Moin Ali
-
అశ్విన్, జైశ్వాల్ మెరుపులు.. రాజస్తాన్ రాజసంగా ప్లేఆఫ్స్‌కు
ముంబై: రాజస్తాన్ రాయల్స్ లక్ష్యఛేదనకు దిగిన తొలి ఓవర్ పూర్తవడంతోనే నెట్ రన్‌రేట్‌తో ఈ ఐపీఎల్ సీజన్లో ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల విజయంతో రాజస్తాన్ లీగ్ దశను రెండో స్థానంతో ముగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ (57 బంతుల్లో 93; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ప్రదర్శన చేశాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవిచంద్రన్ అశ్విన్ (23 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఆడింది అలీ ఒక్కడే! ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (2), కాన్వే (16) సహా... జగదీశన్ (1), అంబటి రాయుడు (3), ధోని (28 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) ఇలా చెన్నై బ్యాటర్లంతా నిరాశపరిస్తే వన్‌డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ ఒంటరి పోరాటం చేశాడు. ఇక చెన్నై జోరంతా 4, 5, 6 ఓవర్లలోనే కనిపించింది. ఆ తర్వాత బోర్ కొట్టించింది. ఆ మూడు ఓవర్లయితే అలీ జూలు విదిల్చాడు. ప్రసిధ్ కృష్ణ నాలుగో ఓవర్లో 4, 4, 0, 6, 4, 0లతో 18 పరుగులు పిండుకున్న అలీ... అశ్విన్ ఐదో ఓవర్లో రెండు బౌండరీలు, ఒక సిక్సర్ బాదాడు. ఇక బౌల్ట్ ఆరో ఓవరైతే బంతి ఆరుసార్లూ బౌండరీ లైను దాటింది. 6, 4, 4, 4, 4, 4లతో అలీ శివమెత్తాడు. ఈ ఓవర్లో 26 పరుగులొచ్చాయి. 19 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయింది. పవర్ ప్లేలో చెన్నై స్కోరు 75/1 అయితే అలీ ఒక్కడివే 59 పరుగులుండటం విశేషం. ఆ తర్వాత 14 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి మరో 75 పరుగులే చేయగలిగింది. ఆఖరి ఓవర్ తొలిబంతికే మొయిన్ అవుట్ కావడంతో సెంచరీ చేజారింది. యశస్వి అర్ధ శతకం భారీ లక్ష్యం కాకపోయినా ఛేదించేందుకు రాజస్తాన్ కష్టపడింది. ఆరంభంలోనే బట్లర్ (2) పెవిలియన్ చేరగా, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ సామ్సన్ (15) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించాక స్వల్ప వ్యవధిలో సామ్సన్తో పాటు పడిక్కల్ (3) కూడా పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచిన జైస్వాల్ 39 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. అయితే జట్టు స్కోరు 100 పరుగులు దాటాక జైస్వాల్‌ను, హెట్‌మైర్ (6)ని అవుట్ చేసిన సోలంకి రాయల్స్ శిబిరంలో గుబులు రేపాడు. ఈ దశలో అశ్విన్ సిక్సర్లతో ఆపద్భాంధవుడి పాత్ర పోషించి.. పరాగ్ (10 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించాడు. Playoffs Qualification ✅ No. 2⃣ in the Points Table ✅ Congratulations to the @IamSanjuSamson-led @rajasthanroyals. 👏 👏 Scorecard ▶️ https://t.co/ExR7mrzvFI#TATAIPL | #RRvCSK pic.twitter.com/PldbVFTOXo — IndianPremierLeague (@IPL) May 20, 2022 -
రసపట్టులో.. భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు
తొలి టెస్టులో చివరి రోజు వర్షం శాసించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించినా... రెండో టెస్టులో మాత్రం భారత్, ఇంగ్లండ్ జట్లలో ఒక జట్టు గెలుపు రుచి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పుజారా, రహానే మొండి పట్టుదలతో ఆడి ఆదుకునే ప్రయత్నం చేయగా... మార్క్ వుడ్, మొయిన్ అలీ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌కు మ్యాచ్‌పై మళ్లీ ఆశలు రేకెత్తించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉండగా... ఆఖరి రోజు భారత్‌ను సాధ్యమైనంత తొందరగా ఆలౌట్ చేయడంపై ఇంగ్లండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి లార్డ్స్ టెస్టులో చివరిదైన ఐదో రోజు ఆద్యంతం ఆసక్తికరంగా సాగడం ఖాయమనిపిస్తోంది. లండన్: మూడో రోజు ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం లభించింది. నాలుగో రోజు మ్యాచ్‌పైనే పట్టు సాధించే పరిస్థితిని సృష్టించుకుంది. ఆతిథ్య జట్టు పేస్–స్పిన్‌ల కలబోత భారత్‌ను కష్టాలపాలు చేసింది. పేసర్ మార్క్ వుడ్ (3/40) ‘టాప్’ లేపగా... స్పిన్నర్ మొయిన్ అలీ (2/52) పాతుకుపోతున్న భారత ఇన్నింగ్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో అజింక్య రహానే (146 బంతుల్లో 61; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (206 బంతుల్లో 45; 4 ఫోర్లు) జట్టును ఆదుకునేందుకు చేసిన పోరాటం ఆఖరిదాకా నిలువలేదు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (14 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. కానీ చేతిలో ఒక బ్యాట్స్‌మనే ఉన్నాడు. మిగతా వాళ్లంతా బౌలర్లే! వణికించిన వుడ్ భారత ఓపెనింగ్ జోడీ రాహుల్–రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్ పేస్‌కు వణికింది. 27 పరుగుల లోటుతో మొదలైన భారత రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ సీమర్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. వుడ్ తన వరుస ఓవర్లలో రాహుల్ (5), రోహిత్ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్)లను పెవిలియన్ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే ఈ రెండు వికెట్లు పడ్డాయి. పుజారాకు కెప్టెన్ కోహ్లి జతయ్యాడు. కానీ ఈ జోడీ ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్ కరన్ ఔట్ చేశాడు. క్రీజులోకి రహానే రాగా... 56/3 స్కోరు వద్ద మనోళ్లు లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రహానే అర్ధసెంచరీ తర్వాత భారత్ ఆత్మరక్షణలో పడింది. రహానే, పుజారా పూర్తిగా వికెట్లు కాపాడుకునేందుకే పరిమితమయ్యారు. దాంతో పరుగుల వేగం మందగించింది. దీంతో ఈ రెండో సెషన్లో 28 ఓవర్లు ఆడినా కూడా భారత్ 50 పరుగులు చేయలేకపోయింది. ఓవర్‌కు 2 పరుగుల రన్‌రేట్‌తో ఎట్టకేలకు 51 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరుకుంది. వికెట్ కాపాడుకున్న ప్రయోజనం నెరవేరడంతో 105/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు. ఆఖరి సెషన్లోనూ ఇద్దరు నెమ్మదిగానే ఆడారు. ఈ క్రమంలో 125 బంతుల్లో 5 బౌండరీలతో రహానే ఫిఫ్టీ పూర్తయింది. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్ వుడ్ మళ్లీ కుదుపేశాడు. పుజారాను ఔట్ చేశాడు. తర్వాత మొయిన్ అలీ స్వల్ప వ్యవధిలో రహానే పోరాటానికి చెక్ పెట్టి... రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్ చేశాడు. దీంతో మూడో సెషన్ భారత్‌కు మళ్లీ ముప్పు తెచ్చింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 364; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391; భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజారా (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లి (సి) బట్లర్ (బి) స్యామ్ కరన్ 20; రహానే (సి) బట్లర్ (బి) మొయిన్ అలీ 61; పంత్ (బ్యాటింగ్) 14; జడేజా (బి) మొయిన్ అలీ 3; ఇషాంత్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (82 ఓవర్లలో 6 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175. బౌలింగ్: అండర్సన్ 18–6–23–0, రాబిన్సన్ 10–6–20–0, వుడ్ 14–3–40–3; స్యామ్ కరన్ 15–3–30–1, మొయిన్ అలీ 20–1–52–2, రూట్ 5–0–9–0. -
IPL 2021 CSK vs PBKS: చెన్నై చమక్..
బౌలింగ్‌లో దీపక్ చహర్ మ్యాజిక్ స్పెల్... ఫీల్డింగ్‌లో జడేజా విన్యాసాలు... వెరసి రెండు కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్) జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పైచేయి సాధించింది. ఎలాంటి ఉత్కంఠభరిత క్షణాలు లేకుండా ఏకపక్షంగా ముగిసిన ఈ పోరులో నెగ్గి ఐపీఎల్ తాజా సీజన్లో ధోని జట్టు బోణీ కొట్టింది. ముంబై: వారం రోజులుగా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో... ఊహించని ట్విస్ట్‌లతో అలరించిన ఐపీఎల్ తాజా సీజన్‌కు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్ల మధ్య మ్యాచ్ రూపంలో స్పీడ్ బ్రేకర్ తారసపడింది. మెరుపులు, అనూహ్య మలుపులు లేకుండానే శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని సీఎస్కే 6 వికెట్లతో పంజాబ్ కింగ్స్‌పై విజేతగా నిలిచి గెలుపు ఖాతాను తెరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (4/13) బెంబేలెత్తించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. షారుఖ్ ఖాన్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్యామ్ కరన్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావోలు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 107 పరుగులు చేసి గెలుపొందింది. మొయిన్ అలీ (31 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్)... డు ప్లెసిస్ (33 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. షమీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. నింపాదిగా... స్వల్ప ఛేదనలో రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్‌ను సీఎస్కే త్వరగానే కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మొయిన్ అలీ... డు ప్లెసిస్‌తో కలిసి జట్టును ముందుకు నడిపాడు. గతి తప్పిన బంతులను బౌండరీలకు బాది పవర్‌ప్లేలో 32 పరుగులు సాధించారు. డు ప్లెసిస్ సింగిల్స్ తీస్తూ అలీకే స్ట్రయికింగ్ వచ్చేలా చూశాడు. దాంతో కాస్త దూకుడు కనబర్చిన అలీ... అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్, మెరిడిత్ బౌలింగ్‌లలో మూడు ఫోర్లు బాదాడు. దాంతో సీఎస్కే ఛేజింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగింది. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన అలీ... అదే ఓవర్లో స్లాగ్ స్వీప్‌కు ప్రయత్నించి షారుఖ్ ఖాన్ చేతికి చిక్కాడు. దాంతో 66 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రైనా (8), రాయుడు (0) వరుస బం తుల్లో అవుటైనా... క్రీజులోకి వచ్చిన స్యామ్ కరన్ (5 నాటౌట్) బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. షారుఖ్ ఖాన్ మినహా... తన ఐపీఎల్ కెరీర్లో రెండో మ్యాచ్ ఆడిన షారుఖ్ ఖాన్ మినహా పంజాబ్ కింగ్స్‌లో ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీలు సాధించిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (5), క్రిస్ గేల్ (10), దీపక్ హుడా (10)లతో పాటు ఓపెనర్ మయాంక్ (0), నికోలస్ పూరన్ (0) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో పంజాబ్ 10 ఓవర్లు ముగిసేసరికి 48/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో ఉన్న కొత్త కుర్రాడు షారుఖ్ ఖాన్... జే రిచర్డ్సన్ (15; 2 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 31 పరుగులు, మురుగన్ అశ్విన్ (6)తో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. అడపాదడపా బౌండరీలు కొట్టిన షారుఖ్ ఖాన్ పంజాబ్ స్కోరు 100 దాటేలా చేశాడు. హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన అతడు చివరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (రనౌట్) 5; మయాంక్ అగర్వాల్ (బి) దీపక్ చహర్ 0; గేల్ (సి) జడేజా (బి) దీపక్ చహర్ 10; దీపక్ హుడా (సి) డు ప్లెసిస్ (బి) చహర్ 10; పూరన్ (సి) శార్దుల్ ఠాకూర్ (బి) చహర్ 0; షారుఖ్ ఖాన్ (సి) జడేజా (బి) స్యామ్ కరన్ 47; జే రిచర్డ్సన్ (బి) మొయిన్ అలీ 15; మురుగన్ అశ్విన్ (సి) డు ప్లెసిస్ (బి) బ్రావో 6; షమీ (నాటౌట్) 9; మెరిడిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–19, 4–19, 5–26, 6–57, 7–87, 8–101. బౌలింగ్: దీపక్ చహర్ 4–1–13–4, స్యామ్ కరన్ 3–0–12–1, శార్దుల్ ఠాకూర్ 4–0–35–0, జడేజా 4–0–19–0, మొయిన్ అలీ 3–0–17–1, బ్రావో 2–0–10–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) దీపక్ హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 5; డు ప్లెసిస్ (నాటౌట్) 36; మొయిన్ అలీ (సి) షారుఖ్ ఖాన్ (బి) మురుగన్ అశ్విన్ 46; సురేశ్ రైనా (సి) రాహుల్ (బి) షమీ 8; అంబటి రాయుడు (సి) పూరన్ (బి) షమీ 0; స్యామ్ కరన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (15.4 ఓవర్లలో 4 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–24; 2–90, 3–99, 4–99. బౌలింగ్: షమీ 4–0–21–2, జే రిచర్డ్సన్ 3–0–21–0, అర్‡్షదీప్ సింగ్ 2–0–7–1, మెరిడిత్ 3.4–0–21–0, మురుగన్ అశ్విన్ 3–0–32–1. ఐపీఎల్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ X ముంబై ఇండియన్స్ వేదిక: చెన్నై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
ధోని మళ్లీ గెలిపించగలడా!
మూడుసార్లు చాంపియన్... ఐదుసార్లు రన్నరప్... ఒక్కసారి మినహా ఆడిన ప్రతీ సీజన్లో టాప్–4లో స్థానం... ఐపీఎల్లో అత్యంత నిలకడైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రికార్డు ఎంతో ప్రత్యేకం. నిషేధం తర్వాత తిరిగొచ్చి ఒకసారి విజేతగా, మరోసారి రన్నరప్‌గా కూడా చెన్నై నిలవగలిగింది. కానీ 2020లో ఆ జట్టు ప్రదర్శన చూసిన తర్వాత ఒక్కసారిగా అభిమానులకు కూడా నీరసం వచ్చేసింది. ఒక్క ఆటగాడు కూడా తగినంతగా రాణించకపోవడంతో ‘సీనియర్ సిటిజన్ టీమ్’ అంటూ వినిపించే వ్యంగ్యాస్త్రాలు మళ్లీ మొదలయ్యాయి. ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ఈసారి కూడా దాదాపు అదే ‘కోర్ గ్రూప్’తో సీఎస్కే బరిలోకి దిగుతుండటం వల్ల కావచ్చు అంచనాలు కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే సూపర్ కింగ్స్‌కు కర్త, కర్మ, క్రియగా సర్వం తానే అయి నడిపించే ధోని ఉండగా ఏదీ అసాధ్యం కాదని ఆ జట్టు నమ్ముతోంది. బలమైన నాయకత్వంలో వెటరన్ ఆటగాళ్లతో నిండిన చెన్నై టీమ్ ఎలాంటి ఫలితాలు సాధించగలదనేది ఆసక్తికరం. కొత్తగా వచ్చినవారు... ఐపీఎల్ వేలానికి ముందు చెన్నైకి ఒక విదేశీ టాపార్డర్ బ్యాట్స్‌మన్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్, ఆఫ్ స్పిన్నర్ అవసరం కనిపించింది. లీగ్‌లో ఆ జట్టు భారీ మొత్తం వెచ్చించిన ఇద్దరు టాప్ ప్లేయర్లు ఆఫ్ స్పిన్ వేస్తూ ధాటిగా బ్యాటింగ్ చేయగలవారే కావడం విశేషం. వేలంలో సీఎస్కే కృష్ణప్ప గౌతమ్ (రూ. 9.25 కోట్లు), మొయిన్ అలీ (రూ. 7 కోట్లు)లను తీసుకుంది. టెస్టు స్పెషలిస్ట్ పుజారా (రూ. 50 లక్షలు) ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించినా... నెమ్మదైన చెపాక్ స్టేడియం పిచ్‌లపై అతని శైలి ఆటగాడు ఒకరు జట్టులో ఉంటే మంచిదని భావించి ఉండవచ్చు. ఈ ముగ్గురు కాకుండా కనీస ధర రూ. 20 లక్షల చొప్పున ముగ్గురు వర్ధమాన క్రికెటర్లను ఎంపిక చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన భగత్ వర్మ, ఆంధ్ర ఆటగాడు హరిశంకర్ రెడ్డిలతో పాటు సి.హరి నిశాంత్ టీమ్‌లోకి వచ్చారు. విదేశీ టాపార్డర్ బ్యాట్స్‌మన్ లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా డుప్లెసిస్ విఫలమైతే మరో ప్రత్యామ్నాయాన్ని అందుబాటులో ఉంచుకుంటే బాగుండేది. తుది జట్టు అంచనా/ఫామ్ గత సీజన్లో తీవ్రంగా నిరాశపర్చిన తర్వాత కూడా చెన్నై మరోసారి దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశాలు ఉండటంతో మెరుగైన ఫలితాలపై మళ్లీ సందేహాలు రేకెత్తుతున్నాయి. ఆటగాళ్ల తాజా ఫామ్‌ను బట్టి చూస్తే నలుగురు విదేశీ ఆటగాళ్లుగా తొలి ప్రాధాన్యత డు ప్లెసిస్, స్యామ్ కరన్, అలీ, తాహిర్‌లకు దక్కవచ్చు. సీజన్ మధ్యలో బ్రేవో, సాన్‌ట్నర్‌లకు అవకాశం దక్కవచ్చు. అలీ, కరన్‌లకు ఇటీవలే భారత గడ్డపై ఆడిన అనుభవం ఉండటం జట్టుకు మేలు చేసే అంశం. అయితే 37 ఏళ్ల డు ప్లెసిస్ ఇటీవల పేలవంగా ఆడుతున్న నేపథ్యంలో ఏమాత్రం ప్రభావం చూపించగలడో చూడాలి. రైనా పునరాగమనం చేయడం మంచిదే అయినా... 2019 ఐపీఎల్ నుంచి రాబోయే ఐపీఎల్ వరకు దాదాపు రెండేళ్ల మధ్య కాలంలో అతను కేవలం ఐదంటే ఐదు టి20 మ్యాచ్‌లే ఆడి మూడింట్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా కేవలం నెట్స్ సాధనతో అతను ఏమాత్రం సత్తా చాటుతాడనేది సందేహమే! గాయం నుంచి కోలుకున్న జడేజా నేరుగా లీగ్ బరిలోకి దిగుతుండగా... టీమిండియా రెగ్యులర్ సభ్యుడిగా ప్రస్తుతం చురుగ్గా ఉన్న ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఒక్కడే. పుజారాకు ఎన్ని మ్యాచ్‌లలో అవకాశం వస్తుందో చూడాలి. గత సీజన్లో రాయుడు పెద్దగా ప్రభావం చూపలేదు. ఉతప్ప, రుతురాజ్లపై బ్యాటింగ్ భారం ఉండగా ... ఆల్‌రౌండర్‌గా గౌతమ్ ప్రభావం చూపించాల్సి ఉంది. బౌలింగ్‌లో దీపక్ చహర్ కీలకం కానున్నా డు. ఈసారి కూడా మ్యాచ్‌లు చెన్నైలో లేకపోవడం మరో ప్రతికూలత. అయితే అన్నింటికి మించి ఎప్పటిలాగే ధోని బ్యాటింగ్, అతని నాయకత్వంపైనే అందరి దృష్టీ ఉంది. ఆటగాడిగా ఇది అతనికి ఆఖరి సీజన్ కావచ్చని వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా టీమ్‌ను నడిపిస్తాడనేది చూడాలి. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: ధోని (కెప్టెన్), రైనా, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, రాయుడు, పుజారా, కరణ్ శర్మ, రాబిన్ ఉతప్ప, కృష్ణప్ప గౌతమ్, రుతురాజ్ గైక్వాడ్, భగత్ వర్మ, హరిశంకర్ రెడ్డి, హరి నిశాంత్, జగదీశన్, కేఎస్ ఆసిఫ్, సాయి కిషోర్. విదేశీ ఆటగాళ్లు: తాహిర్, మొయిన్ అలీ, డు ప్లెసిస్, బ్రేవో, ఇన్‌గిడి, సాన్‌ట్నర్, స్యామ్ కరన్. సహాయక సిబ్బంది: ఫ్లెమింగ్ (హెడ్ కోచ్), హస్సీ (బ్యాటింగ్ కోచ్), ఎల్.బాలాజీ (బౌలింగ్ కోచ్), రాజీవ్ (ఫీల్డింగ్ కోచ్). అత్యుత్తమ ప్రదర్శన 2010, 2011, 2018లో చాంపియన్ 2020లో ప్రదర్శన: చెన్నై ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త ప్రదర్శన 2020లో నమోదు చేసింది. 14 మ్యాచ్‌లలో 6 మాత్రమే గెలిచిన టీమ్, ఒక దశలో ఆఖరి స్థానంలో నిలిచేలా కనిపించినా... స్వల్ప రన్‌రేట్ తేడాతో రాజస్తాన్‌ను వెనక్కి నెట్టి చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆడిన 11 సీజన్లలో ఆ జట్టు టాప్–4లో నిలబడకపోవడం ఇదే మొదటిసారి. లీగ్ ఆరంభానికి ముందే వ్యక్తిగత కారణాలతో రైనా, హర్భజన్ తప్పుకున్నా వారి స్థానంలో మరెవరినీ తీసుకోకపోవడం... రెండో అర్ధభాగానికి వచ్చేసరికి సత్తువ సన్నగిల్లడంతో వరుస పరాజయాలు తప్పలేదు. మిడిలార్డర్లో ధోని, జాదవ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... చెన్నై పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టులోకి తీసుకున్న స్పిన్నర్లు యూఏఈకి వచ్చేసరికి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. సాక్షి క్రీడావిభాగం: -
‘ఎసెక్స్’ విజయంలో వివాదం
లండన్: ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో తొలిసారి నిర్వహించిన ‘బాబ్ విల్లీస్ ట్రోఫీ’ని గెలుచుకున్న ఎసెక్స్ జట్టు సంబరాల్లో చిన్న అపశ్రుతి దొర్లింది. సోమర్‌సెట్‌తో జరిగిన ఫైనల్ ఆదివారం ‘డ్రా’గా ముగియగా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఎసెక్స్ చాంపియన్‌గా నిలిచింది. అయితే లార్డ్స్ మైదానం బాల్కనీలో జరిగిన సంబరాల్లో ఎసెక్స్ యువ ఆటగాడు ఒకడు అత్యుత్సాహంతో తన జట్టు సహచరుడు ఫెరోజ్ ఖుషీపై బీర్ పోశాడు. ఇది వివాదానికి దారి తీసింది. ఇంగ్లండ్ క్రికెట్లో ముస్లిం క్రికెటర్లతో గెలుపు వేడుకలు చేసుకునే సమయంలో ఇతర ఆటగాళ్లు సాధారణంగా మద్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. జాతీయ జట్టు సభ్యులైన మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌లను కూడా తమ విజయంలో భాగంగా చేసి సంబరాల సమయంలో వారిపై షాంపేన్ చల్లకుండా ఉండే రివాజును ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్ చాలా కాలంగా పాటిస్తోంది. తాజా ఘటనపై కూడా ఎసెక్స్ కౌంటీ జట్టు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరింది. క్రికెట్లో ‘భిన్నత్వంలో ఏకత్వం’ను తాము గౌరవిస్తామని, తమ జట్టులో కూడా మతం, జాతి భేదాలు లేకుండా ఆటగాళ్లు ఉన్నారని వెల్లడించింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, యువ ఆటగాళ్లకు ఈ విషయంలో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపడతామని పేర్కొంది. కుర్రాళ్లు తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారని, చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని ఎసెక్స్ స్పష్టం చేసింది. తాజా సీజన్లోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టిన 21 ఏళ్ల ఫెరోజ్ ఖుషీ ఎసెక్స్ తరఫున 4 మ్యాచ్‌లు ఆడాడు. -
నన్ను ఒసామా అని పిలిచాడు: క్రికెటర్
మెల్బోర్న్: తనపై ఆస్ట్రేలియా క్రికెటర్ ఒకరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఆరోపించాడు. 2015 యాషెస్ సిరీస్ సందర్భంగా కార్డిఫ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఆటగాడు తనను ఉద్దేశించి ‘ఒసామా’ అని సంబోధించాడని పేర్కొన్నాడు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథలో అలీ ఈ విషయాన్ని రాసుకొచ్చాడు. ‘యాషెస్‌లో నాకు అదే తొలి టెస్టు. నా ప్రదర్శన (77 పరుగులు, ఐదు వికెట్లు)ను గొప్పగా భావిస్తున్నా. అదే సమయంలో మైదానంలో ఓ ఘటన కలచి వేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఒకరు నావైపు తిరిగి ‘టేక్ దట్, ఒసామా’ అని వ్యాఖ్యానించాడు. ఆ క్షణంలో నిజమేనా? అని ఆశ్చర్యపోయా. తర్వాత అర్థమైంది. నేనైతే గ్రౌండ్లో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు’ అని అలీ అన్నాడు. ‘ఇంగ్లండ్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు విషయం చెప్పా. వారు మా కోచ్ ట్రెవర్ బేలిస్‌కు చేరవేశారు. ఆయన ఆసీస్ కోచ్ డారెన్ లీమన్‌తో మాట్లాడాడు. లీమన్ ఆ ఆటగాడిని పిలిచి ప్రశ్నించగా... అతడు ఖండించాడు. ‘టేక్ దట్ యు పార్ట్ టైమర్’ అని మాత్రమే అన్నట్లు చెప్పాడు. సిరీస్ ముగిశాక కూడా ఆ ఆటగాడు తప్పును ఒప్పుకోలేదు’ అని అలీ వివరించాడు. ఈ వ్యాఖ్యల కారణంగా మిగతా మ్యాచ్ మొత్తం తాను ఆగ్రహంగా ఆడానని పేర్కొన్నాడు. మరోవైపు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికార ప్రతినిధి తెలిపారు. ఇలాంటి ప్రవర్తనను సహించమని, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి పూర్తి వివరాలు తెప్పించుకుని విచారణ చేపడతామని స్పష్టం చేశారు. -
ఆ ఇద్దరి వల్లే ఓడిపోయాం: కోహ్లి
లార్డ్స్ : నేలకు కొట్టిన బంతిలా ఇంగ్లండ్ దూసుకురావడంతో భారత జైత్రయాత్రకు బ్రేక్‌పడింది. శనివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లిసేన 86 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి ఇంగ్లండ్ స్పిన్నర్సే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్‌లో మా ఆరంభం అదిరింది. కానీ వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో నష్టం కలిగింది. ఈ క్రెడిట్ అంతా బౌలర్లదే. ముఖ్యంగా మోయిన్ అలీ, రషీద్‌లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఫార్మాట్లో వారు నాణ్యమైన బౌలర్లు. అందుకే రిస్క్ చేయలేకపోయాం. మిడిల్ ఓవర్లలో వారిద్దరు మాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు విఫలమైనా దాటిగా ఆడేవాళ్లం. అప్పుడు ఫలితం వేరేలా ఉండేది. మేం ప్రస్తుతం కొత్త ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు ఎలా పుంజుకుంటారనేది చాలా ముఖ్యం. అందరికి చెడు రోజులుంటాయి. ఇలా ఈ రోజు మాకు బ్యాడ్ డేగా మిగిలిపోయింది.’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. మోయిన్ అలీ, రషీద్‌లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్‌మన్ ఒత్తిడికి లోనై వికెట్లు చేజార్చుకున్నారు. రషీద్ రెండు వికెట్లు తీయగా మోయిన్ అలీ కీలక కోహ్లి వికెట్ పడగొట్టాడు. జో రూట్ (116 బంతుల్లో 113; 8 ఫోర్లు, 1 సిక్స్) మోర్గాన్ (51 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్), విల్లే (31 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో ఇంగ్లండ్ 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యఛేదనలో భారత్ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. కోహ్లి (56 బంతుల్లో 45; 2 ఫోర్లు), రైనా (63 బంతుల్లో 46; 1 ఫోర్), ధోని (59 బంతుల్లో 37; 2 ఫోర్లు)లు పరువు నిలిపె స్కోరు చేశారు. -
అలీ ఆదుకున్నాడు
తొలి రోజు ఇంగ్లండ్ 284/4 మొయిన్ అలీ సెంచరీ రాణించిన రూట్ భారత్‌తో చివరి టెస్టు పరుగుల ఖాతా తెరకుండానే క్యాచ్ మిస్... రెండు సార్లు కూడా అనుకూలంగా వచ్చిన రివ్యూలు... మొయిన్ అలీ ఆటకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి బౌండరీ కొట్టేందుకు 49 బంతులు తీసుకున్నా, ఆ తర్వాత నిలదొక్కుకొని ఎదురుదాడికి దిగిన అతను కెరీర్లో ఐదో సెంచరీతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మరోవైపు భారత్‌పై అద్భుత రికార్డును కొనసాగిస్తూ జో రూట్ కీలక ఇన్నింగ్స్ ఆడి అలీకి అండగా నిలిచాడు. 21/2 స్కోరుతో జట్టు క్లిష్ట స్థితిలో ఉన్న సమయంలో జత కలిసిన వీరిద్దరి భారీ భాగస్వామ్యం కారణంగా చెపాక్‌లో తొలి రోజును ఇంగ్లండ్ సంతృప్తిగా ముగించింది. మూడు వికెట్లతో జడేజా ముందు నిలవగా, అరుదైన రీతిలో అశ్విన్‌కు ఒక్క వికెట్టూ దక్కలేదు. అయితే ముంబైలో కూడా మొదటి రోజు దాదాపు ఇన్నే పరుగులు చేసిన ఇంగ్లండ్, ఈ సారైనా మరింత భారీ స్కోరు సాధించి సురక్షిత స్థితికి చేరుతుందా అనేది చూడాలి. చెన్నై: టెస్టు సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు పరువు కాపాడుకునే ప్రయత్నంలో చివరి మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ఆరంభం లభించింది. నెమ్మదైన పిచ్‌పై జాగ్రత్తగా, ఒత్తిడి లేకుండా ఆడిన ఆ జట్టు మొదటి రోజు మెరుగైన ఆటను ప్రదర్శించింది. భారత్‌తో ప్రారంభమైన ఐదో టెస్టులో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొయిన్ అలీ (222 బంతుల్లో 120 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా, జో రూట్ (144 బంతుల్లో 88; 10 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 146 పరుగులు జోడించారు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో (90 బంతుల్లో 49; 3 సిక్సర్లు)తో కలిసి అలీ నాలుగో వికెట్‌కు 86 పరుగులు జత చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో అలీతో పాటు స్టోక్స్ (5 బ్యాటింగ్) ఉన్నాడు. కోహ్లి ఇచ్చిన 5 పరుగులు ఇటీవలే న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన టెస్టులో జడేజా పిచ్‌పై పరుగెత్తిన కారణంగా భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగుల శిక్ష వేయడం గుర్తుందా... ఇప్పుడు కూడా భారత్ మరోసారి పెనాల్టీగా ఐదు పరుగులను ప్రత్యర్థికి అందించింది. అయితే ఈసారి కెప్టెన్ కోహ్లి వంతు! ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 25వ ఓవర్లో అశ్విన్ వేసిన బంతి రూట్ బ్యాట్‌కు తగిలి ఫైన్‌లెగ్ దిశగా వెళ్లింది. స్లిప్స్ నుంచి పరుగెత్తుకు వెళ్లి బంతిని ఆపిన కోహ్లి, దానిని కీపర్ పార్థివ్ వైపు విసిరాడు. అయితే పార్థివ్ దానిని అందుకునే ముందే అక్కడ పెట్టి ఉన్న హెల్మెట్‌కు బంతి తగిలింది. ఫీల్డింగ్ జట్టు ఉపకరణం బంతిని అడ్డుకున్న కారణంగా నిబంధనల ప్రకారం అంపైర్లు ఐదు పెనాల్టీ పరుగులు ఇంగ్లండ్ స్కోరులో చేర్చారు. తాను విసిరిన త్రో దిశ మార్చుకోవడాన్ని చూస్తూ కోహ్లి చిరునవ్వులు చిందించడం కనిపించింది! 10 టెస్టుల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న పదో ఆటగాడు కుక్. మిగతావారందరికంటే చిన్న వయసులో (31 ఏళ్ల 357 రోజులు), అతి తక్కువ సమయంలో (10 ఏళ్ల 290 రోజులు) అతను ఈ ఘనత సాధించాడు. 11 భారత్‌పై ఆడిన 11 టెస్టుల్లో రూట్ 11 సార్లు కనీసం 50కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ 11 టెస్టుల్లోనూ ఏదో ఒక ఇన్నింగ్స్‌లో అతను కనీసం అర్ధ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌పై బ్రాడ్‌మన్ (14లో 14) తర్వాత రూట్‌దే ఈ ఘనత. రివ్యూ కాని రివ్యూ తొలి రోజు ఆటలో రూట్ అవుట్ మినహా మిగతా రివ్యూలన్నీ భారత్‌కు వ్యతిరేకంగానే వచ్చాయి. అయితే జడేజా వేసిన తొలి ఓవర్లో ఆసక్తికర సంఘటన జరిగింది. మూడో బంతి కుక్ ప్యాడ్లకు తగలడంతో జడేజా గట్టిగా అప్పీల్ చేయగా, ఎరాస్మస్ నాటౌట్‌గా ప్రకటించారు. దాంతో జడేజాతో తీవ్ర చర్చోపచర్చల అనంతరం కోహ్లి దానిని ‘రివ్యూ’ కోరాడు. అయితే అప్పటికే 15 సెకన్ల సమయం మించిపోయిందంటూ అంపైర్లు దానిని తిరస్కరించారు. కానీ తర్వాత చూసిన రీప్లేలో బంతి వికెట్లకు దూరంగా పోతున్నట్లు తేలింది. రివ్యూలో అది ఎలాగూ నాటౌట్‌గానే తేలేది. దాంతో ఆలస్యమే కలిసొచ్చినట్లయి ఒక రివ్యూ వృథా కాకుండా ఆగిపోయింది. సెషన్–1: ఓపెనర్లు విఫలం గత టెస్టులో సెంచరీ చేసిన జయంత్ కండరాల నొప్పితో బాధపడుతుండటంతో అతని స్థానంలో అమిత్ మిశ్రాకు అవకాశం కల్పించగా, భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులోకి వచ్చాడు. మరో వైపు ఇంగ్లండ్ జట్టులో బ్రాడ్ తిరిగి రాగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్ ఈ టెస్టుతో అరంగేట్రం చేశాడు. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే రెండు పరుగులు తీసి కుక్ టెస్టుల్లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే పిచ్‌పై ఉన్న తేమను ఉపయోగించుకున్న ఇషాంత్, ఇంగ్లండ్‌ను ఆరంభంలోనే దెబ్బ తీశాడు. అతని మూడో ఓవర్లో జెన్నింగ్స్ (1) వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికే జడేజా బౌలింగ్‌లో కోహ్లి స్లిప్‌లో చక్కటి క్యాచ్ పట్టడంతో కుక్ (10) పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో జడేజా బౌలింగ్‌లో ఐదోసారి కుక్ అవుట్ కావడం విశేషం. ఈ దశలో రూట్, అలీ కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. రూట్ ధాటిగా ఆడగా, అలీ నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నాడు. సున్నా వద్ద అలీ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ వదిలేయడం ఆ జట్టుకు మేలు చేసింది. ఓవర్లు: 29, పరుగులు: 68, వికెట్లు: 2 సెషన్–2: భారీ భాగస్వామ్యం లంచ్ తర్వాత రూట్, అలీ జోరును పెంచారు. అలీ కొన్ని చక్కటి షాట్లు ఆడగా, మరోవైపు జడేజా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రూట్ 91 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు జడేజా బౌలింగ్‌లో అలీ అవుట్ కోసం ఎల్బీ అప్పీల్ అనంతరం భారత్ రివ్యూ చేసినా నిర్ణయం ప్రతికూలంగా వచ్చింది. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఈ ఇద్దరూ చక్కటి సమన్వయంతో చకచకా పరుగులు జోడించారు. 111 బంతుల్లో అలీ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు జడేజా ఈ భాగస్వామ్యానికి తెర దించాడు. అతని బౌలింగ్‌లో స్వీప్ చేయబోయిన రూట్ కీపర్ పార్థివ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే అంపైర్ ఎరాస్మస్ నాటౌట్‌గా ప్రకటించిన తర్వాత తీవ్రంగా ఆలోచించి చివరకు కోహ్లి రివ్యూకు వెళ్లాడు. సుదీర్ఘ సమయం పాటు రీప్లేలు చూసిన అనంతరం ‘అల్ట్రా ఎడ్జ్’లో బంతి బ్యాట్ దిగువ భాగంలో తాకినట్లు గుర్తించిన థర్డ్ అంపైర్ రూట్‌ను అవుట్‌గా ఖరారు చేశాడు. దాంతో తీవ్ర అసంతృప్తితో అతను వెనుదిరిగాడు. ఓవర్లు: 31, పరుగులు: 114, వికెట్లు: 1 సెషన్–3: అలీ శతకం విరామం తర్వాత మరో కీలక భాగస్వామ్యంతో ఇంగ్లండ్ మెరుగైన స్థితికి చేరింది. ఈ సెషన్లో అలీకి బెయిర్‌స్టో అండగా నిలిచాడు. అశ్విన్, జడేజా వేసిన వరుస ఓవర్లలో ఒక్కో సిక్సర్ బాది బెయిర్‌స్టో దూకుడు ప్రదర్శించాడు. మిశ్రా బౌలింగ్‌లో అలీ అవుట్ కోసం చేసిన మరో రివ్యూ కూడా వృథా అయింది. అయితే బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా ఆడిన షాట్ భారత్‌కు ఈ సెషన్లో వికెట్ అందించింది. జడేజా బౌలింగ్‌లో డ్రైవ్ చేయబోయిన అతను, కవర్స్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం మిశ్రా బౌలింగ్‌లో పాయింట్ దిశగా సింగిల్ తీసి అలీ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 86వ ఓవర్లో భారత్ కొత్త బంతిని తీసుకున్న వెంటనే ఇషాంత్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అలీ, స్టోక్స్‌తో కలిసి ప్రమాదం లేకుండా రోజును ముగించాడు. ఓవర్లు: 30, పరుగులు: 102, వికెట్లు: 1 -
తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు
-
శతక్కొట్టారు
తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు స్టోక్స్, మొయిన్ సెంచరీలు ధీటుగా స్పందించిన భారత ఓపెనర్లు ఒకరిని మించి మరొకరు... రూట్ చూపించిన దారిలో మొరుున్ అలీ, స్టోక్స్ కూడా చెలరేగిపోయారు. అద్భుతమైన నిలకడతో సెంచరీలు చేశారు. భారత గడ్డపై బ్యాటింగ్ చేయడం ఇంత సులభమా అని మిగిలిన జట్లు అసూయ పడేలా ఇంగ్లండ్ పరుగుల వర్షం కురిపించింది. ఫలితంగా భారత్‌తో తొలి టెస్టులో భారీస్కోరుతో ఇంగ్లండ్ బలమైన స్థితికి చేరింది. తొలి రోజు మూడు క్యాచ్‌లు వదిలేసినా రెండో రోజూ భారత జట్టు తప్పులు దిద్దుకోలేదు. మరో రెండు క్యాచ్‌లు వదిలేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ నత్తల్లా కదిలారు. ఒక్క పరుగు వచ్చే చోట మనోళ్లు రెండేసి ఇచ్చేశారు. ఫలితంగా కోహ్లి కెప్టెన్ అయ్యాక స్వదేశంలో భారత్ తొలిసారి ఆత్మరక్షణలో పడింది. మన ఓపెనర్లు ఆచితూచి ఆడి వికెట్ పడకుండా ఓ సెషన్‌తో ధీటుగా స్పందించినా... పిచ్‌పై అప్పుడే టర్న్ మొదలైంది. ఇక మూడో రోజు భారత బ్యాట్స్‌మెన్ ఏం చేస్తారనే అంశంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. రాజ్‌కోట్: భారత గడ్డపై తమ రికార్డులు తామే అందుకుంటూ ఇంగ్లండ్ జట్టు దూసుకుపోతోంది. నాలుగేళ్ల క్రితం కోల్‌కతా టెస్టులో 500 పైచిలుకు పరుగులు చేసిన ఇంగ్లండ్... మరోసారి సులభంగా ఐదొందలు చేసింది. ఈ మధ్య కాలంలో మరే జట్లూ భారత్‌పై భారత్‌లో ఐదొందలు చేయలేదు. స్టోక్స్ (235 బంతుల్లో 128; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ తో సెంచరీ చేయగా... ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీ (213 బంతుల్లో 117; 13 ఫోర్లు) కూడా సెంచరీ చేశాడు. తొలి రోజు రూట్ కూడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురి శతకాలతో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీస్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో కుక్‌సేన 159.3 ఓవర్లలో 537 పరుగులు చేసి ఆలౌటరుుంది. బెరుుర్‌స్టో (57 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడగా... టెరుులెండర్ అన్సారీ (83 బంతుల్లో 32; 3 ఫోర్లు) కూడా ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా... షమీ, ఉమేశ్, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. గంభీర్ (68 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు), విజయ్ (70 బంతుల్లో 25 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు వెనకబడి ఉంది. సెషన్ 1: వేగంగా పరుగులు కొత్త బంతి తీసుకుని భారత్ రోజును ప్రారంభించగా... ఆడిన మూడో బంతిని సింగిల్ తీసి మొరుున్ అలీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత అలీ ఒక్కసారిగా వేగం పెంచి ఉమేశ్ వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. రెండో ఎండ్‌లో స్టోక్స్ జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతుల్ని వదలకుండా బౌండరీకి పంపాడు. షమీ ఓ చక్కటి బంతితో మొరుున్ను అట్ చేశాడు. స్టోక్స్, మొరుున్ ఐదో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. బెరుుర్‌స్టో ఆరంభంలో నెమ్మదిగా ఆడి కుదురుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మిశ్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స వేగం పెంచాడు. మరో ఎండ్‌లో స్టోక్స్ 89 బంతుల్లో అర్ధసెంచరీ మార్కును చేరుకున్నాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఉమేశ్ బౌలింగ్‌లో స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ సాహా వదిలేశాడు. ఉమేశ్ తర్వాతి ఓవర్లోనూ స్టోక్స్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను సాహా మరోసారి జారవిడిచాడు. బెరుుర్‌స్టో మరో సిక్సర్‌తో పాటు చకచకా బౌండరీలతో దూసుకుపోతున్న సమయంలో షమీ ఈ జోరుకు బ్రేక్ వేశాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి బెరుుర్‌స్టో వెనుదిరిగాడు. స్టోక్స్, బెరుుర్‌స్టో ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఈ సెషన్లో నాలుగుకు పైగా రన్‌రేట్‌తో ఇంగ్లండ్ వేగంగా పరుగులు చేసింది. ఓవర్లు: 30 పరుగులు: 139 వికెట్లు: 2 సెషన్ 2: ఎట్టకేలకు ఆలౌట్ లంచ్ తర్వాత తొలి ఓవర్లోనే జడేజా బౌలింగ్‌లో వోక్స్ అవుటయ్యాడు. అదే జోరులో జడేజా... రషీద్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. అరుుతే ఈ దశలో స్టోక్స్‌కు స్పిన్నర్ అన్సారీ అండగా నిలిచాడు. జడేజా బౌలింగ్‌లో బౌండరీతో స్టోక్స్ 173 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్లో ఇది తనకు నాలుగో సెంచరీ. అన్సారీ నెమ్మదిగా ఆడినా స్టోక్స్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యంలో భాగమయ్యాడు. ఉమేశ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇవ్వడం ద్వారా స్టోక్స్ వెనుదిరిగాడు. దీంతో విరామం ఇవ్వకుండా కొంతసేపు సెషన్‌ను పొడిగించారు. ఆ తర్వాత కొద్దిసేపు భారత బౌలర్ల ఓపికను పరీక్షించిన అన్సారీ... చివరకు మిశ్రా బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు. ఈ సెషన్లో పరుగులు చాలా నెమ్మదించారుు. ఓవర్లు: 36.3 పరుగులు: 87 వికెట్లు: 4 సెషన్ 3: ఓపెనర్ల జాగ్రత్త ప్రత్యర్థి భారీ స్కోరు చేయడంతో భారత ఓపెనర్లు గంభీర్, విజయ్ కూడా జాగ్రత్తగా ఇన్నింగ్‌సను మొదలుపెట్టారు. ఇద్దరూ ఆరంభంలో చెరో బౌండరీ కొట్టినా... ఆ తర్వాత జోరు తగ్గింది. ముఖ్యంగా స్పిన్నర్లు బౌలింగ్‌కు వచ్చాక బౌండరీలు రావడం కష్టమరుుంది. చివర్లో కాస్త టర్న్ కనిపించినా... బ్యాటింగ్ చేయడం కష్టంగా మాత్రం లేదు. అరుుతే వికెట్ పడకుండా రోజును ముగించాలనే లక్ష్యంతో భారత ఓపెనర్లు ఆడినట్లు కనిపించారు. ఓవర్లు: 23 పరుగులు: 63 వికెట్లు: 0 ‘కొన్నిసార్లు క్యాచ్‌లు జారిపోతుంటారుు. అది ఆటలో భాగంగా చూడాలి. ఇది అందరి వైఫల్యం. దీనికి అశ్విన్ ఒక్కడినే బాధ్యుడిని చేయకూడదు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం దురదృష్టం. మూడో రోజు నుంచి స్పిన్నర్లకు పిచ్ సహకారం లభిస్తుందని అనుకుంటున్నా. మేం ఆశావహ దృక్పథంతో ఆడతాం’ - రవీంద్ర జడేజా ► 4 భారత గడ్డపై 1990 తర్వాత ఒక విదేశీ జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి. 2002లో వెస్టిండీస్, 2003లో న్యూజిలాండ్, 2009లో శ్రీలంక మాత్రమే ఈ ఘనత సాధించారుు. ► 5 ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ముగ్గురు ఒకే ఇన్నింగ్సలో సెంచరీ చేసి ఐదేళ్లరుుంది. చివరిసారిగా స్వదేశంలో శ్రీలంకపై 2011లో ఈ ఘనత సాధించారు. ► 31 భారత్‌లో ఇంగ్లండ్‌కు గత 31 సంవత్సరాలలో ఇదే అత్యధిక స్కోరు. 1985లో ఆ జట్టు చెన్నైలో జరిగిన టెస్టులో ఏడు వికెట్లకు 652 పరుగులు చేసింది. -
తడబడిన శ్రీలంక
తొలి ఇన్నింగ్స్‌లో 91/8 ఇంగ్లండ్ 498/9 డిక్లేర్ చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ శ్రీలంక ఆటతీరులో మార్పు కనిపించడం లేదు. తొలి టెస్టు మాదిరే ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి లంక బ్యాట్స్‌మెన్ పరుగులు తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 8 వికెట్లకు 91 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (62 బంతుల్లో 35; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. పేసర్ క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్ మూడేసి వికెట్లు తీసి లంకను కట్టడి చేశారు. అండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 132 ఓవర్లలో 498/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మొయిన్ అలీ (207 బంతుల్లో 155 నాటౌట్; 17 ఫోర్లు; 2 సిక్సర్లు) ధాటిగా ఆడి అజేయ శతకం సాధించాడు. -
చెమటోడ్చిన ఇంగ్లండ్
అఫ్ఘానిస్తాన్‌పై 15 పరుగుల విజయం న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా... బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆకట్టుకున్న ఇంగ్లండ్ జట్టు... టి20 ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్తాన్‌పై చెమటోడ్చి నెగ్గింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మోర్గాన్ బృందం 15 పరుగుల తేడాతో అఫ్ఘానిస్తాన్‌పై విజయం సాధించింది. ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. ఓపెనర్లలో విన్సీ (18 బంతుల్లో 22; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడగా.. చివర్లో మొయిన్ అలీ (33 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), విల్లీ (17 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్సర్లు) చెలరేగారు. 85 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఈ ఇద్దరు 8వ వికెట్‌కు 5.3 ఓవర్లలో 57 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. నబీ, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన అఫ్ఘానిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసి ఓడింది. ఇంగ్లిష్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో అఫ్ఘాన్‌కు సరైన శుభారంభం లభించలేదు. దీంతో 39 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. ఆ తర్వాత షఫీకుల్లా (20 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సమీయుల్లా (27 బంతుల్లో 22; 1 ఫోర్) కాస్త మెరుగ్గా ఆడినా.. రెండో ఎండ్‌లో సహచరులు ఒత్తిడికి గురయ్యారు. దీంతో అఫ్ఘాన్ ఏ దశలోనూ లక్ష్యానికి చేరువకాలేకపోయింది. విల్లీ, రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మొయిన్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) అమిర్ (బి) హమ్జా 5; విన్సీ (సి అండ్ బి) నబీ 22; రూట్ రనౌట్ 12; మోర్గాన్ (బి) నబీ 0; స్టోక్స్ (బి) రషీద్ 7; బట్లర్ (సి) నబీ (బి) షెన్వారి 6; అలీ నాటౌట్ 41; జోర్డాన్ (సి అండ్ బి) రషీద్ 15; విల్లీ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-16; 2-42; 3-42; 4-42; 5-50; 6-57; 7-85 బౌలింగ్: అమిర్ హమ్జా 4-0-45-1; షాపూర్ జద్రాన్ 4-0-34-0; మహ్మద్ నబీ 4-0-17-2; సమీయుల్లా షెన్వారి 4-0-23-1; రషీద్ 4-0-17-2. అఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్: షెహ్జాద్ ఎల్బీడబ్ల్యు (బి) విల్లీ 4; నూర్ అలీ (సి అండ్ బి) రషీద్ 17; అస్గర్ (సి) రూట్ (బి) జోర్డాన్ 1; గుల్బాదిన్ నబీ (సి) స్టోక్స్ (బి) విల్లీ 0; రషీద్ (సి) మోర్గాన్ (బి) అలీ 15; నబీ (సి) జోర్డాన్ (బి) రషీద్ 12; షెన్వారి (సి) రూట్ (బి) స్టోక్స్ 22; నజీబుల్లా రనౌట్ 14; షఫీకుల్లా నాటౌట్ 35; అమిర్ రనౌట్ 1; షాపూర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1-4; 2-12; 3-13; 4-35; 5-39; 6-64; 7-85; 8-94; 9-108. బౌలింగ్: విల్లీ 4-0-23-2; జోర్డాన్ 4-0-27-1; ఫ్లంకెట్ 4-1-12-0; అలీ 2-0-17-1; రషీద్ 3-0-18-2; స్టోక్స్ 3-0-28-1. -
మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం
మాంచెస్టర్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ కోలుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌లో కంగారూల ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. జేమ్స్ టేలర్ (114 బంతుల్లో 101; 5 ఫోర్లు) వన్డేల్లో తొలి సెంచరీ సాధించగా, రాయ్ (45 బంతుల్లో 63; 9 ఫోర్లు), మోర్గాన్ (56 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. కమిన్స్, మ్యాక్స్‌వెల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. ఫించ్ (60 బంతుల్లో 53; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, వేడ్ (41 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్లు మొయిన్ అలీ (3/32), ఆదిల్ రషీద్ (2/41) కీలక వికెట్లు తీశారు. నాలుగో వన్డే శుక్రవారం లీడ్స్‌లో జరుగుతుంది. -
మోయిన్ అలీకి ఐసీసీ వార్నింగ్