
హాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్ నుంచి భారత జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. మొదటిసారి ఈ టోర్నీకి అర్హత సాధించిన గాయత్రి–ట్రెసా జంట సెమీఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది.
గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 17–21, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ జంట నామి మసుయామ–చిహారు షిడా (జపాన్) చేతిలో ఓడిపోయింది.
గ్రూప్ ‘ఎ’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా), నామి మసుయామ–చిహారు షిడా (జపాన్) జోడీలు సెమీఫైనల్ చేరుకున్నాయి. మూడో స్థానంలో నిలిచిన గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి 32,500 డాలర్ల (రూ. 27 లక్షల 56 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment