టెన్నిస్, క్రికెట్ అభిమానులకు మంగళవారం(జులై10) గుర్తుండిపోయే రోజు. క్రీడా అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఐసీసీ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ ట్వీట్ ఫన్నీగా ఉండటంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్‌లో అడ్రియన్ మనారినో(ఫ్రాన్స్)తో స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ తలపడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భాగంగా ఫెడరర్ డిఫెన్స్ షాట్‌ను సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను వింబుల్డన్ అధికారిక ట్విటర్‌లో రేటింగ్ ఇవ్వండంటూ ఐసీసీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
స్పందించిన ఐసీసీ.. ఫెడరర్ ఆడిన డిఫెన్స్ షాట్‌కు ఫిదా అయిన ఐసీసీ రీట్వీట్ చేసింది. టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అంటూ అభివర్ణించింది. అంతే కాకుండా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఫెడరర్‌ల స్పైడర్‌మ్యాన్ మెమె క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. దీంతో టెన్నిస్‌కు, వింబుల్డన్‌కు ఐసీసీ ఇచ్చిన గౌరవం పట్ల క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఫెడరర్ అభిమాని సచిన్ కూడా డిఫెన్స్ షాట్‌పై స్పందించాడు. తన అభిమాన ఆటగాడు తొమ్మిదో వింబుల్డన్ టైటిల్ గెలవాలని సచిన్ ఆకాంక్షించాడు.
*sigh* ok... 👇 pic.twitter.com/KXnhaznxL8
— ICC (@ICC) July 9, 2018
When greatness recognises greatness 👌 pic.twitter.com/UB2hJli5gw
— ICC (@ICC) July 9, 2018
As always, great hand-eye co-ordination. @rogerfederer, let’s exchange notes on cricket and tennis after you win your 9th @Wimbledon title 😜👍 https://t.co/2TNUHGn1zK
— Sachin Tendulkar (@sachin_rt) July 10, 2018
Comments
Please login to add a commentAdd a comment