న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్ కు పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ అర్హత సాధించింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా వరల్డ్ ర్యాంకింగ్ ప్రకారం అర్హత సాధించారు. మంగళవారం ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో టాప్–8 జోడీలు ప్రతిష్టాత్మక ఫైనల్స్ టోర్నీ ఆడతాయి. భారత్ నుంచి ఈ టోర్నీలో వీరిద్దరు మాత్రమే బరిలోకి దిగుతున్నారు.
ఈ సీజన్‌లో గాయత్రి–ట్రెసా నిలకడగా రాణించారు. చైనా మాస్టర్స్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే ఓడినా... ఇతర టోర్నీనల ప్రదర్శన వారికి ఈ అవకాశం కల్పింపంచింది. సింగపూర్ ఓపెన్, మకావు ఓపెన్‌లలో గాయత్రి–ట్రెసా సెమీఫైనల్‌కు చేరారు. ఇప్పటి వరకు బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు మాత్రమే 2018లో విజేతగా నిలిచింది.
సీజన్ చివరి టోర్నీకి అర్హత సాధించడం పట్ల ట్రెసా జాలీ సంతోషం వ్యక్తం చేసింది. ‘తొలిసారి ఫైనల్స్‌కు క్వాలిఫై కావడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. నాకౌట్ టోర్నీ కాదు కాబట్టి గ్రూప్ దశలో ప్రతీ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయతి్నస్తాం’ అని ఆమె పేర్కొంది. చైనాలోని హాంగ్జూలో డిసెంబర్ 11–15 మధ్య బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ జరుగుతుంది
Comments
Please login to add a commentAdd a comment