హవ్వా.. అనుష్కా లెజెండా? | Australian Open Trolled Over Federer and Virushka Photo Caption | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 19 2019 7:04 PM | Last Updated on Sat, Jan 19 2019 7:04 PM

Australian Open Trolled Over Federer and Virushka Photo Caption - Sakshi

విరాట్‌ కోహ్లి

మెల్‌బోర్న్‌ : బాలీవుడ్‌ నటి, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్కశర్మపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్‌ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ ఫోటోనే ఈ ట్రోలింగ్‌కు కారణమైంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఆసీస్‌ పర్యటనను ఘనంగా ముగించిన భారత ఆటగాళ్లు ఈ విన్నింగ్‌ మూమెంట్‌ను అక్కడే గడుపుతూ ఆస్వాదిస్తున్నారు. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన సతీమణి అనుష్కతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు.

శనివారం ఆస్ట్రేలియా ఓపెన్‌ జరుగుతున్న మెల్‌బోర్న్‌ పార్క్‌ను విరుష్కా సందర్శించింది. ఈ సందర్భంగా ఈ జోడి టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ను కలిసి ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ ఫొటోను యూఎస్‌ ఓపెన్‌ ‘ముగ్గురు దిగ్గజాలు.. ఒక్క ఫొటో’  అనే క్యాఫ్షన్‌తో ట్వీట్‌ చేసింది. ఇది చూసిన అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముంది సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు అనుష్కను ఓ ఆట ఆడుకున్నారు. ‘కోహ్లి, ఫెడరర్‌ సరసన ఉన్న అనుష్క దిగ్గజమా? మీరే చెప్పాలి.. కోహ్లి, ఫెడరర్‌!’ అంటూ ఒకరు, ‘ఓహో.. ఫెడరర్‌ను కలిస్తే లెజెండ్‌ అవుతామన్నమాట! అయితే నేను కూడా కలుస్తా!’ అని మరొకరు సెటైరిక్‌గా కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొందరైతే యూఎస్‌ ఓపెన్‌ అధికారులకు మతి దొబ్బినట్టుంది.. లేకుంటే అనుష్క లేజెండ్‌ ఏంటని ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement