జొకోవిచ్ జోరుకు ఫెడరర్ బ్రేక్ | World Tour Finals: Roger Federer floors Novak Djokovic for semifinal spot | Sakshi
Sakshi News home page

జొకోవిచ్ జోరుకు ఫెడరర్ బ్రేక్

Published Thu, Nov 19 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

జొకోవిచ్ జోరుకు ఫెడరర్ బ్రేక్

జొకోవిచ్ జోరుకు ఫెడరర్ బ్రేక్

లండన్: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ పై మాజీ నంబర్ వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ విజయాన్ని సాధించాడు. ఈ విజయంతో ఫెదరర్ ఈ టోర్నమెంట్ సెమీస్లో ప్రవేశించాడు. వరుస సెట్లలో 7-5, 6-2 తేడాతో ప్రపంచ నంబర్వన్ ర్యాంకర్ను మట్టికరిపించాడు. గత ఆగస్టు 23న సిన్సినాటి ఫైనల్స్ తర్వాత ఫెదరర్ చేతిలో జొకోవిచ్ ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి. 45 ఏళ్ల ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ చరిత్రలో వరుసగా 15వ విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గత ఆదివారం ఈ సెర్బియా స్టార్ గుర్తింపు పొందిన విషయం అందరికీ విదితమే. అయితే, అతడి జైత్రయాత్రకు స్విస్ మాస్టర్ కళ్లెం వేశాడు.

'ఈ సీజన్లో ఇది చాలా పెద్ద విజయం. ఈ టోర్నమెంట్లో మరింత ముందుకు సాగేందుకు ఈ గెలుపు తోడ్పడుతుంది'అని రోజర్ అభిప్రాయపడ్డాడు. బ్యాక్హ్యాండ్ షాట్లతో ఫెదరర్ మునుపటి జోరు ప్రదర్శించగా, తాను అనవసర తప్పిదాలు చేయడంతో ఓటమి పాలైనట్లు టాప్ ప్లేయర్ జొకోవిచ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా రెండో సెట్లో ఫెదరర్ తన అత్యుత్తమ ఆటను కనబరిచాడని చెప్పాడు. ఈ గెలుపుతో జొకోవిచ్పై తన గెలుపోటముల రికార్డును 22-21గా ఫెదరర్ మెరుగు పరుచుకున్నాడు. తన తదుపరి మ్యాచ్లో జపాన్ ప్లేయర్ నిషికొరితో తలపడనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement