లండన్: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత సీనియర్ స్టార్ లియాండర్ పేస్ జోడి సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పేస్-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం పరాజయం చవిచూసింది. గ్రూప్-బిలో ఏడో సీడ్ భారత్-చెక్ జోడి 4-6, 6-7 (5/7)తో డేవిడ్ మారెరో-ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్) జంట చేతిలో ఓడింది. సెమీస్‌కు చేరాలంటే తదుపరి మ్యాచ్‌లో పేస్ జోడి తప్పక గెలవాలి.
ఫెడరర్‌పై జోకోవిక్‌దే గెలుపు
సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6-4, 6-7(2/7), 6-2తో ఫెడరర్‌పై విజయం సాధిం చాడు. మరోవైపు రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా తొలి మ్యాచ్‌లో 6-3, 6-2తో ఫైను ఓడించాడు.
పేస్ జోడి ఓటమి
Published Thu, Nov 7 2013 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement