థానంలో వేరే క్రికెటర్‌ను పంపుతాం. ఒకవేళ ఆ పర్యటనకు వెళ్లిన క్రికెటర్లు రాణిస్తే, వెళ్లని క్రికెటర్లకు రానున్న రోజుల్లో రిస్క్ తప్పదు. 'అని స్ట్రాస్ స్పష్టం చేశాడు. ఈ పర్యటనకు టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్‌తో పాటు, మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్లు ఇప్పటికే అంగీకారం తెలిపారు. కాగా, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రం బంగ్లా పర్యటనపై ఇంకా తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంది. దీనిలో భాగంగా మోర్గాన్ కు ఆండ్రూ స్ట్రాస్ హితబోధ చేశాడు. ఒకవేళ మోర్గాన్ అక్కడి వెళ్లాలనుకుంటే అనవసర భయాలు వదిలి పూర్తి దృష్టంతా క్రికెట్ పైనే సారించాల్సిన అవసరం ఉందన్నాడు. అలా చేసిన పక్షంలోనే జట్టుకు లాభం చేకూరుతుందదంటూ స్ట్రాస్ పరోక్షంగా హెచ్చరించాడు. -
పీటర్సన్ ఆశలు ఆవిరి
ఇంగ్లండ్ జట్టులో దక్కని చోటు కెవిన్‌ను నమ్మలేమన్న స్ట్రాస్ లండన్ : ఎలాగైనా తిరిగి ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలన్నది కెవిన్ పీటర్సన్ లక్ష్యం. ఇందుకోసం ఐపీఎల్ వదిలేసుకున్నాడు. కౌంటీల్లో కసిగా ఆడాడు. ఓ ఆటగాడిగా ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఇకపై అందరితోనూ స్నేహంగా ఉంటానని హామీ ఇచ్చాడు. అయినాగానీ అతనికి ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కలేదు. కెవిన్‌ను నమ్మలేమని, జట్టులోకి రావాలంటే ముందు సహచరుల నమ్మకాన్ని గెలవాలని ఇంగ్లండ్ జట్టు కొత్త కోచ్ ఆండ్రూ స్ట్రాస్ అన్నాడు. 2013లో స్ట్రాస్ ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా పీటర్సన్... స్ట్రాస్ గురించి ప్రత్యర్థి క్రికెటర్లకు సందేశాలు పంపించాడు. దీంతో అతణ్ని జట్టు నుంచి తొలగించారు.