సిడ్నీ:త్వరలో ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ లో తమకు ఎదురయ్యే ప్రమాదకర బ్యాట్స్ మన్ ఎవరైనా ఉన్నారంటే అది ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నరేనని ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్ తో జాగ్రత్తగా ఉండాలంటూ సహచర ఆటగాళ్లకు ముందుగా హెచ్చరికలు జారీ చేశాడు. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తో బ్రాడ్ మాట్లాడుతూ..' ఫీల్డ్ లో వార్నర్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. అతనికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా బ్యాట్ తో రెచ్చిపోతాడు. దూకుడుకు మారుపేరైన వార్నర్ ను ఇబ్బంది పెట్టాలే బంతులు వేయడం మా ప్రణాళికలో భాగం. అతన్ని అవుట్ చేయాలంటే కొత్త బంతితో సాధ్యమైన్ని పదునైన బంతులు సంధించాలి. అప్పుడు వార్నర్ తొందరగా పెవిలియన్ పంపుతాం. ఒకవేళ ఇది విఫలమైతే ప్లాన్ బి కూడా మన వద్ద ఉండాలి.
మిగతా బ్యాట్స్ మెన్ కంటే కూడా వార్నర్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాం. ఎందుకంటే అతను మ్యాచ్ ను మలుపు తిప్పడంలో దిట్ట'అని బ్రాడ్ తెలిపాడు. ఒకవేళ వార్నర్ విషయంలో ఏమాత్రం తప్పు చేసినా అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని బ్రాడ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment