
చెమటోడ్చిన ఇంగ్లండ్
అఫ్ఘానిస్తాన్‌పై 15 పరుగుల విజయం
న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా... బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆకట్టుకున్న ఇంగ్లండ్ జట్టు... టి20 ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్తాన్‌పై చెమటోడ్చి నెగ్గింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మోర్గాన్ బృందం 15 పరుగుల తేడాతో అఫ్ఘానిస్తాన్‌పై విజయం సాధించింది. ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. ఓపెనర్లలో విన్సీ (18 బంతుల్లో 22; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడగా.. చివర్లో మొయిన్ అలీ (33 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), విల్లీ (17 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్సర్లు) చెలరేగారు. 85 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఈ ఇద్దరు 8వ వికెట్‌కు 5.3 ఓవర్లలో 57 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. నబీ, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు.
లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన అఫ్ఘానిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసి ఓడింది. ఇంగ్లిష్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో అఫ్ఘాన్‌కు సరైన శుభారంభం లభించలేదు. దీంతో 39 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. ఆ తర్వాత షఫీకుల్లా (20 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సమీయుల్లా (27 బంతుల్లో 22; 1 ఫోర్) కాస్త మెరుగ్గా ఆడినా.. రెండో ఎండ్‌లో సహచరులు ఒత్తిడికి గురయ్యారు. దీంతో అఫ్ఘాన్ ఏ దశలోనూ లక్ష్యానికి చేరువకాలేకపోయింది. విల్లీ, రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మొయిన్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు: ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) అమిర్ (బి) హమ్జా 5; విన్సీ (సి అండ్ బి) నబీ 22; రూట్ రనౌట్ 12; మోర్గాన్ (బి) నబీ 0; స్టోక్స్ (బి) రషీద్ 7; బట్లర్ (సి) నబీ (బి) షెన్వారి 6; అలీ నాటౌట్ 41; జోర్డాన్ (సి అండ్ బి) రషీద్ 15; విల్లీ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-16; 2-42; 3-42; 4-42; 5-50; 6-57; 7-85
బౌలింగ్: అమిర్ హమ్జా 4-0-45-1; షాపూర్ జద్రాన్ 4-0-34-0; మహ్మద్ నబీ 4-0-17-2; సమీయుల్లా షెన్వారి 4-0-23-1; రషీద్ 4-0-17-2.
అఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్: షెహ్‌జాద్ ఎల్బీడబ్ల్యు (బి) విల్లీ 4; నూర్ అలీ (సి అండ్ బి) రషీద్ 17; అస్గర్ (సి) రూట్ (బి) జోర్డాన్ 1; గుల్బాదిన్ నబీ (సి) స్టోక్స్ (బి) విల్లీ 0; రషీద్ (సి) మోర్గాన్ (బి) అలీ 15; నబీ (సి) జోర్డాన్ (బి) రషీద్ 12; షెన్వారి (సి) రూట్ (బి) స్టోక్స్ 22; నజీబుల్లా రనౌట్ 14; షఫీకుల్లా నాటౌట్ 35; అమిర్ రనౌట్ 1; షాపూర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127.
వికెట్ల పతనం: 1-4; 2-12; 3-13; 4-35; 5-39; 6-64; 7-85; 8-94; 9-108. బౌలింగ్: విల్లీ 4-0-23-2; జోర్డాన్ 4-0-27-1; ఫ్లంకెట్ 4-1-12-0; అలీ 2-0-17-1; రషీద్ 3-0-18-2; స్టోక్స్ 3-0-28-1.