![Federer hopes to live - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/15/fddddd.jpg.webp?itok=BvtUrvgD)
ఫెడరర్ ఆశలు సజీవం
లండన్: టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొలి విజయం సాధించాడు. ‘హెవిట్ గ్రూప్’ లో భాగంగా డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఫెడ రర్ 6–2, 6–3తో గెలుపొందాడు. గురువారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో నిషికోరి (జపాన్)పై థీమ్ గెలిచి... అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై ఫెడరర్ విజయం సాధిస్తే స్విట్జర్లాండ్ స్టార్ ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీఫైనల్ చేరుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment