Yuvraj Singh Tweet On Stuart Broad Retirement: ‘‘టేక్ ఏ బో.. స్టువర్ట్ బ్రాడ్! టెస్టుల్లో అసాధారణ రీతిలో సాగింది నీ ప్రయాణం. అందుకు నా అభినందనలు. రెడ్ బాల్ క్రికెట్‌లో బ్యాటర్లను భయపెట్టే అత్యద్భుతమైన బౌలర్లలో ఒకడివి నువ్వు. నువ్వు.. రియల్ లెజెండ్.
నీ సుదీర్ఘ ప్రయాణం సాఫీగా సాగడానికి ఆట పట్ల నీకున్న అంకితభావమే కారణం. సూపర్ ఇన్‌స్పైరింగ్. నీ జీవితంలోని తదుపరి దశకు గుడ్‌లక్ బ్రాడీ!!’’ అంటూ టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు.
17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడికి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా అతడితో ఉన్న అరుదైన ఫొటోను యువీ అభిమానులతో పంచుకున్నాడు. కాగా 17 ఏళ్ల కెరీర్‌కు స్వస్తి పలుకుతూ స్టువర్డ్ బ్రాడ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పీడకలను మిగిల్చిన యువీ
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్టు తనకు చివరిదని పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టెస్టుల్లో 600 దాకా వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్ 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక 2014లో ఇంగ్లండ్ తరఫున చివరి టీ20 ఆడిన బ్రాడ్‌కు.. యువరాజ్ సింగ్ ఓ పీడకలను మిగిల్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.
అంతర్జాతీయ టీ20లలో 2006లో అడుగుపెట్టిన బ్రాడ్.. 2007లో పొట్టిఫార్మాట్లో జరిగిన మొట్టమొదటి ప్రపంచకప్ ఈవెంట్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్ అతడికి కోలుకోలేని షాకిచ్చింది. బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సాధించి అతడికి కాళరాత్రిని మిగిల్చాడు.
అందుకే వైరల్‌గా యువీ ట్వీట్
ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్.. 37 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్‌ను ఉద్దేశించి ఈ మేరకు లెజెండ్ అంటూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో బ్రాడ్ మూడు ఫార్మాట్లలో కలిపి 850 వికెట్ల దాకా పడగొట్టాడు. ఇంగ్లండ్ మేటి పేసర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.
చదవండి: పిచ్చి ప్రయోగాలకు చెక్.. జట్టులోకి జట్టులోకి వారిద్దరూ! 9 ఏళ్ల తర్వాత
Take a bow @StuartBroad8 🙇🏻♂️
— Yuvraj Singh (@YUVSTRONG12) July 30, 2023
Congratulations on an incredible Test career 🏏👏 one of the finest and most feared red ball bowlers, and a real legend!
Your journey and determination have been super inspiring. Good luck for the next leg Broady! 🙌🏻 pic.twitter.com/d5GRlAVFa3
Comments
Please login to add a commentAdd a comment