
క్లే కోర్టు సీజన్‌కు దూరంగా ఉన్న స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ వచ్చే నెలలో మళ్లీ కోర్టులోకి దిగనున్నాడు. జూన్‌లో స్టట్‌గార్ట్‌లో జరిగే మెర్సిడెస్ కప్ గ్రాస్ కోర్టు టోర్నీలో అతను ఆడతాడని ఏటీపీ ప్రకటించింది. ఫ్రెంచ్ ఓపెన్ సహా తనకు అచ్చి రాని క్లే కోర్టు టోర్నీల నుంచి తప్పుకోవడం, తను ఎంతో ఇష్టపడే గ్రాస్ పైనే మళ్లీ బరిలోకి దిగే విషయంలో సరిగ్గా 2017 తరహా ప్రణాళికలనే ఈ సారి కూడా ఫెడరర్ అమలు చేస్తున్నాడు. గత ఏడాది కూడా స్టట్‌గార్ట్‌తోనే మొదలు పెట్టి ఫెడెక్స్ అదే జోరులో తన ఎనిమిదో వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.