సెమీస్‌లో పేస్ జోడి | Leander Paes enters semis, Rohan Bopanna ousted from Wimbledon | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో పేస్ జోడి

Published Fri, Jul 10 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

సెమీస్‌లో పేస్ జోడి

సెమీస్‌లో పేస్ జోడి

మిక్స్‌డ్‌లో సానియా జంటకు నిరాశ
 లండన్: భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఏడోసీడ్ పేస్-హింగిస్ 6-2, 6-1తో మూడోసీడ్ మత్‌కోవాస్కి (పోలెండ్)-వెస్నినా (రష్యా)పై నెగ్గారు.
 
  కేవలం 44 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించిన పేస్ జోడి వచ్చిన నాలుగు బ్రేక్ పాయింట్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. మరో మ్యాచ్‌లో రెండోసీడ్ సానియా మీర్జా- బ్రూనో సోరెస్ (బ్రెజిల్) 6-3, 6-7 (6/8), 7-9తో ఐదోసీడ్ అలెగ్జాండర్ పియా (ఆస్ట్రియా)-బాబోస్ (హంగేరి) చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో రోహన్ బోపన్న-ఫ్లోరియన్ మెర్జియా (రుమేనియా) జోడి 6-4, 2-6, 3-6, 6-4, 11-13తో నాలుగోసీడ్  రోజర్ (నెదర్లాండ్స్)-హోరియా టెకాయు (రుమేనియా) చేతిలో ఓడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement