Liam Guthrie BBL, 70 Runs In 4 Overs: బిగ్ బాష్ లీగ్-2021లో బ్రిస్బేన్ హీట్ బౌలర్ లియామ్ గుత్రీ ఓ చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. మెల్బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటాలో గుత్రీ ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన గుత్రీ 70 పరుగులతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు సిడ్నీ సిక్సర్స్ బౌలర్ బెన్ ద్వార్షుయిస్ 61 పరుగులు ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెల్బోర్న్ స్టార్స్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు.
అయితే ఓపెనర్ క్లార్క్, కార్ట్‌రైట్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. క్లార్క్ 44 బంతుల్లో 85 పరుగులు సాధించగా, కార్ట్‌రైట్ 44 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. దీంతో మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో స్టీక్టీ మూడు వికెట్లు పడగొట్టగా,గుత్రీ, బ్లేజీ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి బ్రిస్బేన్ హీట్ బ్యాటర్లలో క్రిస్ లిన్(57), బెన్ డకెట్(54) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో187 పరుగులకు ఆలౌటైంది. దీంతో 20 పరుగుల తేడాతో బ్రిస్బేన్ ఓటమి చెందింది. మెల్బోర్న్ బౌలర్లలో బ్రాడీ కౌచ్, కైస్ అహ్మద్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
చదవండి: SA Vs IND: కోహ్లి.. ఎలా ఆడాలో రాహుల్‌ని చూసి నేర్చుకో: భారత మాజీ క్రికెటర్
The Bucket Ball free-hit is sent straight back over Liam Guthrie's head 😳 @KFCAustralia | #BBL11 pic.twitter.com/ua4VNZG0DS
— KFC Big Bash League (@BBL) December 27, 2021
Comments
Please login to add a commentAdd a comment