world tour finals
-
వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు సింధు దూరం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో చైనాలో జరిగే బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ టూర్ ఫైనల్స్’ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వైదొలిగింది. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం వల్లే టోర్నీకి దూరమవుతున్నట్లు ఆమె తెలిపింది. ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె గాయపడింది. ‘మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అప్పుడే కొత్త సీజన్‌ను పూర్తి ఫిట్నెస్తో, ఉత్సాహంతో ప్రారంభించవచ్చని చెప్పారు. అందువల్లే టోర్నీ నుంచి సింధు వైదొలగాలని నిర్ణయించుకుంది’ అని ఆమె తండ్రి రమణ వెల్లడించారు. -
BWF World Tour Final: ఫైనల్లో ఓడిన పీవీ సింధు..
PV Sindhu Loses Women Singles Title Clash BWF World Tour Finals: ముగింపు టోర్నీ వరల్డ్‌టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి చెందింది. సౌత్ కొరియాకు చెందిన యాన్ సియాంగ్ చేతిలో 21-16,21-12 తేడాతో ఓటమి పాలైంది. సింధు మొదటి గేమ్‌ను 16-21 కోల్పోయింది. సింధు మొదటి గేమ్ చివరి దశలలో పోరాడినప్పటికీ, దక్షిణ కొరియా స్టార్ యాన్ సియాంగ్ అవకాశం ఇవ్వలేదు. ఇక రెండువ గేమ్‌లో సింధుకు సియాంగ్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కాగా ఫైనల్స్‌లో ఓడిన సింధు సిల్వర్ మెడల్ సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సింధు 21-15 15-21 21-19 తేడాతో జపాన్‌కు చెందిన అకానె యమగుచిని ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది. ముగింపు టోర్నీ వరల్డ్‌టూర్ టైటిల్‌ను చివరగా 2018లో కైవసం చేసుకుంది. చదవండి:Ind Vs Nz 2nd Test: ఫోర్ కొట్టిన గిల్.. సచిన్ అంటూ అరిచిన అభిమానులు.. ఎందుకంటే! -
PV Sindhu: అదరగొట్టిన సింధు.. ఫైనల్లో అడుగు
BWF World Tour Finals 2021: Sindhu Beats Yamaguchi to Enter Into the Final: సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్‌టూర్ ఫైనల్స్‌లో భాగంగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. మహిళల సింగిల్స్ గ్రూపు ఏలో సెమీ ఫైనల్ చేరిన ఆమె.. అకానె యమగూచి(జపాన్)ని ఓడించింది. తద్వారా ఫైనల్లో అడుగుపెట్టింది. డెబ్బై నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 21-15, 15-21, 21-19 తేడాతో యమగూచిపై విజయం సాధించింది. కాగా ఫైనల్లో సింధు... దక్షిణ కొరియా ప్లేయర్ సెయంగ్‌తో తలపడనుంది. ఇక ఈ టోర్నీలో మరో భారత ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ గ్రూప్-బి చివరి మ్యాచ్‌లో ఓటమి పాలై సెమీ ఫైనల్ కూడా చేరకుండానే నిష్క్రమించాడు. కాగా ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలిపింక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అంతకు ముందు విశ్వ క్రీడల్లో సిల్వర్ మెడల్ గెలిచిన ఈ వెండికొండ... ఏకంగా రెండు ఒలిపింక్ పతకాలు తన ఖాతాలో వేసుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది. -
BWF World Tour Finals 2021: సెమీ ఫైనల్లో సింధు
బాలి (ఇండోనేసియా): రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’లో గురువారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21–10, 21–13తో వైవోన్ లీ (జర్మనీ)పై అలవోక విజయాన్ని సాధించింది. దాంతో గ్రూప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సింధు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్‌కు అర్హత సాధించింది. గ్రూప్ టాపర్‌ని తేల్చే నేటి మ్యాచ్‌లో పొర్న్‌పవీ చొచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో గ్రూప్ ‘ఎ’ నుంచి ఇప్పటికే సెమీ ఫైనల్ చేరిన భారత షట్లర్ లక్ష్యసేన్‌కు విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి ఎదురైంది. గ్రూప్ విజేతను తేల్చే మ్యాచ్‌లో లక్ష్యసేన్ 15–21, 14–21తో అక్సెల్సన్ చేతిలో ఓడాడు. గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడుతున్న మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ (భారత్) తన రెండో మ్యాచ్‌లో 18–21, 7–21తో కున్లావుట్ విదిత్ సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయంపాలైయ్యాడు. శ్రీకాంత్ సెమీస్ చేరాలంటే నేడు జరిగే మ్యాచ్‌లో లీ జి జియా (మలేసియా)పై తప్పక నెగ్గాలి. గాయంతో సాత్విక్–చిరాగ్ జంట అవుట్ టోర్నీ నుంచి భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తప్పుకుంది. సాత్విక్ సాయిరాజ్ మోకాలి గాయంతో బాధ పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తన ప్రకటన ద్వారా తెలిపింది. పురుషుల డబుల్స్ గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత జంట... గురువారం మార్కస్–కెవిన్ సంజయ (ఇండోనేసియా) జోడీతో ఆడాల్సి ఉంది. అయితే సాత్విక్ గాయం కారణంగా ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చి టోర్నీ నుంచి తప్పుకుంది. మహిళల డబుల్స్ విభాగంలోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. ‘గ్రూప్ బి’లో జరిగిన పోరులో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి ద్వయం 19–21, 20–21తో గ్యాబ్యియెలా–స్టెపాని (బల్గేరియా) జోడీ చేతిలో ఓడింది. దాంతో గ్రూప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి జోడీ జంట టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
రియల్ ‘బాహుబలి’.. కటౌట్ చూసి నమ్మేయాల్సిందే!
కటౌట్ చూసి కొన్ని నమ్మేయాల్సిందే. ఈ ఫొటోలో కన్పిస్తున్న బలశాలి నిజంగానే ‘బాహుబలి’. బరువులు ఎత్తడంలో మనోడిని మించినోడు లేడంటే నమ్మాల్సిందే. ఇతగాడి పేరు చీక్ అహ్మద్ అల్ హసన్ అలియాస్ ఐరన్ బిబీ. ప్రపంచంలోనే అత్యంత బలవంతుడిగా పేరు పొందాడీ బాడీ బిల్డర్. ఏదో అషామాషీగా కాదు వరల్డ్ రికార్డును బద్దలు కొట్టి అత్యంత బలశాలిగా నిరూపించుకున్నాడు. జెయింట్స్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఏకంగా 229 కేజీల బరువును ఎత్తి ‘ఔరా’ అనిపించాడు. అయితే ఇక్కడితో ఐరన్ బిబీ ఆగడం లేదు. మున్ముందు 300 కేజీల బరువు ఎత్తేందుకు రెట్టించిన ఉత్సాహంతో శ్రమిస్తున్నాడు. బుర్కినా ఫసో దేశానికి చెందిన ఐరన్ బిబీ పుట్టుకతోనే బాహుబలి. పుట్టినప్పుడే దాదాపు 5 కిలోల బరువు ఉన్నాడట. 1992లో అమ్మ కడుపు నుంచి భూమి మీదకు వచ్చాడు. చిన్నతనం నుంచే ‘ఫ్యాట్ బాయ్’గా పెరిగిన ఐరన్ బిబీ.. స్పింటర్ కావాలని అనుకున్నాడట. స్కూల్లో తాను పరిగెత్తేటప్పుడు తోటి విద్యార్థులు నవ్వేవారని, తనను హేళన చేసేవారని ఐరన్ బిబీ వెల్లడించాడు. (చదవండి: కేబీసీలో 5 కోట్లు గెలిచాడు.. కానీ దివాళా తీశాడు!) ‘ఆ సమయంలో నన్ను నేను అసహ్యించుకునే వాడిని. మా క్లాస్‌లో నేనే చిన్నవాడిని అయినా అందరికంటే నాలుగేళ్లు పెద్దోడిలా కనిపించే వాడిని. మా అన్నయ్యల కంటే కూడా పెద్దోడిలా అనిపించేవాడిని. అన్నివైపుల నుంచి అవహేళనలు ఎదుర్కొంటూ ఒక దశలో నిరాశలో కూరుకుపోయాను. అయితే అథ్లెట్ కావాలన్నా నా కలను మాత్రం వదులుకోలేదు. 17 ఏళ్ల వయసులో 2009లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లడంతో నా జీవితం మలుపు తిరిగింద’ని ఐరన్ బిబీ చెప్పాడు. 2013లో మొదటిసారిగా పవర్ లిప్టింగ్ పోటీల్లోకి దిగిన ఐరన్ బిబీ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత బలవంతుడిగా ఖ్యాతికెక్కాడు. తన సోదరులు ముద్దుగా ‘బిబీ’ అని పిలిచేవారని.. పవర్ లిప్టింగ్లో సత్తా చాటడంతో ఐరన్ బిబీగా పాపులర్ అయినట్టు ఈ ‘బాహుబలి’ వెల్లడించాడు. ఇంతకీ బుర్కినా ఫసో దేశం ఎక్కడుందనే కదా మీ డౌటు. పశ్చిమ ఆఫ్రికాలో ఉంది ఈ దేశం. (చదవండి: వామ్మో! ఒక్క ద్రాక్ష పండు రూ.33 వేలంట..) -
విజయంతో ముగింపు
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు ఊరట విజయం లభించింది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయిన ఈ స్టార్ షట్లర్... శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 21–18, 21–15తో ప్రపంచ 13వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. శుక్రవారంతో లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. గ్రూప్ ‘బి’లో రెండేసి విజయాలు సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచిన పోర్న్‌పవీ, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్), సింధు ఒక్కో విజయం సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించారు. ఓవరాల్‌గా పాయింట్ల ఆధారంగా గ్రూప్ ‘బి’లో రచనోక్ మూడో స్థానంలో, సింధు చివరిదైన నాలుగో స్థానంలో నిలిచారు. గ్రూప్ ‘ఎ’ నుంచి యాన్ సె యంగ్ (దక్షిణ కొరియా), కరోలినా మారిన్ (స్పెయిన్) సెమీఫైనల్ చేరుకున్నారు. పోర్న్‌పవీతో గతంలో నాలుగుసార్లు ఆడి మూడుసార్లు నెగ్గిన సింధుకు ఈసారీ అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో కీలకదశలో పాయింట్లు నెగ్గిన సింధు రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ‘ఈ టోర్నీలో నాకు మంచి ముగింపు లభించింది. తై జు యింగ్ చేతిలో ఓడిపోవడంతో నా సెమీఫైనల్ అవకాశాలు దెబ్బతిన్నాయి. గత మ్యాచ్‌ల ఫలితాలతో గుణపాఠాలు నేర్చుకొని ప్రతి రోజును కొత్తగా మొదలుపెట్టాలి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. మళ్లీ తాజాగా కోర్టులో అడుగుపెడతా’ అని సింధు వ్యాఖ్యానించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–12, 18–21, 19–21తో పోరాడి ఓడిపోయాడు. గ్రూప్ ‘బి’ నుంచి జు వె వాంగ్ (చైనీస్ తైపీ), ఆంటోన్సెన్ (డెన్మార్క్) సెమీఫైనల్ చేరుకోగా... అంగుస్ మూడో స్థానంలో, శ్రీకాంత్ నాలుగో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి అక్సెల్సన్ (డెన్మార్క్), తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు శ్రీకాంత్, సింధు అర్హత
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ సీజన్ ముగింపు బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు భారత స్టార్ షట్లర్లు, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ అర్హత సాధించారు. బ్యాంకాక్ వేదికగా ఈనెల 27 నుంచి 31 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. కరోనా కారణంగా గతేడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితం థాయ్‌లాండ్ ఓపెన్ రెండు సూపర్–1000 టోర్నీలతో అంతర్జాతీయ సీజన్ పునః ప్రారంభమైంది. ఈ రెండు టోర్నీల్లో భాగంగా రెండోది ఆదివారం ముగిసింది. అనంతరం వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారుల వివరాలను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. భారత్ తరఫున మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ అర్హత పొందారు. థాయ్‌లాండ్ ఓపెన్ రెండు టోర్నీల్లో బరిలోకి దిగిన ఆటగాళ్లనే వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పరిగణిస్తామని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. ఈ టోర్నీలకు బయలుదేరేముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో జపాన్, చైనా ఆటగాళ్లకు పాజిటివ్ రావడంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లు థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి వైదొలిగారు. దాంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లు వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆడే అవకాశం కోల్పోయారు. వరల్డ్ టూర్ ఫైనల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉన్నవారే ఈ టోర్నీలో ఆడతారు. అయితే ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో సింధు 11వ ర్యాంక్‌లో నిలిచింది. టాప్–8లో ముగ్గురు థాయ్‌లాండ్ క్రీడాకారిణులు ఉండటం, జపాన్ ప్లేయర్ నొజోమి ఒకుహారా కూడా గైర్హాజరు కావడం పీవీ సింధుకు కలిసొచ్చింది. దాంతో ఎనిమిదో ర్యాంకర్‌గా సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్ బెర్త్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఏడో ర్యాంకర్‌గా అర్హత పొందాడు. వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత పొందిన ఆటగాళ్లందరికీ సోమవారం మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్ట్ నెగెటివ్ వస్తేనే టోర్నీలో ఆడే అవకాశం కల్పిస్తారు. మంగళవారం ‘డ్రా’ వివరాలు వెల్లడిస్తారు. అర్హత పొందిన క్రీడాకారులు... మహిళల సింగిల్స్: కరోలినా మారిన్ (స్పెయిన్), తై జు యింగ్ (చైనీస్ తైపీ), రచనోక్, పోర్న్‌పవీ (థాయ్‌లాండ్), యాన్ సె యంగ్ (దక్షిణ కొరియా), మిచెల్లి లీ (కెనడా), ఎవగెనియా కొసెత్‌స్కాయ (రష్యా), సింధు (భారత్). పురుషుల సింగిల్స్: అక్సెల్సన్, ఆంటోన్సెన్ (డెన్మార్క్), చౌ తియెన్ చెన్, వాంగ్ జు వె (చైనీస్ తైపీ), ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్), శ్రీకాంత్ (భారత్), లీ జి జియా (మలేసియా), ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) -
విశ్వవిజేతలు కూడా ఆడి అర్హత సాధించాల్సిందే!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘వరల్డ్ టూర్ ఫైనల్స్’ టోర్నమెంట్ నిబంధనల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కీలక మార్పులు చేసింది. గతంలో ‘ప్రపంచ చాంపియన్స్’ హోదాలో ర్యాంకింగ్స్‌తో నిమిత్తం లేకుండా ఆటగాళ్లు నేరుగా ఈ టోర్నీలో పాల్గొనేవారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎత్తివేసిన బీడబ్ల్యూఎఫ్ ఇతర వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్ల ప్రకారమే అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తామని ప్రకటించింది. ‘కొత్త నిబంధనల ప్రకారమే బ్యాంకాక్‌లో జరుగనున్న ఫైనల్స్ టోర్నీకి అర్హులైన ఆటగాళ్లను అనుమతిస్తాం. వరల్డ్ చాంపియన్లకు ఎలాంటి మినహాయింపు లేదు. వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్లనే పరిగణలోకి తీసుకుంటాం’ అని బీడబ్ల్యూఎఫ్ ప్రకటన విడుదల చేసింది. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన పీవీ సింధు ఇక ఆ హోదాతో టోర్నీలో పాల్గొనే అవకాశం లేదు. ఇప్పటికే డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకున్న సింధు... ‘ఆసియా’ టోర్నీల్లో సత్తా చాటి ‘ఫైనల్స్’కు అర్హత సాధించాల్సి ఉంటుంది. బీడబ్ల్యూఎఫ్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు సింధు ఆసియా లెగ్–1, 2 టోర్నీల్లో రాణించి ‘ఫైనల్స్’కు అర్హత సాధిస్తుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. ‘సింధు ప్రపంచ చాంపియన్, గతంలో ‘ఫైనల్స్’ టైటిల్ కూడా నెగ్గింది. ప్రస్తుతం మా లక్ష్యం ఒలింపిక్స్, ఆల్ ఇంగ్లండ్ టైటిల్’ అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా సవరించిన∙షెడ్యూల్ ప్రకారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా జనవరి 27–31 మధ్య ‘ఫైనల్స్’ టోర్నీ జరుగుతుంది. జనవరి 12–17 మధ్య ఆసియా ఓపెన్–1, జనవరి 19–24 మధ్య ఆసియా ఓపెన్–2 ఈవెంట్లు జరుగుతాయి. -
మొమోటా మ్యాజిక్...
ఈ సంవత్సరం మొమోటా చైనా మాస్టర్స్, డెన్మార్క్ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, ప్రపంచ ఛాంపియన్ షిప్ జపాన్ ఓపెన్, ఆసియా చాంపియన్íÙప్, సింగపూర్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, జర్మన్ ఓపెన్లలో విజేతగా నిలిచాడు. గ్వాంగ్జౌ (చైనా): తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) 2019 సీజన్‌ను టైటిల్‌తో ముగించాడు. సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో మొమోటా విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ మొమోటా 87 నిమిషాల్లో 17–21, 21–17, 21–14తో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించాడు. ఈ ఏడాది మొమోటా 12 టోరీ్నల్లో ఫైనల్స్ చేరగా... 11 టోర్నీల్లో టైటిల్స్ సాధించాడు. తద్వారా బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు లీ చోంగ్ వీ (మలేసియా), వాంగ్ జియోలి–యు యాంగ్ (చైనా) జంట పేరిట ఉండేది. 2010లో లీ చోంగ్ వీ సింగిల్స్ విభాగంలో 10 టైటిల్స్ నెగ్గగా... 2011లో వాంగ్ జియోలి–యు యాంగ్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో 10 టైటిల్స్ సాధించింది. జిన్‌టింగ్‌తో జరిగిన ఫైనల్లో మొమోటా అద్భుతమే చేశాడు. తొలి గేమ్ కోల్పోయిన ఈ జపాన్ స్టార్ రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 5–12తో ఏడు పాయింట్లతో వెనుకబడి ఉన్నాడు. అయితే ఈ టోర్నీకంటే ముందు తాను ఆడిన నాలుగు టోర్నీల ఫైనల్స్‌లోనూ ఓడిపోయిన జిన్‌టింగ్ కీలకదశలో ఒత్తిడికి లోనయ్యాడు. వరుసగా ఏడు పాయింట్లు గెలిచిన మొమోటా స్కోరును 12–12తో సమం చేశాడు. ఆ తర్వాత స్కోరు 15–14 వద్ద మొమోటా ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకున్నాడు. దాంతో జిన్‌టింగ్ ఈ ఏడాది ఆడిన ఐదు టోరీ్నల ఫైనల్స్‌లో ఓటమిని మూటగట్టుకున్నాడు. చాంపియన్ మొమోటాకు లక్షా 20 వేల డాలర్లు (రూ. 84 లక్షల 83 వేలు), రన్నరప్ జిన్టింగ్కు 60 వేల డాలర్లు (రూ. 42 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సింధు నిష్క్రమణ
ఆగస్టులో విశ్వవిజేతగా అవతరించాక ఆడిన ఆరు టోర్నీల్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లోనూ తడబడింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వరుసగా రెండో పరాజయం చవిచూసి ఈ టోర్నీ లీగ్ దశలోనే నిష్క్రమించింది. నేడు జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో సింధు గెలిస్తే ఆమెకు సీజన్‌ను విజయంతో ముగించిన ఊరట లభిస్తుంది. గ్వాంగ్జౌ (చైనా): గత రెండేళ్లలో బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు చేరడంతోపాటు గతేడాది చాంపియన్‌గా కూడా నిలిచిన భారత స్టార్ పీవీ సింధు ఈసారి మాత్రం నిరాశ పరిచింది. సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సింధు పోరాడి ఓడిపోయింది. ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)తో గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ సింధు 22–20, 16–21, 12–21తో ఓటమి చవిచూసింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో 17–20తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా విజృంభించిన సింధు వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను 22–20తో దక్కించుకుంది. అయితే ఈ ఏడాది ఆరు సింగిల్స్ టైటిల్స్ గెలిచిన చెన్ యుఫె రెండో గేమ్‌లో పుంజుకుంది. ఆరంభంలోనే 8–4తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో చెన్ యుఫె తన దూకుడు కొనసాగించి సింధు ఆట కట్టించింది. మరో మ్యాచ్‌లో అకానె యామగుచి 25–27, 21–10, 21–13తో హి బింగ్జియావో (చైనా)పై గెలిచింది. గ్రూప్ ‘ఎ’లో రెండేసి మ్యాచ్‌లు నెగ్గినందుకు చెన్ యుఫె, యామగుచి సెమీఫైనల్‌కు చేరారు. నేడు జరిగే నామమాత్రపు మ్యాచ్‌ల్లో హి బింగ్జియావోతో సింధు; యామగుచితో చెన్ యుఫె తలపడతారు. -
సింధుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందన
వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. సింధు విజయం 2018 ఏడాదిని చిరస్మరణీయం చేసిందని ఆయన అన్నారు. రాష్ట్రం గర్వించదగ్గ ఈ తెలుగుతేజం రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
‘నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’
గ్వాంగ్జూ (చైనా) : ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా పీవీ సింధు చరిత్రకెక్కారు. ఆదివారం (డిసెంబర్ 16న) జరిగిన ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహారపై సింధు విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో 21-19, 21-17 తేడాతో నెగ్గిన పీవీ సింధు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన అనంతరం సింధు మీడియాతో మాట్లాడుతూ.. తన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పారు.(సింధు నయా చరిత్ర) ‘టైటిల్ గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ఏడాది ముగింపులో మేజర్ టైటిల్ గెలిచాను. స్వర్ణం సాధించినందుకు గర్వంగా ఉంది. నాకు తోడుగా నిలిచిన అభిమానులకు, కోచ్‌కు ధ్యనవాదాలు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లోనూ ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాను’ అని పీవీ సింధు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని విజయాలు సాధించాలి: వైఎస్ జగన్ ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను తొలిసారి గెలిచిన తెలుగు తేజం పీవీ సింధుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయ పరంపరం ఇలానే కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. ‘నీ విజయం దేశానికే గర్వకారణం’ వైఎస్ జగన్ ట్విటర్లో వ్యాఖ్యానించారు. Congratulations to @Pvsindhu1 on your scintillating victory over #NozomiOkuhara, and becoming the first Indian to win the BWF World Tour Finals title! You make us proud! #PVSindhu #BWFWorldTourFinals2018 — YS Jagan Mohan Reddy (@ysjagan) December 16, 2018 -
సింధు నయా చరిత్ర
గ్వాంగ్జూ (చైనా): ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. గత ఏడాది ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సింధు.. ఈ ఏడాది టైటిల్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-19, 21-17 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్)ను ఓడించి విజేతగా అవతరించింది. మరొకవైపు ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను గెలిచి సీజన్‌ను సగర్వంగా ముగించింది. టైటిల్ పోరులో సింధు-ఒకుహారాల మధ్య నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. తొలి గేమ్‌లో సింధు 14-6 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహారా పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి సింధు ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఒకుహారా రెండు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్ మాత్రమే సాధించింది. ఈ దశలో ఒకుహారీ నాలుగు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్ దక్కించింది. దాంతో స్కోరు 16-16 గా సమం అయ్యింది. అటు తర్వాత జోరు పెంచిన సింధు వరుస పాయింట్లతో దుమ్మురేపింది. తొలుత ఒక పాయింట్ సాధించి ఆధిక్యం సాధించిన సింధు.. వరుసగా రెండు స్మాష్‌లతో ముందంజ వేసింది. అదే జోరును తిరిగి కొనసాగించడంతో తొలి గేమ్‌ను సింధు దక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లో సింధు 3-0 తో పైచేయి సాధించింది. ఆపై సింధు రెండు పాయింట్లు, ఒకుహారా నాలుగు పాయింట్లు సాధించడంతో ఇరువురు మధ్య వ్యత్యాసం తగ్గింది. కాకపోతే సింధు మరోసారి విజృంభించి ఆధిక్యాన్ని సాధించింది. రెండో గేమ్‌లో ఎక్కడ ఆధిక్యాన్ని కోల్పోకుండా వచ్చిన సింధు చివరకు మ్యాచ్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా టైటిల్‌ను సాధించింది. కేసీఆర్ హర్షం.. వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను తెలుగు తేజం పీవీ సింధు గెలవడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశానికి గర్వకారణంగా సింధు నిలిచిందని, భష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరారు. మరిన్ని విజయాలు సాధించాలి: వైఎస్ జగన్ ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను తొలిసారి గెలిచిన స్టార్ షట్లర్ సింధుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయ పరంపరం ఇలానే కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. -
చరిత్రకు చేరువలో...
ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను గెలిచి సీజన్‌ను సగర్వంగా ముగించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు మరో విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఈ తెలుగు తేజం వరుసగా రెండో ఏడాది టైటిల్ పోరుకు అర్హత పొందింది. తద్వారా ఈ టోర్నీలో రెండుసార్లు ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (2017లో), సైనా నెహ్వాల్ (2011లో), మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల–దిజు (2009లో) జంట ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో నేడు జరిగే ఫైనల్లో సింధు గెలిస్తే సీజన్ ముగింపు టోర్నమెంట్లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పుతుంది. గ్వాంగ్జూ (చైనా): తన అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది ఆరో టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆమె వరుసగా రెండో ఏడాది అంతిమ సమరానికి అర్హత సాధించింది. 2013 ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21–16, 25–23తో గెలుపొందింది. ఆదివారం జరిగే ఫైనల్లో 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సింధు, ఒకుహారా 6–6తో సమంగా ఉన్నారు. రెండో సెమీఫైనల్లో ఒకుహారా 21–17, 21–14తో జపాన్‌కే చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచిపై నెగ్గింది. రచనోక్‌తో జరిగిన సెమీఫైనల్లో సింధు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. తన ప్రత్యర్థి సర్వీస్‌లకు పదునైన రిటర్న్ షాట్లతో జవాబు ఇచ్చింది. ఆరంభంలోనే 10–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. సింధు కొట్టిన షాట్ల గతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన రచనోక్ పలుమార్లు షటిల్స్‌ను వదిలేసింది. రెండో గేమ్‌లో మాత్రం ఇద్దరూ ప్రతీ పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. 27 షాట్లపాటు సాగిన ర్యాలీలో పైచేయి సాధించిన రచనోక్ స్కోరును 10–10తో సమం చేసింది. అనంతరం పలుమార్లు స్కోరు సమమయ్యాక 24–23 వద్ద సింధు కళ్లు చెదిరే స్మాష్ షాట్‌తో పాయింట్ గెల్చుకోవడంతోపాటు గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ‘గతంలో పాయింట్లు కోల్పోయాక వాటి గురించే ఆలోచించి మరిన్ని తప్పిదాలు చేసేదాన్ని. ఇప్పుడు అలా ఆలోచించడం లేదు. మానసికంగా చాలా దృఢంగా తయారయ్యాను. ఆధిక్యం పోయినా, పాయింట్లు చేజార్చుకున్నా వెంటనే తేరుకొని తర్వాతి పాయింట్‌పై దృష్టి పెడుతున్నాను. ఒకుహారాతో జరిగే ఫైనల్లో మానసిక స్థయిర్యం, సహనం, ఏకాగ్రత కీలకం కానున్నాయి. మేమిద్దరం ఆడే మ్యాచ్‌ల్లో సుదీర్ఘ ర్యాలీలు ఉంటాయి. ఈసారీ మ్యాచ్ సుదీర్ఘంగా సాగుతుందని భావిస్తున్నాను. ఆమెను ఏమాత్రం తక్కువ అంచనా వేయడంలేదు’ అని విజయానంతరం సింధు వ్యాఖ్యానించింది. మ్యాచ్ పాయింట్ చేజార్చుకున్న సమీర్ వర్మ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత యువతార సమీర్ వర్మ 21–12, 20–22, 17–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్ గెలిచి, రెండో గేమ్‌లో సమీర్ వర్మ 20–19తో విజయం అంచున నిలిచాడు. ఈ దశలో షి యుకి వరుసగా మూడు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో షి యుకి పైచేయి సాధించి సమీర్ వర్మ ఆట కట్టించాడు. మరో సెమీస్‌లో ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) 21–14, 21–12తో సన్ వాన్ హో (కొరియా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో షి యుకితో మొమోటా ఆడతాడు. -
ఈసారి టైటిల్ గెలుస్తా: సింధు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఈసారి టైటిల్ సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఆమె ఇప్పుడు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు కావాల్సినంత సమయం లభించిందని చెప్పింది. వచ్చే నెల 12 నుంచి గ్వాంగ్జౌ (చైనా)లో జరిగే ఈ టోర్నీకి సిద్ధమయ్యేందుకు గతవారం సయ్యద్ మోదీ ఈవెంట్‌కు ఆమె గైర్హాజరయింది. ‘ఈసారి తప్పకుండా మెరుగైన ఫలితం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నా. హేమాహేమీలు తలపడే ఈ ఈవెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉన్నాను. ప్రత్యర్థులంతా క్లిష్టమైన వారే. ఎవరికి ఎవరూ తీసిపోరు. కానీ నేను మాత్రం ఈసారి టైటిల్ చేజార్చుకోను’ అని సింధు తెలిపింది. -
ఫెడరర్ ఆశలు సజీవం
ఫెడరర్ ఆశలు సజీవం లండన్: టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొలి విజయం సాధించాడు. ‘హెవిట్ గ్రూప్’ లో భాగంగా డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఫెడ రర్ 6–2, 6–3తో గెలుపొందాడు. గురువారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో నిషికోరి (జపాన్)పై థీమ్ గెలిచి... అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై ఫెడరర్ విజయం సాధిస్తే స్విట్జర్లాండ్ స్టార్ ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీఫైనల్ చేరుకుంటాడు. -
జొకోవిచ్ జోరుకు ఫెడరర్ బ్రేక్
లండన్: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ పై మాజీ నంబర్ వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ విజయాన్ని సాధించాడు. ఈ విజయంతో ఫెదరర్ ఈ టోర్నమెంట్ సెమీస్‌లో ప్రవేశించాడు. వరుస సెట్లలో 7-5, 6-2 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్‌ను మట్టికరిపించాడు. గత ఆగస్టు 23న సిన్సినాటి ఫైనల్స్ తర్వాత ఫెదరర్ చేతిలో జొకోవిచ్ ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి. 45 ఏళ్ల ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ చరిత్రలో వరుసగా 15వ విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గత ఆదివారం ఈ సెర్బియా స్టార్ గుర్తింపు పొందిన విషయం అందరికీ విదితమే. అయితే, అతడి జైత్రయాత్రకు స్విస్ మాస్టర్ కళ్లెం వేశాడు. 'ఈ సీజన్లో ఇది చాలా పెద్ద విజయం. ఈ టోర్నమెంట్లో మరింత ముందుకు సాగేందుకు ఈ గెలుపు తోడ్పడుతుంది'అని రోజర్ అభిప్రాయపడ్డాడు. బ్యాక్‌హ్యాండ్ షాట్లతో ఫెదరర్ మునుపటి జోరు ప్రదర్శించగా, తాను అనవసర తప్పిదాలు చేయడంతో ఓటమి పాలైనట్లు టాప్ ప్లేయర్ జొకోవిచ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా రెండో సెట్లో ఫెదరర్ తన అత్యుత్తమ ఆటను కనబరిచాడని చెప్పాడు. ఈ గెలుపుతో జొకోవిచ్పై తన గెలుపోటముల రికార్డును 22-21గా ఫెదరర్ మెరుగు పరుచుకున్నాడు. తన తదుపరి మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ నిషికొరితో తలపడనున్నాడు. -
పేస్ జోడి ఓటమి
లండన్: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత సీనియర్ స్టార్ లియాండర్ పేస్ జోడి సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పేస్-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం పరాజయం చవిచూసింది. గ్రూప్-బిలో ఏడో సీడ్ భారత్-చెక్ జోడి 4-6, 6-7 (5/7)తో డేవిడ్ మారెరో-ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్) జంట చేతిలో ఓడింది. సెమీస్‌కు చేరాలంటే తదుపరి మ్యాచ్‌లో పేస్ జోడి తప్పక గెలవాలి. ఫెడరర్‌పై జోకోవిక్దే గెలుపు సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6-4, 6-7(2/7), 6-2తో ఫెడరర్‌పై విజయం సాధిం చాడు. మరోవైపు రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా తొలి మ్యాచ్‌లో 6-3, 6-2తో ఫైను ఓడించాడు.