
మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం
మాంచెస్టర్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ కోలుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌లో కంగారూల ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. జేమ్స్ టేలర్ (114 బంతుల్లో 101; 5 ఫోర్లు) వన్డేల్లో తొలి సెంచరీ సాధించగా, రాయ్ (45 బంతుల్లో 63; 9 ఫోర్లు), మోర్గాన్ (56 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు.
కమిన్స్, మ్యాక్స్‌వెల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. ఫించ్ (60 బంతుల్లో 53; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, వేడ్ (41 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్లు మొయిన్ అలీ (3/32), ఆదిల్ రషీద్ (2/41) కీలక వికెట్లు తీశారు. నాలుగో వన్డే శుక్రవారం లీడ్స్‌లో జరుగుతుంది.