చెన్నై: టీమిండియా జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా సుదీర్ఘ కాలం వెలుగొందిన ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్.. జాతీయ జట్టు తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి దాదాపు ఏడాది కావొస్తుంది. 2017, జూన్ 30వ తేదీని చివరిసారి వన్డేల్లో కనిపించిన అశ్విన్.. గతేడాది జూలై 9న ఆఖరిసారి అంతర్జాతీయ టీ 20లో కనిపించాడు. గత కొంతకాలంగా టీమిండియా జట్టులో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్‌లు కీలక పాత్రగా మారడంతో అశ్విన్‌కు చోటు దక‍్కడం గగనంగా మారింది.
దాంతో రాబోవు కాలంలో టీమిండియా తరపున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అశ్విన్ ఆడే అవకాశాలు సన్నగిల్లినట్లే కనబడుతున్నాయి. అయితే వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యమని అంటున్నాడు అశ్విన్. తాజాగా అశ్విన్ మాట్లాడుతూ.. ‘ వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా తరపున బ్లూ జెర‍్సీ ధరించడం కోసం ఎదురుచూస్తున్నా. కాకపోతే అది నా చేతుల్లో లేదు. నాకు స్థానం దక్కుతుందా..లేదా అనేది టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లపై ఆధారపడి వుంది. ఇక్కడ ఏ క్రికెటరైనా జట్టులో చోటు దక్కించుకోవాలంటే సెలక్టర్లు, మేనేజ్‌మెంట్‌దే నిర్ణయం. నేనేమీ మినహాయింపు కాదు. కాకపోతే వరల్డ్ కప్‌లో టీమిండియా తరపున ప్రాతినిథ్యం వహించాలని బలంగా కోరుకుంటున్నా. ఇప్పుడు నేను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదనే అనుకుంటున్నా. ప్రస్తుతం నాకు కఠిన పరిస్థితులు ఎదురవుతున్నా.. ఆటను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగడమే నా పని’ అని అశ్విన్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment