PV Sindhu: అందని ద్రాక్ష.. సింధు సాధించేనా! | BWF World Tour Finals PV Sindhu Handed Good Draw Eyes On Semis | Sakshi
Sakshi News home page

PV Sindhu: ఈ ఏడాది అందని ద్రాక్ష.. సింధు సాధించేనా!

Published Wed, Dec 1 2021 8:57 AM | Last Updated on Wed, Dec 1 2021 12:32 PM

BWF World Tour Finals PV Sindhu Handed Good Draw Eyes On Semis - Sakshi

BWF World Tour Finals PV Sindhu Handed Good Draw Eyes On Semis: ఈ ఏడాది అందని ద్రాక్షగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ కోసం భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి ప్రయత్నించనుంది. డిసెంబరు 1 నుంచి మొదలయ్యే బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్‌ సింధుకు సులువైన ‘డ్రా’నే పడింది. ఆమె తన స్థాయికి తగ్గట్టు ఆడితే సెమీఫైనల్‌ చేరుకోవడం ఖాయమే. వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో ఎనిమిది మంది క్రీడాకారిణులను రెండు గ్రూప్‌లుగా విభజించారు.

గ్రూప్‌ ‘ఎ’లో సింధు, పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌), లైన్‌ క్రిస్టోఫర్సన్‌ (డెన్మార్క్‌), వైవన్‌ లీ (జర్మనీ)... గ్రూప్‌ ‘బి’లో అకానె యామగుచి (జపాన్‌), బుసానన్‌ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌), ఆన్‌ సెయంగ్‌ (దక్షిణ కొరియా), జియా మిన్‌ యె (సింగపూర్‌) ఉన్నారు. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. తొలి మ్యాచ్‌లో లైన్‌ క్రిస్టోఫర్సన్‌తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్‌... పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప పోటీపడనున్నారు.  

చదవండి: IPL Retention: ఈ 27 మంది ఓకే.. మరి ఆ ఆరు స్థానాలు.. వార్నర్‌, రాహుల్‌, రషీద్‌, గిల్‌ ఇంకా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement