
తడబడిన శ్రీలంక
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ శ్రీలంక ఆటతీరులో మార్పు కనిపించడం లేదు.
తొలి ఇన్నింగ్స్‌లో 91/8 ఇంగ్లండ్ 498/9 డిక్లేర్
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ శ్రీలంక ఆటతీరులో మార్పు కనిపించడం లేదు. తొలి టెస్టు మాదిరే ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి లంక బ్యాట్స్‌మెన్ పరుగులు తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 8 వికెట్లకు 91 పరుగులు చేసింది.
కుశాల్ మెండిస్ (62 బంతుల్లో 35; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. పేసర్ క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్ మూడేసి వికెట్లు తీసి లంకను కట్టడి చేశారు. అండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 132 ఓవర్లలో 498/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మొయిన్ అలీ (207 బంతుల్లో 155 నాటౌట్; 17 ఫోర్లు; 2 సిక్సర్లు) ధాటిగా ఆడి అజేయ శతకం సాధించాడు.