
విరాట్ కోహ్లి
లార్డ్స్ : నేలకు కొట్టిన బంతిలా ఇంగ్లండ్ దూసుకురావడంతో భారత జైత్రయాత్రకు బ్రేక్‌పడింది. శనివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లిసేన 86 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి ఇంగ్లండ్ స్పిన్నర్సే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్‌లో మా ఆరంభం అదిరింది. కానీ వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో నష్టం కలిగింది. ఈ క్రెడిట్ అంతా బౌలర్లదే. ముఖ్యంగా మోయిన్ అలీ, రషీద్‌లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఫార్మాట్‌లో వారు నాణ్యమైన బౌలర్లు. అందుకే రిస్క్ చేయలేకపోయాం. మిడిల్ ఓవర్లలో వారిద్దరు మాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు విఫలమైనా దాటిగా ఆడేవాళ్లం. అప్పుడు ఫలితం వేరేలా ఉండేది. మేం ప్రస్తుతం కొత్త ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు ఎలా పుంజుకుంటారనేది చాలా ముఖ్యం. అందరికి చెడు రోజులుంటాయి. ఇలా ఈ రోజు మాకు బ్యాడ్ డేగా మిగిలిపోయింది.’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. మోయిన్ అలీ, రషీద్‌లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్‌మన్ ఒత్తిడికి లోనై వికెట్లు చేజార్చుకున్నారు. రషీద్ రెండు వికెట్లు తీయగా మోయిన్ అలీ కీలక కోహ్లి వికెట్ పడగొట్టాడు.
జో రూట్ (116 బంతుల్లో 113; 8 ఫోర్లు, 1 సిక్స్) మోర్గాన్ (51 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్), విల్లే (31 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో ఇంగ్లండ్ 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యఛేదనలో భారత్ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. కోహ్లి (56 బంతుల్లో 45; 2 ఫోర్లు), రైనా (63 బంతుల్లో 46; 1 ఫోర్), ధోని (59 బంతుల్లో 37; 2 ఫోర్లు)లు పరువు నిలిపె స్కోరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment