
PV Sindhu: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెటిక్స్ కమిషన్‌లో సభ్యురాలిగా నియమితురాలైంది. ఆరుగురు సభ్యుల జాబితాను బీడబ్ల్యూఎఫ్ సోమవారం ప్రకటించింది. ఇందులో సింధుతో పాటు ఐరిస్ వాంగ్ (అమెరికా), రాబిన్ టబెలింగ్ (నెదర్లాండ్స్), గ్రేసియా పొలి (ఇండోనేసియా), కిమ్ సోయెంగ్ (కొరియా), జెంగ్ సి వి (చైనా) కూడా ఉన్నారు. త్వరలోనే చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ను ఎంపిక చేయనున్నారు. కాగా సింధు 2025 వరకు అథ్లెటిక్స్ కమిషన్‌లో సభ్యురాలిగా ఉంటుంది. ఇక పీవీ సింధు రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యోలో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment