లండన్: వరల్డ్ టూర్ ఫైనల్స్ ఏటీపీ టోర్నమెంట్‌లో భారత వెటరన్ స్టార్ లియాండర్ పేస్ జోడి శుభారంభం చేసింది. గ్రూప్-బిలో జరిగిన తొలి రౌండ్ పోరులో ఏడో సీడ్ పేస్-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట రెండో సీడ్ అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా)- బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడికి షాకిచ్చింది. హోరాహోరీగా జరిగిన ఈ సమరంలో భారత్-చెక్ ద్వయం 6-3, 5-7, 10-8తో పెయా-బ్రూనో జోడిని కంగుతినిపించింది. గంటా 42 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో పేస్ జోడి నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించింది.
క్వార్టర్స్‌లో దివిజ్-పురవ్
ఇటలీలో జరుగుతున్న ఒర్టిసెయి ఏటీపీ టెన్నిస్ చాలెంజర్ టోర్నీలో భారత యువ జోడి దివిజ్ శరణ్-పురవ్ రాజా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోరులో టాప్‌సీడ్ దివిజ్-పురవ్ జంట 6-1, 6-3తో డేవిడ్ కోస్ట్‌నెర్-ప్యాట్రిక్ ప్రినోత్ (ఇటలీ) జోడిపై అలవోక విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో మార్టిన్ ఫిస్చెర్ (ఆస్ట్రియా)-పీటర్ గోజోజిక్ (జర్మనీ) ద్వయంతో భారత జంట తలపడుతుంది.
పేస్ జోడి శుభారంభం
Published Wed, Nov 6 2013 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement
Advertisement