
'అతని నుంచే టెక్నిక్స్ నేర్చుకున్నా'
విశాఖ:ఉప ఖండంలోని పిచ్ల్లో బౌలింగ్ ఎలా చేయాలో అనే దాని గురించి తనకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఎన్నో విషయాలు చెప్పినట్లు ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పష్టం చేశాడు. గతంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు జహీర్ను అడిగి ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నట్లు బ్రాడ్ తాజాగా పేర్కొన్నాడు.
'ఇప్పటికీ నాకు గుర్తుంది. నాలుగు సంవత్సరాల క్రితం భారత్ పర్యటనలో జహీర్ నుంచి బౌలింగ్ పాఠాలు నేర్చుకున్నా. ప్రధానంగా భారత తరహా పిచ్లపై బౌలింగ్ ఎలా చేస్తే ఫలితాన్ని సాధిస్తాం అనేది జహీర్ ను అడిగి తెలుసుకున్నా. నాతో పాటు అండర్సన్(జిమ్మీ)కూడా జహీర్ నుంచి టెక్నిక్స్ తెలుసుకున్నాడు. మనం ఇన్ స్వింగర్ వేసేటప్పుడు వేయే పద్ధతులు ఇక్కడ అవలంభించాలి అనేది జహీర్ ను అడిగాం. బ్యాట్స్మన్ ఊరించే విధంగా స్లో బంతిని సంధించి, అదే క్రమంలో ఇన్ స్వింగ్ రాబట్టడం గురించి జహీర్ నుంచి ట్రిక్స్ తెలుసుకున్నాం. భారత్ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా పూజారాను అండర్సన్ ఇదే తరహాలో బోల్తా కొట్టించాడు' అని బ్రాడ్ పేర్కొన్నాడు.