Badminton World Federation
-
బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌కు గాయత్రి–ట్రెసా జోడీ అర్హత
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్ కు పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ అర్హత సాధించింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా వరల్డ్ ర్యాంకింగ్ ప్రకారం అర్హత సాధించారు. మంగళవారం ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో టాప్–8 జోడీలు ప్రతిష్టాత్మక ఫైనల్స్ టోర్నీ ఆడతాయి. భారత్ నుంచి ఈ టోర్నీలో వీరిద్దరు మాత్రమే బరిలోకి దిగుతున్నారు. ఈ సీజన్లో గాయత్రి–ట్రెసా నిలకడగా రాణించారు. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్స్‌లోనే ఓడినా... ఇతర టోర్నీనల ప్రదర్శన వారికి ఈ అవకాశం కల్పింపంచింది. సింగపూర్ ఓపెన్, మకావు ఓపెన్లలో గాయత్రి–ట్రెసా సెమీఫైనల్‌కు చేరారు. ఇప్పటి వరకు బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు మాత్రమే 2018లో విజేతగా నిలిచింది. సీజన్ చివరి టోర్నీకి అర్హత సాధించడం పట్ల ట్రెసా జాలీ సంతోషం వ్యక్తం చేసింది. ‘తొలిసారి ఫైనల్స్‌కు క్వాలిఫై కావడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. నాకౌట్ టోర్నీ కాదు కాబట్టి గ్రూప్ దశలో ప్రతీ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయతి్నస్తాం’ అని ఆమె పేర్కొంది. చైనాలోని హాంగ్జూలో డిసెంబర్ 11–15 మధ్య బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ జరుగుతుంది -
సీఏఎస్ తీర్పు: భారత స్వర్ణ పతక విజేతపై నిషేధం
ప్యారిస్ పారాలింపిక్స్-2024కు ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో పారాలింపిక్ స్వర్ణ పతక విజేత, పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్‌పై వేటు పడింది. పద్దెనిమిది నెలల పాటు అతడు ఏ టోర్నీలో పాల్గొనకుండా బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య(BWF) నిషేధం విధించింది.అందుకే వేటు వేశాండోపింగ్ నిరోధక నిబంధనల నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘పన్నెండు నెలల వ్యవధిలో మూడుసార్లు పరీక్షకు రమ్మని ఆదేశించగా.. ప్రమోద్ భగత్ రాలేదు. అంతేకాదు.. ఆ సమయంలో తాను ఎక్కడ ఉన్నాను, ఎందుకు రాలేకపోయాను అన్న వివరాలు చెప్పడంలోనూ విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో మార్చి 1, 2024.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్(CAS) డోపింగ్ నిరోధక డివిజన్.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అతడిని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో SL3 అథ్లెట్ అయిన భగత్.. CASను సంప్రదించి నిషేధం ఎత్తివేయాలని కోరాడు. అయితే, జూలై 29, 2024లో అతడి పిటిషన్‌ను CAS కొట్టివేసింది. మార్చి 1 నాటి డివిజన్ ఇచ్చిన తీర్పును సమర్థించింది’’ అని బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య తన ప్రకటనలో ఈ మేరకు వివరాలు వెల్లడించింది.భారత్‌కు ఎదురుదెబ్బేకాగా శరీరంలోని ఒక పక్క మొత్తం పాక్షికంగా పనిచేయని లేదా కాలి కింది భాగం పనిచేయని.. అంటే వేగంగా నడవలేని, పరుగెత్తలేని స్థితిలో ఉన్న బ్యాడ్మింటన్ ప్లేయర్ SL3 విభాగంలో పోటీపడతారు. ఇక టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డానియెల్ బెథెల్‌ను ఓడించిన 35 ఏళ్ల ప్రమోద్ భగత్ పసిడి పతకం గెలుచుకున్నాడు. అంతేకాదు.. 2015, 2019, 2022లో వరల్డ్ చాంపియన్‌గానూ నిలిచిన ఘనత ఈ బిహారీ పారా అథ్లెట్ సొంతం. ప్యారిస్ పారాలింపిక్స్‌లోనూ కచ్చితంగా స్వర్ణం గెలుస్తాడనే అంచనాలు ఉండగా.. ఇలా 18 నెలల పాటు అతడిపై వేటు పడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనగా కేవలం ఆరు పతకాలే వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: Neeraj Chopra: రూ. 52 లక్షల వాచ్!.. కోట్ల ఆస్తి: కష్టపడి పైకొచ్చిన నీరజ్ చోప్రా -
సింధు ర్యాంక్‌లో పురోగతి
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు రెండు స్థానాలు పురోగతి సాధించింది. తాజా ర్యాంకింగ్స్‌లో సింధు 17 నుంచి 15వ స్థానానికి చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 9వ ర్యాంక్‌లో, లక్ష్య సేన్ 11వ ర్యాంకుల్లో కొనసాగుతుండగా...శ్రీకాంత్ ఒక స్థానం పడిపోయి 20వ ర్యాంక్ లో నిలిచాడు. గతవారం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన ప్రియాన్షు రజావత్ మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
‘బీడబ్ల్యూఎఫ్’ అథ్లెటిక్స్ కమిషన్‌లో సింధు
PV Sindhu: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెటిక్స్ కమిషన్‌లో సభ్యురాలిగా నియమితురాలైంది. ఆరుగురు సభ్యుల జాబితాను బీడబ్ల్యూఎఫ్ సోమవారం ప్రకటించింది. ఇందులో సింధుతో పాటు ఐరిస్ వాంగ్ (అమెరికా), రాబిన్ టబెలింగ్ (నెదర్లాండ్స్), గ్రేసియా పొలి (ఇండోనేసియా), కిమ్ సోయెంగ్ (కొరియా), జెంగ్ సి వి (చైనా) కూడా ఉన్నారు. త్వరలోనే చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ను ఎంపిక చేయనున్నారు. కాగా సింధు 2025 వరకు అథ్లెటిక్స్ కమిషన్‌లో సభ్యురాలిగా ఉంటుంది. ఇక పీవీ సింధు రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యోలో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: Ben Vs Hyd: 5 వికెట్లతో చెలరేగిన పృథ్వీ రెడ్డి -
PV Sindhu: అందని ద్రాక్ష.. సింధు సాధించేనా!
BWF World Tour Finals PV Sindhu Handed Good Draw Eyes On Semis: ఈ ఏడాది అందని ద్రాక్షగా ఉన్న అంతర్జాతీయ టైటిల్ కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి ప్రయత్నించనుంది. డిసెంబరు 1 నుంచి మొదలయ్యే బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ సింధుకు సులువైన ‘డ్రా’నే పడింది. ఆమె తన స్థాయికి తగ్గట్టు ఆడితే సెమీఫైనల్ చేరుకోవడం ఖాయమే. వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిది మంది క్రీడాకారిణులను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో సింధు, పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్), లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్), వైవన్ లీ (జర్మనీ)... గ్రూప్ ‘బి’లో అకానె యామగుచి (జపాన్), బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్), ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా), జియా మిన్ యె (సింగపూర్) ఉన్నారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. తొలి మ్యాచ్‌లో లైన్ క్రిస్టోఫర్సన్తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప పోటీపడనున్నారు. చదవండి: IPL Retention: ఈ 27 మంది ఓకే.. మరి ఆ ఆరు స్థానాలు.. వార్నర్, రాహుల్, రషీద్, గిల్ ఇంకా -
Saina Nehwal, Kidambi Srikanth: సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ టోక్యో ఒలిం పిక్స్‌కు అర్హత పొందలేకపోయారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమయ్యేలోపు ఎలాంటి క్వాలిఫయింగ్ టోర్నీలు నిర్వహించడంలేదని... జూన్ 15వ తేదీ ర్యాంకింగ్స్ ఆధారంగా టోక్యో బెర్త్‌లు ఖరారు చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో టాప్–16 ర్యాంకింగ్స్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది. భారత్ నుంచి మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో... శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. దాంతో భారత్ నుంచి సింధు, సాయిప్రణీత్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. పురుషుల డబుల్స్‌లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. -
Malaysia Open వాయిదా: సైనా, శ్రీకాంత్‌కు షాక్!
కౌలాలంపూర్: మలేసియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ మే 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లలో భాగమైన మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారాయి. సింగిల్స్ విభాగంలో ఒక దేశం తరఫున గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖరారు కావాలంటే ఆ దేశానికి చెందిన ఆటగాళ్లు టాప్–16 ర్యాంకింగ్స్‌లో ఉండాలి. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో, శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో, సైనా నెహ్వాల్ 22వ ర్యాంక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్స్ నుంచి సాయిప్రణీత్‌కు, సింధుకు ‘టోక్యో’ బెర్త్‌లు ఖరారయినట్టే. మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఒకే ఒక టోర్నీ సింగపూర్ ఓపెన్ (జూన్ 1–6) మిగిలి ఉంది. ‘టోక్యో’ బెర్త్‌లు దక్కించుకోవాలంటే సింగపూర్ ఓపెన్‌లో శ్రీకాంత్, సైనా తప్పనిసరిగా టైటిల్స్ సాధించడంతోపాటు ఇతర క్రీడాకారుల ఫలితాల కోసం వేచి చూడాలి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్ ఓపెన్ కూడా జరుగుతుందో వాయిదా పడుతుందో తేలియదు. మరోవైపు మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనలపై క్లారిటీ ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్‌ను భారత బ్యాడ్మింటన్ సంఘం కోరింది. -
PV Sindhu: సింధుకు సముచిత గౌరవం
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తగిన రీతిలో గౌరవించింది. ఐఓసీ ప్రచార కార్యక్రమంలో ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’కు అంబాసిడర్‌గా సింధును ఎంపిక చేసింది. సింధుతో పాటు కెనడా షట్లర్ మిషెల్లీ లీకి కూడా ఈ గౌరవం దక్కింది. ఐఓసీ ప్రచారంలో భాగంగా సింధు, లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న షట్లర్లతో సోషల్ మీడియా ద్వారా సంభాషిస్తారు. క్రీడల్లో అత్యుత్తమంగా ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే అంశంపై తమ సూచనలు, సలహాలు ఇస్తారు. ముఖ్యంగా ఆటలో భాగంగా ఉంటూ తప్పుడు మార్గాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదాల నుంచి ఎలా దూరంగా ఉండాలనే అంశంపై మార్గనిర్దేశనం చేస్తారు. చదవండి: Tokyo Olympics: జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ అర్హత -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ జంట
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ ద్వయం 21–7, 21–18తో డొమినిక్–సెరెనా (ఆస్ట్రియా) జోడీపై గెలిచింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ 21–9, 21–5తో రాచెల్ (ఐర్లాండ్)పై, ఐరా శర్మ 12–21, 21–14, 21–17తో లియోనైస్ (ఫ్రాన్స్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 21–10తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌పై, కిరణ్ జార్జి 13–21, 21–16, 23–21తో సహచరుడు ప్రణయ్‌పై, చిరాగ్ సేన్ 21–13, 21–12తో చికో వార్దోయో (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ 7–21, 17–21తో తోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. -
ఎన్నికల బరిలో పీవీ సింధు
-
బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో సింధు
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్‌లో చోటు కోసం పోటీపడుతోంది. మార్చి 27న నామినేషన్ల దరఖాస్తు గడువు ముగి యగా ఆరుగురు పురుష ఆటగాళ్లు, ముగ్గురు మహిళా క్రీడాకారిణులు ఎన్నికల బరిలో మిగిలారు. ప్రపంచ రెండో ర్యాంకర్ సింధుతో పాటు పురుషుల డబుల్స్‌లో ఇద్దరు మాజీ ప్రపంచ నంబర్‌వన్ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే భారత్ నుంచి అంతగా పేరులేని డబుల్స్ ఆటగాడు నిఖర్ గార్గ్ కూడా నామినేషన్ దాఖలు చేశాడు. ముంబైకి చెందిన ఈ ఆటగాడు గతేడాది మేలో అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ సంఘాల ద్వారా కాకుండా నేరుగా రిజిష్టర్ చేసుకునే సౌకర్యాన్ని బీడబ్లు్యఎఫ్ కల్పించాలని ఆన్లైన్ పిటిషన్ ప్రారంభించాడు. ఇక మొత్తంగా పోటీపడుతున్న తొమ్మిది మంది నుంచి ఖాళీగా ఉన్న నాలుగు స్థానాల్లో ఎంపికవుతారు. యుహాన్ టాన్ (బెల్జియం), క్రిస్టియాన్ విట్టింగస్ (డెన్మార్క్), గ్రేసియా పోలి (ఇండోనేసియా)ల నాలుగేళ్ల పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. నిబంధనల ప్రకారం కనీసం ఒక పురుష, ఒక మహిళా ప్లేయర్ కచ్చితంగా ఎన్నికవాల్సి ఉంటుంది. ఇక మూడో వ్యక్తి ఎవరైనా ఆ తర్వాత అత్యధికంగా నమోదైన ఓట్ల ప్రకారం ఎన్నికవుతారు. మరోవైపు గతేడాది రాజీనామా చేసిన టాంగ్ యువాంటింగ్ స్థానంలో అదనంగా ఓ మహిళా క్రీడాకారిణి కూడా ఎంపికవుతారు. 2015లో ఆమె అథ్లెట్స్ కమిషన్‌లో చోటు దక్కించుకోగా గతేడాది బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు ప్రకటించింది. అలాగే అథ్లెట్స్ కమిషన్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది. ఆమె మిగిలిన పదవీకాలాన్ని తాజాగా ఎన్నికయ్యే క్రీడాకారిణి భర్తీ చేస్తుంది. ఇక తొలిసారిగా ఈ–మెయిల్ ద్వారా ఈనెల 26 నుంచి మే 24 వరకు ఓటింగ్ జరగనుంది. అలాగే అదే తేదీన ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే సుదిర్మన్ కప్‌లో పాల్గొనే ఆటగాళ్లు వ్యక్తిగతంగా స్టేడియంలోనే ఓటు వేయవచ్చు. ఈ ఎన్నికల్లో గెలిచినవారు బీడబ్లు్యఎఫ్కు ఆటగాళ్లకు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తుంటారు. -
‘టాప్’కు మరింత చేరువలో..ప్రపంచ నంబర్ 2గా సింధు
-
‘టాప్’కు మరింత చేరువలో...ప్రపంచ నంబర్ 2గా సింధు
న్యూఢిల్లీ: తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు మరో చరిత్రకు సిద్ధమవుతోంది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత వరల్డ్ టాప్ ర్యాంక్‌కు కేవలం ఒక అడుగు దూరంలో నిలిచింది. ఈ హైదరాబాదీ సంచలన షట్లర్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజాగా విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో తెలుగు తేజం సింధు రెండో ర్యాంకుకు ఎగబాకింది. తద్వారా సైనా తర్వాత భారత్ తరఫున టాప్–3లో నిలిచిన రెండో క్రీడాకారిణిగా ఘనత వహించింది. ఆదివారం కరోలినా మారిన్ (స్పెయిన్) ను చిత్తు చేసి ఇండియా ఓపెన్ టైటిల్ గెలుచుకోవడంతో ఆమె మూడు స్థానాల్ని మెరుగుపర్చుకుంది. 75,759 రేటింగ్ పాయింట్లతో సింధు రెండో స్థానంలో నిలువగా... టాప్ ర్యాంకులో తై జు యింగ్ (చైనీస్ తైపీ; 87,911) కొనసాగుతోంది. మారిన్ నిలకడగా మూడో స్థానంలోనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మలేసియా ఓపెన్‌లో తొలిరౌండ్లోనే నిష్క్రమించిన సైనా (64,279) ఒక స్థానం దిగజారి తొమ్మిదో ర్యాంకులో నిలిచింది. పురుషుల సింగిల్స్ ర్యాంకుల్లో అజయ్ జయరామ్ 20వ ర్యాంకులో ఉన్నాడు. భారత్ తరఫున ఇదే మెరుగైన ర్యాంకు. -
ఏడో ర్యాంకుకు సింధు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు ర్యాంకింగ్స్ లోనూ దూసుకెళ్తోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో ఆమె రెండు స్థానాల్ని మెరుగుపర్చుకొని ఏడో ర్యాంకుకు ఎగబాకింది. చైనా ఓపెన్ టైటిల్ సాధించిన సింధు ఇటీవలే ముగిసిన హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో మెరుగైన ర్యాంకుతో ఆమె సూపర్ సిరీస్ ఫైనల్ ఈవెంట్లో ఆడేందుకు అర్హత సంపాదించింది. దుబాయ్‌లో ఈ నెల 14 నుంచి జరిగే ఈ టోర్నీలో కేవలం టాప్-8 క్రీడాకారిణులు మాత్రమే బరిలోకి దిగుతారు. సైనా నెహ్వాల్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకుకి చేరింది. తొలి మూడు స్థానాల్లో వరుసగా తై జు రుుంగ్ (చైనీస్ తైపీ), మారిన్ (స్పెరుున్), రత్చనోక్ (థాయ్‌లాండ్) ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ఒక ర్యాంకును కోల్పోరుు 13వ స్థానంలో నిలువగా... సమీర్ వర్మ 13 ర్యాంకుల్ని మెరుగుపర్చుకొని 30వ ర్యాంకుకు ఎగబాకాడు. -
వచ్చే నెలలో బరిలోకి సైనా...
హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నవంబర్‌లో తిరిగి బరిలోకి దిగనుంది. ప్రస్తుతం గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆమె చైనా ఓపెన్‌లో ఆడనున్నట్టు సైనా తండ్రి హర్వీర్ సింగ్ తెలిపారు. వచ్చే నెల 12 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ ఐదో ర్యాంకర్ సైనా... 2014లో ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. అరుుతే నవంబర్ 6న జరిగే అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి చెందిన అథ్లెట్స్ కమిషన్ సమావేశానికి తను గైర్హాజరు కానుంది. మరోవైపు ఐఓసీ అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యురాలిగా నియమితులైనందుకు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌ను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) అభినందించింది. -
సింధు సిల్వర్ మెడల్ గెలిచినా...
రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టింది పీవీ సింధు. ఒలింపిక్స్‌లో సింధు అద్భుతమైన పోరాటపటిమను చూపినప్పటికీ.. ఆమె వరల్డ్ ర్యాంకు ఏమీ మారలేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించిన తాజా ర్యాంకుల్లో ఆమె పదో స్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు ఒలింపిక్స్‌లో అంచనాల మేరకు ఆడలేకపోయిన భారత షట్లర్ సైనా నేహ్వాల్ ర్యాంకు మరింత దిగజారింది. తాజా ప్రదర్శన కారణంగా స్థానాలు పడిపోయిన సైనా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో విఫలమైన భారత షట్లర్ల జోడీ గుత్తా జ్వాలా, అశ్వని పొన్నప్ప కూడా నాలుగు స్థానాలు దిగజారి 26 ర్యాంకుకు పరిమితమయ్యారు. అయితే, పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మాత్రం తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని అతను 10వర్యాంకులో నిలువగా.. మరో భారత షట్లర్ అజయ్ జయరాం కూడా ర్యాంకును మెరుగుపరుచుకొని 22వస్థానంలో నిలిచాడు. -
రెండో ర్యాంకుకు పడిపోయిన సైనా
హైదరాబాదీ స్టైలిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ బ్యాడ్మిమింటన్లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకును కోల్పోయారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) గురువారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సైనా రెండో ర్యాంకుకు పడిపోయారు. ఒలింపిక్ చాంపియన్, చైనా క్రీడాకారిణి లీ జుయెరుయి తిరిగి నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నారు. ప్రపంచ చాంపియన్ కరొలినా మారిన్..ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీఫైనల్లో ఒటమి పాలవ్వడంతో సైనా నెహ్వాల్ గత నెలలో వరల్డ్ నంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకుని, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు స్థాపించింది. గురువారం ప్రకటించిన ర్యాంకుల్లో పురుషుల సింగిల్స్ స్పెషలిస్ట్ తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ 4 పొజిషన్లో ఉన్నారు. ప్రణయ్ 14 వ ర్యాంకులో, రెండు ర్యాంకులు మెరుగు పర్చుకున్న పారుపల్లి కాశ్యప్ 15వ స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్ప జోడికి 18వ ర్యాంకు దక్కింది. కాగా పురుషుల డబుల్స్‌లో టాప్-25 ర్యాంకుల్లో భారతీయ క్రీడాకారులెవరికీ చోటుదక్కలేదు.