
లండన్: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చాంపియన్‌గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠం రేపిన తుది పోరులో ఇంగ్లండ్ బౌండరీల ఆధారంగా విశ్వ విజేత అయ్యింది. సూపర్ ఓవర్‌కు ముందు ఇంగ్లండ్ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్‌లో నాల్గో బంతి ఓవర్‌త్రో రూపంలో బౌండరీని దాటింది. ఆ బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి మరీ ‘ఫోర్’గా మల్లడంతో ఇంగ్లండ్‌కు మొత్తంగా ఆరు పరుగులు వచ్చాయి. దాంతోనే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.. లేకపోతే కివీసే కప్‌ను సాధించే అవకాశం ఉండేది.
ఇది పెద్ద చర్చకే దారి తీసినా యావత్ ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు, క్రికెటర్లకు కొత్త పండగనే తెచ్చింది. ఇంగ్లండ్ టెస్టు స్పెషలిస్టు బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయింది. మ్యాచ్‌ను నాటింగ్‌హామ్ షైర్ కౌంటీ జట్టు సభ్యులతో కలిస వీక్షిస్తున్న బ్రాడ్ ఉబ్బితబ్బి అయిపోయాడు. చిన్నపిల్లాడిలా ఎగిరి గంతులేస్తూ మురిసిపోయాడు. ఈ ఘటనను నాటింగ్‌హామ్ షైర్ సభ్యుడైన భారత క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ వీడియో తీశాడు. దీన్ని తన ట్వీటర్ పేజీలో పోస్ట్ చేసిన బ్రాడ్.. మ్యాచ్‌కు ఇదే అత్యంత కీలకమైన క్షణం అంటూ పేర్కొన్నాడు. ఆ ఓవర్ త్రో కారణంగా ఆరు పరుగులు రావడంతో ఎట్టకేలకు ఊపిరి తీసుకున్నాం. ఈ తరహా సందర్భాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని తెలిపాడు.
Videos of emotion from #CWC19Final, we all must have them?! @ashwinravi99 captured the @TrentBridge changing room when, at the most crucial point of the match, a 1 in a million deflection went for ‘6’. Breathtaking, never seen anything like it. I ♥️ Cricket @englandcricket pic.twitter.com/dYBetXKzyX
— Stuart Broad (@StuartBroad8) 15 July 2019
Comments
Please login to add a commentAdd a comment